బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) జాబ్‌ నోటిఫికేషన్‌(Job Notification) విడుదల(Release) చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. రేడియో ఆపరేటర్‌(Radio Operator), రేడియో మెకానిక్‌(Radio Mechanic) విభాగాల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్(Head Constable) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online)లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్సైటు ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హత, దరఖాస్తు విధానం(Apply Process), ఎంపిక విధానం(Selection Process), జీతం(Salary), వయసు(AGE) వంటి వివరాల కోసం ఇక్కడ చూద్దాం!

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 247

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ(ITI) లేదా ఇంటర్మీడియట్‌(Intermediate) (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి(Interested), అర్హత(Qualification) ఉన్న అభ్యర్థులు(Candidates) ఆన్‌లైన్‌(Online) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష(Written Test), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(Physical Measurement Test), డిక్టేషన్ టెస్ట్(Dictation Test), పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్(Paragraph Reading Test), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), మెడికల్ ఎగ్జామినేషన్(Medical Examination) ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: దరఖాస్తుల స్వీకరణకు మే 25 చివరి తేదీ(Last Date)గా నిర్ణయించారు.

రాత పరీక్ష తేదీ: రాత పరీక్షను జూన్‌ 04వ తేదీన నిర్వహిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/