స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో (Reality show) బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) కి మంచి ప్రేక్షకాదరణ ఉందన్న  విషయం మనందరికీ తెలిసిన సంగతే.

మొత్తం 19 మంది  కంటెస్టెంట్స్ తో  షో ప్రాంభించగా, డే వన్ నుంచే గొడవలు, కొట్లాటలతో ఎవరికి వారు వాళ్ళఆటిట్యూడ్  చూపిస్తున్నారు.

ఇక అప్పుడే ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ తో మొదటి వారం ముగిసింది. రెండో వారం నామినేషన్ ప్రక్రియ జరిగిపోయింది.

ఇప్పుడు కెప్టెన్సీ కోసం పోరాపోరిగా పోట్టి జరుగుతోంది. హౌస్ మేట్స్ లో ఆవేశాలు, కోపాలు, బూత్ పురాణాలూ తో అమాంతం పెరిగిపోతోంది తప్ప, ఎక్కడ తగ్గడం లేదు.

లోబో కాస్తో కూస్తో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, తప్ప పూర్తి ఎంటర్టైన్మెంట్ హౌస్ లో కనిపించట్లేదు. ఈ రణ రంగానికి  కాసేపు బ్రేక్ ఇవ్వాలనుకున్నాడో ఏంటో బిగ్ బాస్. హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు.

మరి ఆ టాస్క్ విషయాలు ఏంటో  సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో చూద్దాం.

కెప్టెన్సీ (Captany) పోటీదారులను ఎంపిక చేసే  క్రమంలో బిగ్‌బాస్‌ (Big boss)’అగ్గిపుల్లా మజాకా’ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రెండు టీమ్స్‌ తమ తమ బాక్సుల్లోని ఇసుకలో అగ్గిపుల్లలు ముట్టించి చివర్లో ఉన్న కర్పూరం అంటుకునేలా చేయాల్సి ఉంటుంది.

Aggi pulla majaka

ఈ టాస్కులో పర్పుల్‌ టీమ్‌ గెలవడంతో జెండా లభించింది.

‘పంతం నీదా నాదా’

ఓవరాల్‌గా ‘పంతం నీదా నాదా’ టాస్క్‌(Task) ముగిసే సమయానికి గద్ద టీమ్‌ ఆరు, నక్క టీమ్‌ ఐదు జెండాలు సాధించింది. దీంతో గద్ద టీం గెలిచారు.

తరువాత  హౌస్‌లో శ్వేత బర్త్‌ డే సెలెబ్రేట్ చేశారు.

swetha-varma-1ఈ సందర్భంగా శ్వేత తండ్రి విషెస్‌ చెప్పిన  ఓ వీడియోను బిగ్‌బాస్‌ ప్లే చేయడంతో ఆమె ఎమోషనల్‌ అయింది.తరువాత హౌస్ మేట్స్  కోసం చాక్లెట్లు పంపి సర్‌ప్రైజ్‌ చేసిన బిగ్ బాస్.

ఇదిలా వుంటే రాత్రిపూట గిన్నెలు కడుగుతున్న మానస్‌కు సాయం చేయడానికి వచ్చింది లహరి.

కాసేపు వాళ్ళ మధ్య క్యూట్ డిస్కషన్ జరిగిన తరువాత ఒకరిఒక్కరు హగ్ లు ఇచ్చుకుని గుడ్‌నైట్‌ చెప్పగా  లహరి  మానస్ ని బెడ్‌ దాకా రమ్మని చెప్పింది.

ఇక హౌస్ లో లోబో, ఉమా  ఒకరిఒక్కరు ప్రేమ గా మాట్లాడుతూ  కాసేపు  ఫన్ చేసారు.ఈ సీన్ ని చూడలేకపోయిన హౌస్ మేట్స్(House Mates) తమలో తామే నవ్వుకున్నారు.

ఇక ఉమా లోబో తినిపించడం, లోబో అందరికన్నా నువ్వే అందం గా వున్నావంటూ కాస్త  డ్రామా క్రియేట్ చేసారు.

ఇదంతా చూస్తున్న రవి ఉమా ని చూస్తూ మీరు యాక్టింగ్ చేస్తున్నారని తెలిసిపోతుందని చెప్తాడు.  యానీ మాస్టర్, పింకీ, విశ్వ,హమీదాలు కెప్టెన్సీకి పోటీదారులుగా తెలిపిన గద్ద టీమ్‌ కెప్టెన్‌ శ్రీరామచంద్ర. ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ అనే టాస్క్‌ ఇచ్చిన బిగ్ బాస్.

