రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్(Telangana EAMCET) ఫలితాల(Results) విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 12న అంటే శుక్రవారం ఫలితాలను విడుదల చేయనున్నారు అధికారులు.

ఈ మేరకు రేపు ఎంసెట్ కమిటీ(EAMCET Committee) సమావేశం కానుంది. ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. తరువాత  ఫలితాల రిలీజ్  డేట్(Release Date) ని నిర్ణయించనున్నారు అధికారులు. మంత్రి(Minister) సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఇచ్చే సమయం ఆదారంగా ఈ నెల 12 లేదా 13న ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు .

ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్(Official Website) https://eamcet.tsche.ac.in/ లో తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. గత నెల 18 నుంచి 21వ తేదీ వరకు ఇంజనీరింగ్(Engineering) లో ప్రవేశాల(Entrance)కు తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించారు.

ఈ ఎగ్జామ్(Exam) కు 1,56,812 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్(Agriculture), ఫార్మా కోర్సు(Pharma Courses)ల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షను 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన కీ(KEY)ని సైతం అధికారులు ఇటీవల విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను సైతం స్వీకరించారు.

ఫలితాల విడుదల తరువాత అభ్యర్థులు ఇలా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..

Step 1: అభ్యర్థులు (Candidates) మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో రిజల్ట్ లింక్ (Results Link) కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్(Hall Ticket Number), డేట్ ఆఫ్ బర్త్(DOB) నమోదు చేసి సబ్మిట్(Submit) పై క్లిక్ చేయాలి.

Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ (Results Screen) పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.