బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) శుక్రవారం కూడా కెప్టెన్సీ(Captency) పోటీదారులు టాస్క్ కొనసాగింది. అయితే రవి, యాని,శ్వేతా ప్రియాలు ఈ వారం కెప్టెన్ గా పోటీ  పడగా ప్రియా కెప్టెన్ అయ్యింది.

నిజానికి అన్ని టాస్క్ లో సన్నీ, మానస్ బాగా ఆడారు కానీ హౌస్ మేట్స్(House mates) గ్రూపులు గా విడిపోయి, వీళ్లకు అంత సపోర్ట్ ఇవ్వక పోవడం తో ఇద్దరు ఎమోషనల్(Emotional) అయ్యారు.

అలాగే ప్రతి వారం బెస్ట్ మరియు వరస్ట్ పెరఫార్మెర్ ని చెప్పాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఇంతకీ ఎవరు జైలు కి వెళ్లారో?

ఇంటి సభ్యులు  ఎక్కువ శాతం మంది ఒకరినే టార్గెట్ చేసారు. ఇవ్వని తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.

ప్రియ కెప్టెన్‌ (Captain))గా ఎంపిక అయ్యి అందరూ హాపీ గా ఉంటే, సన్నీ, మానస్‌లు మాత్రం వాళ్ళ కష్టాన్ని  హౌస్ మేట్స్(House mates)  గుర్తించకపోవడం తో ఎమోషనల్ అవ్వుతారు.

ఇక కొత్త కొప్టెన్‌ అయిన ప్రియకు యాంకర్ రవి అడ్వైజ్ ఇస్తాడు .ఆమె కెప్టెన్సీ లో  కూడా వేలు పెడుతూ కనిపించాడు. ఎవర్ని రేషన్ మేనేజర్‌గా ఎంచుకోవాలి? ఎవరికి ఏం వర్క్ ఇవ్వాలి? అన్న అంశాలపై  యాంకర్ రవి అడ్వైజ్  చేస్తాడు.

అయితే అన్ని టాస్క్‌లలో బాగా ఆడిన మానస్‌కి రేషన్ మేనేజర్ ఇవ్వాలని పింకీ ప్రియని రిక్వెస్ట్ చేసింది.  పింకీ కుక్ చేస్తుంది, లేదంటే మానస్‌కి సేవలు చేస్తుందని యాని మాస్టర్ అనడంతో ప్రియ దగ్గర బాధపడ్డాడు మానస్.

ఇంతలో  మానస్ కోసం ఫుడ్ తీసుకుని వచ్చి తినిపించే ప్రయత్నం చేస్తుంది ప్రియాంక . నాకు వద్దు నా పని నేను చేసుకుంటా.. నువ్ నాకు చేస్తున్నావని వాళ్లు కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్లకి ఆ అవకాశం నేను ఇవ్వను తరువాత తింటాను అని ముఖంపైనే పింకీ తో అంటాడు మానస్.

దీంతో హర్ట్ అయ్యిన పింకీ ఏడుస్తూ, ఒంటరిగా కూర్చుని ‘నాకు ఫీలింగ్స్ వున్నాయి. నాదే తప్పు అని ఏడ్చేసింది.  అయితే ఈ విషయం పై హౌస్ మేట్స్(house mates) మానస్ పింకీ ల మధ్య ఏదో ఉందని చెవులు కోరుకుంటారు. ఇదంతా చూస్తున్న మానస్ పింకీకి దూరంగా ఉండడం మంచిది అని అనుకుంటాడు.

ఈవారం ఎవరు బెస్ట్, వరస్ట్, పర్ఫామర్ అని అనుకుంటున్నారో నెక్ లాక్‌లో వాళ్లని బంధించి, కారణాలు  చెప్పి..  వాళ్ల ముఖంపై నీళ్లు పోయాలని  చెప్పారు బిగ్ బాస్. ఇలా  ఎవరి ముఖం మీద ఎక్కువ మంది  ఇంటి సభ్యులు నీళ్లు చల్లుతారే వాళ్లు జైలుకి వెళ్తారని మెలిక పెట్టే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్(Big boss). మొదటిగా కాజల్‌ని శ్వేత.. వరస్ట్ పెర్ఫామర్ అని చెప్తూ ఆమె ముఖంపై నీళ్లు చల్లింది.

