కలర్స్ స్వాతి గుర్తుందా ?? ఈ పేరు కి వేరే ఆలోచనే లేదు ..వెంటనే హా అనేస్తాం …ఆ రోజుల్లో ,15సంవత్సరాలకే యాంకర్ గా చేసి ,తన వాక్చాతుర్యం తో ,పెదాల పై చిరు నవ్వుతో అందరి మనసులో స్థానం సంపాదించేసుకుంది ఈ చిన్నది …

కలర్స్ అనే ప్రోగ్రాం పేరు నే ,తన ఇంటి పేరు గా మార్చేసుకుని పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా ,తర్వాత మెయిన్ హీరోయిన్ గా ఎన్నో మంచి సినిమాలను చేసింది .

ఇటు తెలుగు లో నే కాకుండా,అటు తమిళ్,మలయాళం ల లో కూడా తన దైన ముద్ర వేసుకుంది మన కలర్స్ స్వాతి .. అంతే కాకుండా పలు చిత్రాలకి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా,ప్లే బ్యాక్ సింగర్ గా కూడా వ్యవహరించారు స్వాతి.

జల్సా మూవీ లో ఇలియానా కి డబ్బింగ్ చెప్పింది కూడా స్వాతి నే .. 100%లవ్ లో A Square,B Square పాట  , స్వామి రారా లో YoYo మేము అంతా పాటలను కూడా పాడింది.

తెలుగు లో డేంజర్ ,ఆడవారిమాటలకు అర్దాలే వేరు చిత్రాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొంది ,తమిళ్ మూవీ సుబ్రమణ్యపురం తో హీరోయిన్ గా ఎంటర్ ఇచ్చారు.

అటు తర్వాత అష్ట చమ్మా , కలవరమాయే మదిలో ,స్వామి రారా, గోల్కొండ హై స్కూల్ ,త్రిపుర ,లండన్ బాబులు కార్తికేయ సినిమాల్లో సూపర్ హిట్ ని సాధించారు … తెలుగు,తమిళ్,మలయాళీ భాషలలో 20కి పైగా చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు … తెలుగు,తమిళ్ బాషలలో ఫిలింఫేర్ అవార్డ్స్,నంది అవార్డ్ కూడా దక్కించుకుంది .

వివాహం

తదుపరి 2018వ సంవత్సరం లో వికాస్ అనే మలయాళీ పైలట్ ని పెళ్లి చేసుకుని ,సినీ ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పి విదేశాల్లో (Abroad )సెటిల్ అయ్యింది ఈ భామ ..

కమింగ్ బ్యాక్ – Coming back – Re-entry

ఇపుడు తాజాగా తన ఫాన్స్ కి ఐ ఆమ్ కమింగ్ బ్యాక్ (I am coming back) అంటూ హ్యాపీ న్యూస్ చెప్తోంది మళ్ళీ ఈ అమ్మడు …

నూతన దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న పంచ తంత్రం మూవీలో స్వాతి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు .దీనిలో శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని, బ్రహ్మానందం కీలక రోల్స్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికార ప్రకటనను కూడా మీడియా ముందుకి తెచ్చింది .

మళ్ళీ మన అల్లరి చేష్టల అమ్మాడి,మన ముందుకు వచ్చి మనల్ని కనివింపు చేస్తుందన్నమాట …

ఆల్ ది బెస్ట్ స్వాతి – All the best Swathi