బిగ్ బాస్ సీజన్ 5 (Big Boss season 5)నాగ్ సార్ ఫైవ్ మచ్ ఎంటర్టైన్మెంట్(Entertainment) తో ప్రేక్షకులను అలరించడానికి శనివారం మన ముందుకు వచ్చేసారు.

అయిదో వారం ఎలిమినేషన్(Elimination) లో 9 మందు కంటెస్టెంట్ ఎలిమినేషన్ లో వున్నారు. ఎవరెవరికి నాగ్ క్లాస్ పీకారు? నాగ్ తో పాటు ఈ షో లో కంటెస్టెంట్స్ ని అడిగేస్తాం, కడిగేస్తాం అంటూ వచ్చిన గెస్ట్స్ ఎవరు?

అలాగే హౌస్ మేట్స్ తో  చేసిన సందడి గురించి తెలుసుకోవాలంటే శని వారం జరిగిన ౩5 వ ఎపిసోడ్ చూడాల్సిందే.

హౌస్ మేట్స్(House mates) అందరు కలిసి తనను టార్గెట్ చేసి మరి  జైల్ కి పంపడాన్ని తట్టుకోలేకపోయింది కాజల్‌.

ఆ సమయం లో ఓదార్చకుండా ఇంకా నిప్పు రేపాడు మానస్. నువ్వు సింపథీ కార్డ్‌ ప్లే చేస్తున్నావని యాంకర్‌ రవి తనతో అన్నాడంటూ కాజల్‌తో చెప్పుకొచ్చాడు.

అతడు హౌస్‌లో అందరికీ బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నాడనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. తన వెనక ఇలా మాట్లాడుకుంటున్నారు అని షాక్ అయింది కాజల్.

రాజా రాజా ది గ్రేట్ అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగ్ కంటెస్టెంట్స్(Contestants) ని పలకరించిన నాగ్. షో ని ముందు శ్రీరామ్ ని ప్రశ్నిచడంతోనే మొదలుపెట్టాడు.

బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని అడిగేశాడు. దీంతో కొద్ది క్షణాలపాటు ఆలోచించిన శ్రీరామ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ అని తడుముకోకుండా ఆన్సరిచ్చాడు. అతడి సమాధానం విని నవ్వేసిన నాగ్‌.

నీ కెప్టెన్సీ(Captaincy) బాగుంది కానీ , ఎవరి వంట వాళ్లు వండుకోవాలని ఆర్డర్‌ వేయడం బాగోలేదని చురకలంటించాడు. తర్వాత సిరిని నిల్చోబెట్టి క్లాస్‌ పీకాడు.

రోజంతా హౌస్ మేట్స్ గురించి వెనక మాట్లాడుతూ వుంటావా అని కడిగిపారేశాడు. ఎదుటివాళ్లకు నీతులు చెప్తాం కానీ మనం మాత్రం పట్టించమని సెట్టైర్ వేసాడు. దీంతో సిరి మౌనం గా వుండి పోయింది

తర్వాత ‘కొండపొలం'(Konda Pollam movie) మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ తేజ బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేసారు. ఈ క్రమంలో నాగ్‌..  ఇంత చిన్నవయసులోనే రకుల్‌ను ప్రేమించేశావా అనడంతో వైష్ణవ్‌తేజ్‌ తెగ సిగ్గుపడ్డాడు.

తర్వాత క్రిష్‌.. టాస్కులు ఆడకుండా ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో లోబో ఎదో చెప్పి  కవర్ చేసుకున్నాడు.

ఆ తర్వాత ప్రియాంక సింగ్‌  ను టాప్ ఫైవ్ లో నీతో పాటు ఎవరు వుండాలనుకుంటున్నావ్ అని అడిగిన ప్రశ్నకు తనతో పాటు షణ్ముఖ్‌, రవి, మానస్‌, శ్రీరామ్‌ టాప్‌ 5లో ఉంటారని అభిప్రాయపడింది.

కంటెస్టెంట్లను(Contestants) ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టించి తరువాత  వైష్ణవ్‌ తేజ్‌, క్రిష్‌ (Big boss) స్టేజీకి చెప్పారు.

