బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) పదమూడో వారం పూర్తయింది. ఈ వారం వెళ్ళిపోతుంది, ఆ వారం వెళ్ళిపోతుంది అన్న మాటలకు చెక్ పెడుతూ తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్(Contestant) అని నిరూపించుకున్న ప్రియాంక సింగ్ పదమూడో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి  ఎలిమినేట్(Eliminate) అయ్యి బయటకు వెళ్ళిపోయింది.

హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక సండే ఫన్(Fun) కూడా ప్రేక్షకులను పెద్ద గా ఆకట్టుకోలేకపోయింది. ముందు ముందు ఎలాంటి టాస్క్(Task) లతో ట్విస్ట్ లు ఇవ్వనున్నాడు బిగ్ బాస్.

ఈ  షో ముగిసిపోవడానికి దగ్గర పడుతున్న కొద్దీ విన్నర్ ఎవరన్నా ఉత్కంఠ అటు హౌస్ మేట్స్(House mates) తో పాటు చూసే ఆడియన్స్(Audience) కూడా వుంది.

ఆదివారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ తో ఎలాంటి గేమ్స్(Games) ఆడించాడో ఆ హైలైట్స్ ఇక్కడ చూద్దాం.

హౌస్‌మేట్స్‌ తో ఓ వైవిధ్యమైన గేమ్‌(Variety Game) ఆడించిన కింగ్‌ నాగార్జున.  అస్లీ కారెక్టర్ అంటూ బాగా ఫేమ్(Fame) లో వున్నా పాత్రలతో  హౌస్ మేట్స్(House mates) ని పోల్చమనే టాస్క్(Task) ఇచ్చాడు. దీంతో సన్నీ మహానటి పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్‌(Perfect)గా సూట్ అవుతుందని తేల్చేసాడు.

ఇంకొకరిని కంట్రోల్‌లో పెట్టే డా.వశీకరణ్‌ షణ్నునే అని చెప్పింది సిరి. అందరినీ డామినేట్‌(Dominate) చేసే పెదరాయుడు కూడా షణ్నునే అని హౌస్ మేట్స్ అందరు ఫీలయ్యారు. నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకునే నీలాంబరి, వెన్నుపోటు పొడిచే కట్టప్ప, ఫిదాలోని భానుమతి పాత్రలూ సిరికే కరెక్ట్(Correct) గా సూట్ అవుతాయని చెప్పుకొచ్చారు.

ఇక  సన్నీకి అర్జున్‌రెడ్డి, చిట్టిబాబు, ఎవరి మాటా వినని సీతయ్య,  శ్రీరామ్‌ రేలంగి మావయ్య మాత్రమే కాదని దురదృష్టవంతుడైన మర్యాద రామన్న అని చెప్పుకొచ్చారు . శ్రీరామ్‌కు ఎవరు క్లోజ్‌ అయినా బయటకు వెళ్లిపోతారు అని నాగ్‌ అనడంతో అందరూ నిజమేనంటూ నవ్వేశారు. తర్వాత మానస్‌, కాజల్‌ సేఫ్‌(Safe) అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

ఆ తర్వాత  నాగ్‌ హౌస్ మేట్స్(House mates) తో లూడో ఆట (Ludo Game) ఆడించాడు. ఈ క్రమంలో మానస్‌ పిల్లోతో రొమాన్స్‌(Romance) చేయాలని నాగ్‌ ఆదేశించాడు. కానీ పిలో తో రొమాన్స్ చేయలేక  మానస్‌ ఫెయిల్ అయ్యాడు. దిండుతో ఎలా రొమాన్స్‌ చేయడమని అతడు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్‌ చేస్తావా? అని డైరెక్ట్ గా అడిగేశాడు నాగ్‌.

దీంతో షాకైన మానస్‌ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్‌ చేయించారు. టాప్‌ 7లో ఎవరుంటారని ఊహించలేదని షణ్నుని అడగ్గా అతడు కాజల్‌ పేరు చెప్పాడు.