ఆ తరువాత జెస్సీ.. శ్రీరామ్‌ముఖంపై నీళ్లు కొట్టి వరస్ట్ పెరఫార్మెర్ గ పేర్కొన్నాడు. ఈ సందర్భంలో శ్రీరామ్-జెస్సీల మధ్య హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. షణ్ముఖ్, విశ్వ టాస్క్ ఆడేటప్పుడు చిల్లర అంటూ మాట్లాడిన మాటలు తనకి నచ్చలేదనిఅందుకే  చెత్త పెర్ఫామర్ అని చెప్తూ.. ముఖంపై నీళ్లు కొట్టాడు షన్ను.

అనంతరం హమీద కాజల్ ని,  సిరి విశ్వని వరస్ట్ పెరఫార్మెర్ గా సెలక్ట్ చేసారు. అయితే  షణ్ముఖ్ఎవర్ని నామినేట్(Nominate) చేస్తే సిరి షన్ను ని గుడ్డిగా ఫాలో అయ్యిపోతుంది. పైగా సిరి, షన్నులు నామినేట్ చేసే కారణాలు  కూడా ఒకేటే. ఇక శ్రీరామ్ కూడా కాజల్ ముఖంపైనే నీళ్లు చల్లాడు.

వెంటనే కాజల్ కూడా శ్రీరామ్‌ని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్తూ ముఖంపై నీళ్లు కొట్టింది. ఇక యాని  మాస్టర్ కూడా కాజల్ ని వరస్ట్ పెరఫార్మెర్ గా చెప్పి కాజల్ పై తనకున్న కోపాన్ని చుపెట్టుకోవడానికి యాని మాస్టర్  ముఖంపైనే నీళ్లు చల్లుకుంది.

ప్రియ, విశ్వని చెత్త పెర్ఫామర్ అని అంటూ నీళ్లు కొట్టింది. ఇక లోబో, రవి టీంలో ఉంటూ అతనికే వెన్నుపోటు పొడిచావ్ అందుకే నాకు నచ్చలేదని కాజల్‌ని చెత్త పెర్ఫామర్ అని చెప్పాడు లోబో.

ఇక రవి కూడా కాజల్‌నే చెత్త పెర్ఫామర్ అని అంటూ ముఖంపై నీళ్లు కొట్టాడు. నేను పనులు చేయనని స్టేట్ మెంట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. పైగా నేను రాజుగా గెలిచిన తరువాత కూడా అందరూ జై జై అంటే నువ్వు మాత్రం సన్నీకి జై అని అన్నావని వాగ్వాదానికి దిగాడు.

ఎలా ఉండాలో నేర్చుకో అంటూ పద్దతి గురించి రవి కాజల్‌కి  సలహా ఇస్తాడు. పద్దతుల గురించి నువ్వు  నాకు చెప్పకు అని  కౌంటర్ ఇచ్చింది కాజల్. ఈరోజు నుంచి నువ్వు  నన్ను ఫ్రెండ్ అని చెప్పకు అంటుంది  కాజల్.

ఆ తరువాత మానస్, సన్నీ  శ్రీరామ్‌ని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్పి ముఖంపై నీళ్లు కొట్టారు .విశ్వ కాజల్‌ని చెత్త పెర్ఫామర్ అని అంటూ ముఖంపై నీళ్లు కొట్టాడు. చివరగా ప్రియ, విశ్వని వరస్ట్ పెర్ఫామర్ అని అంటూ ముఖంపై నీళ్లు కొట్టింది.

ఈ టాస్క్‌(Task) లో ఎక్కువ మంది ఇంటి సభ్యులు కాజల్‌ని టార్గెట్ చేసి ఆమెను చెత్త పెర్ఫామర్(Worst performer) అని నీళ్లు కొట్టడంతో ఆమెను జైలు‌లో వేసి తాళం వేయాల్సిందిగా బిగ్ బాస్(Big boss) ఆదేశించారు.

దీంతో కాజల్ జైలుకు వెళ్ళింది. ఎక్కవ శాతం ఇంటి సభ్యులు కాజల్ తొక్కే ప్రయత్నం చేసారని అనిపిస్తుంది. ప్రతొక్కలు కాజల్ కి ఎలా ఉండాలో సలహాలిచ్చేవాళ్లే, మరి రవి అయితే విపిక్కల దాక కాజల్ పై కోపం ఉంపెట్టుకున్నాడు.

ఈ  వారం లో జరిగిన విషయాలలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు చేసారో తెలియాలంటే వీకెండ్ హోస్ట్ రావాల్సిందే. నాగ్ సార్ హౌస్ మేట్స్(House mates) కి క్లాస్ ఇవ్వాల్సిందే.