మెగా స్టార్(Mega Star) చిరంజీవి హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం(Direction)లో వస్తోన్న చిత్రం ఆచార్య(ACHARYA Movie).‘సైరా నర్సింహా రెడ్డి’ వచ్చిన తర్వాత మళ్లీ వెండి తెర(Silver Screen)పై కనిపించని మెగాస్టార్, ఆచార్యతో మరోసారి ఫాన్స్(Fans) ని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ నటిస్తుండడం, సక్సెస్ డైరెక్టర్(Success Director) గా పేరు తెచ్చుకున్న కొరటాల దర్శకత్వం వహిస్తుండడంతో ‘ఆచార్య’పై అంచనాలు భారీగా పెరిగింది. ఇప్పటి వరకు రిలీజైన ఫస్ట్‌ లుక్‌(First Look), పాటలు(Songs) మరింత  అంచనాలను పెంచుతోంది.

ఇక తన సినిమాలో పక్కాగా స్పెషల్‌ సాంగ్‌(Special Song) ఉండేలా ప్లాన్‌ చేసుకునే కొరటాల ‘ఆచార్య’లోనూ హుషారెత్తించే ఓ స్పెషల్‌ పాటను చిత్రీకించారు.

రెజీనా ప్రత్యేక పాత్రలో నటించిన ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే పాట టీజర్‌(Song Teaser)ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మేకర్స్‌(Makers) ఈ పాట పూర్తి లిరికల్‌ వీడియో(Lyrical Video)ను సోమవారం(జనవరి 3) రిలీజ్ చేశారు. ‘కల్లోలం కల్లోలం.. అల్ల కల్లోలం’ అనే లిరిక్స్‌ తో మొదలయ్యే ఈ పాట మెగాస్టార్ ఫాన్స్ ని మస్త్ ఖుషీ చేస్తోంది.

ముఖ్యంగా చిరంజీవి ఈ పాటకు వేసిన స్టెప్పు(Steps)లకు అభిమాను(Fans)లు ఫిదా అవుతున్నారు. ఎన్నేళ్లు అయినా చిరు స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. ఈ లిరికల్ సాంగ్ కి తనదైన శైలిలో స్టెప్స్ వేసి రచ్చ చేసారు చిరు.

ఇక  రెజీనా(Regina)తో పోటీపడీ మరీ కాలు కదిపారు. దీంతో ఈ పాట రిలీజ్ చేసిన కొత్త క్షణాల్లోనే రికార్డు వ్యూస్‌(Record Views)తో దూసుకుపోతోంది. ఈ పాటను భాస్కరభట్ల రచించగా, సింగర్స్ గీతా మాధురి, రేవంత్‌, పాడారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్  మణిశర్మ అందించిన ట్యూన్స్‌(Tunes) ఈ సాంగ్ కు మరింత క్రేజ్‌(Crazy)ను తెచ్చిపెట్టింది. మరి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియో(Lyrical Video)ను మీరూ ఓసారి వినేయండి.

ఇక ఆచార్య చిత్రం(Acharya Movie)లో చిరంజీవికి జంటగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి  తెలిసిందే.

భారీ బడ్జెట్‌(heavy Budget)తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని  ఫిబ్రవరి 4న రిలీజ్(Release) చేయడానికి చిత్ర బృందం(Movie Unit) సన్నాహాలు చేస్తోంది.