ఇందులో హౌస్‌మేట్స్‌ కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నారో వారి బీకర్లలో కొబ్బరికాయ నీళ్లు నింపాల్సి ఉంటుంది.

ఎవరి బీకరు ముందుగా నిండితే వాళ్లు కెప్టెన్‌ అవుతారు. ఈ టాస్కులో సెకండ్‌ కెప్టెన్‌గా విశ్వ గెలిచాడు.

షణ్ముఖ్‌లోని మరో అంగెల్ (angle) ని చూపించిన  యాంకర్‌ రవి.

హౌస్‌లో హమీదా స్మార్ట్‌, హాట్‌, క్యూట్‌, ఇంటెలిజెంట్‌ అని నాతో అన్నావ్‌ కదా అని అందరి ముందే షణ్ముఖ్‌ను అడిగేశాడు.

చెల్లెలు కూడా అన్నావనగానే ఆ మాట మాత్రం అనలేదు, తాము ఫ్రెండ్స్‌ అని చెప్పాడు. దీనితో షాక్ ఐన  రవి.. షణ్ముఖ్‌ ఎంతో ఇష్టపడే పిల్లో మీద S,D పాటు H అని కూడా రాద్దామని జోక్‌ చేశాడు. అయితే హమీదా మాత్రం..

దీప్తి పేరు తీసేసి తన పేరు రాసుకోమంది, కావాలంటే బయటకెళ్లాక మళ్లీ దీప్తి పేరు రాసుకోమని సలహా ఇచ్చింది. దీనితో అక్కడున్న రవి, లహరి అవాక్కయ్యారు . అయితే చివర్లో మాత్రం ఫ్రెండ్‌షిప్‌ కొద్ది సరదాగా అన్నానని అంటుంది హమీద.

ఇక ఇంట్లో సింగిల్‌ బెడ్‌  కోసం ఉమా, లోబోకు ప్రత్యేక టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌ (Big boss). వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్లకు ఆ బెడ్‌ సొంతమని చెప్పాడు.

దీనితో రెచ్చిపోయిన లోబో.. పింకీతో కలిసి స్కిట్‌ చేసి ఎంటర్టైన్(Entertain) చేసాడు. ఆ తర్వాత వచ్చిన ఉమాదేవి.. సిరితో కలిసి అత్తాకోడళ్ల స్కిట్‌ వేసి కామెడీచేసింది. ఈ కామెడీ స్కిట్‌లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న లోబో విన్నర్ గా నిలిచాడు. దీంతో సంతషం పట్టలేక  లోబో  ఏకంగా స్విమ్మింగ్‌ పూల్‌లో దూకేసాడు.

ఇన్నాళ్లు నేలపై పడుకున్న తనకు సింగిల్‌ బెడ్‌ లభించడంతో ఎమోషనల్‌ అయిన లోబో కన్నీళ్లతో హౌస్‌మేట్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. తనేదైనా తప్పు చేస్తే క్షమించమని కోరాడు. తను గెలిచిన బెడ్‌ను ఉమాదేవికి ఇస్తున్నట్టు వెల్లడించాడు.

ఆ తర్వాత హౌస్‌లో షణ్ముఖ్‌ బర్త్‌ డేని సెలబ్రేట్‌(Celebrate) చేశారు. ఈ సందర్భంగా వాళ్ల పేరెంట్స్‌ విషెస్‌ తెలిపిన వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్‌. తరువాత  షన్ను గైర్ల్ ఫ్రెండ్  దీప్తి సునయన

Deepthi sunaina

బర్త్డే విషెస్ తో పాటు, ఐ లవ్‌యూ చెప్పిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్ అవ్వడంతో అందరూ తనను ఓదార్చారు.

మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్‌ లో ఆవేశాలకు, నోటి కి పని చెప్పకుండా  కాస్త ఎంటర్టైన్మెంట్ తో ఎపిసోడ్ చాలా కూల్ గా ముగిసింది .

మరి రేపటి ఎపిసోడ్ లో బిగ్‌బాస్‌ హౌస్ మేట్స్(Housemates)  మధ్య మళ్లీ ఎలాంటి టాస్క్ లతో నిప్పంటించనున్నారో .