ఈ కాజల్‌ హౌస్‌లో సింపతీ(Sympathy) కోసం ప్రయత్నిస్తుందన్నాడు మానస్‌. హౌస్‌లో కామన్‌సెన్స్(Common Sense) లేని వ్యక్తులు ఇద్దరున్నారని ఒకరు సిరి, మరొక్కరు పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్‌లో సన్నీ, కాజల్‌ విజేత(Winner)లుగా నిలిచారు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్‌ (Eliminate) అయినట్లు ప్రకటించగానే ఆమె భావోద్వేగానికి లోనయింది . నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్‌ చేయాల్సిందని మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఎమోషనల్(Emotional) అయింది పింకీ.

స్టేజి మీదకు వచ్చిన పింకీ తో చివరి సారిగా గేమ్‌(Game) ఆడించాడు నాగ్‌. ఇప్పుడున్న టాప్‌ 6 కంటెస్టెంట్లు(Contestants) హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పాలన్నాడు. మొదటగా సిరి గురించి చెప్తూ హౌస్ లో కి వచ్చినపుడు ఇదేంటి నాకంటే అందంగా ఉందని జెలస్(Jealous) ఫీల్ అయ్యాను . కానీ అదెప్పుడూ నా చెల్లెలిగా అనిపిస్తుంది.

తను ఈ హౌస్‌కు చాలా అవసరమని గట్టిగా  చెప్పింది. శ్రీరామ్‌తో ఫస్ట్‌ నుంచి ఇప్పటివరకు తన కనెక్షన్‌(Connection) ఒకేలా ఉందని తెలిపింది.  షణ్ను పక్కింటబ్బాయిలా అనిపిస్తాడని, అతడిని తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నయ్యగా ఫిక్స్ అయ్యానని చెపింది. హౌస్‌లో మొదటి రోజు సన్నీ అన్నయ్య నన్ను చూడగానే స్వప్నలోక సుందరి దొరికిందన్నాడు. కానీ నేను అన్నయ్య అని గాలి తీసేశానని నవ్వేసింది. కాజల్‌ చాలా అల్లరి చేస్తుందని చెప్పింది. ఆ అల్లరి చివరి దాక ఉండాలని చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌ హౌస్‌(Big Boss House)లో అడుగుపెట్టినప్పుడు మానస్‌ను చూసి హాయ్‌ చెప్తే అతడు స్పందించలేదు, అతనికి  ఎంత పొగరు? అసలు మాట్లాడొద్దనుకున్నాను. కానీ రానురానూ మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌(Friendship Bond) పెరిగిపోయింది. నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నీతో ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికీ కావాలి. నీ నుంచి ఏం ఎక్సపెక్ట్‌(Expect) చేస్తున్నాను? అని పదేపదే అడుగుతుంటావు కదా, నేను నువ్వు విన్నర్(Winner) అవ్వడం  కోరుకుంటున్నాను అని చెప్తూ ఏడ్చేసింది పింకీ.

ఇక పింకీ తన  కోసం ఏ పాట(Song) పడతావు అని మానస్ ని అడగగా ‘ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో’ అంటూ తన లోని బాధను కనిపించకుండా పాట పాడాడు.

అంతేకాక ఈ పాటను పింకీకి అంకితమిస్తున్నాననడంతో ఆమె ఆనందభాష్పా(Happiness)లు రాల్చింది. అలాగే సింగర్‌ శ్రీరామ్‌, ప్రియా ప్రియా.. చంపొద్దే అంటూ పింకీ కోసం సాంగ్‌ పాడాడు. తరువాత  ప్రియాంక అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.

ఇక పాదనాలుగో వారం మొదలవుతుంది. మరి  ఇంట్లో వున్న  హౌస్ మేట్స్(Housemates) ఎలాంటి రచ్చ మొదలుపెడతారో!