ఇక నాగ్ కాజల్ ని ఎవరైనా మిడిల్‌ ఫింగర్‌ చూపించారా? అని అడుగగా  అవునని తలూపింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు వీడియో ప్లే చేయించాడు నాగ్‌. అందులో లోబో మిడిల్‌ ఫింగర్‌ చూపించినట్లు స్పష్టమైంది.

అయితే తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేశాడు. దీంతో చల్లబడిన నాగ్‌.. చేసింది తప్పే.. కానీ కావాలని చేయలేదంటున్నావు, దాన్ని మేమంతా నమ్ముతున్నాం అనడంతో లోబో రిలాక్స్ అయ్యాడు .

తరువాత  నాగ్‌.. హౌస్‌మేట్స్‌తో రూలర్‌ ఎవరు? స్లేవ్  ఎవరు? అన్న టాస్క్‌ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్‌ ప్రియ.. శ్రీరామ్‌ రూలర్‌, హమీదా బానిస అని చెప్పింది. శ్రీరామ్‌.. హౌస్‌(House) అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసిన కాజల్‌ రూలర్‌, షణ్ముఖ్‌ బానిస అని తెలిపాడు.

కాజల్‌.. అందరితో మంచిగుండాలనుకునే  ప్రియను రూలర్‌గా, అందరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్‌ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని తెలిపింది .

ప్రియాంక సింగ్ రవిని రాజుగా, లోబోను బానిసగా చెప్పుకొచ్చింది. రవి.. మానస్‌ను రాజుగా, ప్రియాంక సింగ్‌ను బానిసగా ఫీలయ్యాడు . సన్నీని రాజుగా చూసుకుంటానంటూ మానస్‌.. తన బెస్ట్‌ ఫ్రెండ్‌కు కిరీటం ధరించాడు. శ్రీరామ్‌తో ఎక్కువ కనెక్ట్‌ అయి, గేమ్‌కు డిస్‌కనెక్ట్‌ అవుతున్నావంటూ హమీదాను బానిసగా ఫీలయ్యాడు.

సన్నీ.. మానస్‌ రాజు, విశ్వ బానిస అని చెప్పాడు . లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్‌.. నాకు నేనే రాజు అని చెప్పుకున్నాడు. దీంతో నాగ్‌.. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్‌(Nominate) చేశారని కౌంటరిచ్చాడు.

సీక్రెట్ నామినేషన్ లోనే చేసారని, ఓపెన్ గా ఎవరు నామినెటే చేయలేదని అన్నాడు. దింతో బయటైన్ చేసేదాన్ని అని ప్రియా అంటే ఐన ఎవరు ఓపెన్ గా నామినేట్ చేయలేదు అంటాడు షణ్ను. మైండ్‌గేమ్‌ ఆడిన రవి కింగ్‌ అని చెప్తూనే, ఈ వారం మొత్తంలో హమీదా ఎక్కడా కనిపించలేదంటూ ఆమెను బానిసగా అభివర్ణించాడు.

హమీద కూడా నువ్వు ఆడవా గేమ్ అని కౌంటర్ ఇచ్చింది . ఇక హమీదా.. మానస్‌ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే కాజల్‌ రాణి, ఇన్‌ఫ్లూయెన్స్‌ అయ్యే మానస్‌ బానిస అని అభిప్రాయపడింది.

జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్‌.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా తెలిపింది . సిరి.. రవికి కిరీటం తొడిగించి రాజుగా అందలం ఎక్కించగా, శ్రీరామ్‌ను బానిసగా ఫీలైంది.

తర్వాత విశ్వ వంతు రాగా.. అతడు రవిని రాజుగా పొగిడాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రవి అని ప్రశంసించాడు. కెప్టెన్‌ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు.

9 మంది నామినేషన్‌(Nomination)లో ఉన్నప్పటికీ నాగార్జున ఈరోజు ఎవరినీ సేవ్‌ చేయకపోవడం విశేషం. అయితే సోషల్‌ మీడియాలో హమీద  ఎలిమినేట్‌(eliminate) అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఎవరెవరు సేవ్ అవ్వుతారు ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ (big boos) ఇంటి నుంచి బయటకు వెళ్తారో సండే ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే. వీకెండ్ షోస్  రాత్రి 9 కి ప్రసారం అవ్వుతుండగా, నవరాత్రి ని పురుస్కరించుకుని ఈ షో ఆదివారం 6 గంటలకు టెలి కాస్ట్ కానుంది.