కన్నడ బ్యూటీ(Kannada Beauty) ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వరుస  సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్(Block Busters) అందుకుంటోంది.

స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతూ పలు భాషా(Multi Languages) చిత్రాల్లో నటిస్తోంది. చలో మూవీ(Chalo Movie)తో  తెలుగు ప్రేక్షకుల(Audience)కు పరిచయమైన ఈ బ్యూటీ సక్సెఫుల్Successful) గా కెరీర్(Career) లో ముందుకు తీసుకెళుతోంది. దీంతో అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ..

ఇటీవలే అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి నేషనల్(National) వైడ్ క్రేజ్(Wide Craze) అందుకుంది. వరుస ఆఫర్స్‌(Offers) తో దూసుకుపోతున్న ఆమె సీతారామం(Seetha Ram) సినిమాలో ఛాలెంజింగ్ రోల్(Challenging Role) చేసి విమర్శలు(Critics) ప్రశంసలు అందుకుంది. ఓ ముస్లిమ్ యువతిగా రష్మిక నటన చూసి అంతా ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు మరో క్రేజీ ఆఫర్(Crazy offer) దక్కిందని తెలుస్తోంది. అక్కినేని నాగ చైత‌న్య‌ (Naga Chaitanya) హీరోగా చేయబోతున్న కొత్త సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ టాక్(Recent Talk). తాజాగా  థాంక్యూ (Thank You) సినిమాతో ప్రేక్షకుల ముందుకుకొచ్చిన నాగ చైతన్య.. తన నెక్స్ట్  ప్రాజెక్టు(Next Project) కోసం రెడీ అవుతున్నాడు.

గీతా గోవిందం(Geetha Govindam) ఫేమ్ ప‌రుశురామ్ పెట్ల(Parusuram Petla) దర్శక‌త్వం(Direction)లో ఆయన ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్‌(Heroine)గా ర‌ష్మికను కన్ఫర్మ్(Confirm) చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించగా.. భారీగా రెమ్మ్యూనరేషన్(Huge Remuneration) డిమాండ్ చేసిందట. అయినప్పటికీ మేకర్స్(Makers) వెనక్కి తగ్గలేదని సమాచారం.

ప్రస్తుతం కోటి రూపాయ‌ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ర‌ష్మిక.. ఈ సినిమాకు గాను రెండు కోట్ల వ‌ర‌కు పారితోషికం డిమాండ్ చేసిందట. అయితే ఆమెకున్న క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో మేకర్స్ ఓకే చెప్పారట.

గతంలో అదే పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం సినిమా చేసి భారీ హిట్ ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్న. ఈ సినిమాతోనే ఆమెకు స్టార్ స్టేటస్(Star Status) వచ్చింది. అందుకే మరోసారి పరశురామ్ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్(Interest) చూపుతోందట ఈ బ్యూటీ.

ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది రష్మిక. ఈ మూవీ మొదటి భాగంలో శ్రీవల్లి(Sri Valli) గా రష్మిక నటన అబ్బురపరిచింది. పుష్ప 2(Puspha 2) లో అంతకుమించి అన్నట్లుగా ఆమె క్యారెక్టర్ డిజైన్(Character Design) చేశారట సుకుమార్.

ఈ సినిమా కోసం అటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు(Waiting) చూస్తున్నారు.