ప్రతి ఒక్కరు తీవ్రమైన వ్యాధుల బారిన పడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణాలు తీసుకునే ఆహార పదార్దాలు, జీవన విధానంలో మార్పులు. అయితే ముఖ్యంగా మనం ఉపయోగించే వంట నూనె వంట నూనె వలన కూడా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుంది.

ఆలివ్ నూనె ఆరోగ్యానికి మంచిదని అని అంటున్నారు. మరి ఈ ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఇక్కడ తెలుసుకుందాం. ఆలివ్ నూనె తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) వున్నాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఈ, విటమిన్ కె(Vitamin K), ఒమేగా 3(Omega 3)  కొవ్వు ఆమ్లాలు(Fat Amla), ఐరన్(Iron), యాంటీ –  ఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి. ఇది కొలెస్ట్రాల్ను(Cholesterol) అదుపులో ఉంచుతుంది.

గుండెకు కూడా మేలు చేస్తుంది. ధమనుల పని తీరుకు అడ్డంగా నిర్మితమైన కొవ్వును తొలిగించి ధమనుల(Arteries) యొక్క రక్త ప్రసరణను మరింతగా మెరుగు పరిచి గుండె పోటును మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం బాగా సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్(Olive OIL) లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వున్నాయి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంపొందిస్తాయి. ఆహారంలో ఆలివ్ ఆయిల్ని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ల(Cancers)ను నివారించవచ్చు. ఇది శరీరంలో వృద్ధి చెందుతున్న కాన్సర్ పెరుగుదలను మందగించేలా చేస్తుంది.

ముఖ్యంగా ఇది పెద్ద ప్రేగు(Big Intestine) మరియు రొమ్ము కాన్సర్(Breast Cancer) నివారించే ప్రధానమైన ఏజెంట్ గా పని చేస్తుంది. ఆలివ్ నూనెను ఆహారంలో  ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల రక్తంలో వున్నా చెక్కర స్థాయిలను నియంత్రించడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల,టైపు 2 మధుమేహం వల్ల, రక్తంలో కలిగే గ్లూకోస్ స్థాయిల(Glucose Levels)ను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్(Insulin) యొక్క సున్నితత్వాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ యాంటీ – రిప్రెసెంట్(Anti Represent) గా  పని చేస్తుంది.

ఈ నూనెలో ఒమేగా త్రీ మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండడం వల్ల మెదడు యొక్క పని తీరును ప్రోత్సహిస్తూ, జ్ఞాపక శక్తిని పెంపొందించే  విధంగా పని చేస్తుంది.

ఈ ఆలివ్ ఆయిల్ జుట్టు(Hair)కి కావాల్సిన పోషకాలను అందించి జుట్టును తేమ(Wet)గా ఉంచుతూ చుండ్రుని పోగొట్టి, జుట్టును మరింతగా బలపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ యాంటీ ఇన్ఫలంటరీ(Anti Inflammatory) లక్షణాలు ఎక్కువగా కలిగి వున్నాయి. ఏ నూనెను నొప్పులనుంచి ఉపశమనాన్ని పొందేందుకు ఉపయోగిస్తారు. కీళ్ల వాపులు బాగా వేయటం, ఇతర శారీరక నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఆలివ్ నూనె ను వాడటం వలన ఆర్థరైటిస్(Arthritis) వంటి రుగ్మతలను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ను అనేక బాక్టీరియా(Bacteria) మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల(Fungal Infections) చికిత్స(Treatment)కు ఉపయోగిస్తారు. ఆలివ్ నూనెలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతూ పునర్జీవనాన్ని ప్రసాదించి చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. మచ్చల(Marks)ను, మొటిమల(Pimple)ను తేలికగా తొలిగిస్తుంది. ఇది గొల్ల యొక్క ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

ఆలివ్ నూనె మన ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించడంలో అద్భుతంగా పని చేస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంతకంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కావాల్సింది ఏముంటుంది.

అందరు ఆహారంలో ఈ నూనెను వినియోగించడం ద్వారా ఆరోగ్యం(Health) మీ సొంతం చేసుకోండి.