తమిళ హీరోల లో దళపతి విజయ్ కి క్రేజ్ (Craze) ఎక్కువ. విజయ్ అన్ని చిత్రాలు  కూడా బాక్సాఫీస్ (Box-office) వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉంటుంది.

విజయ్ ప్రస్తుతం బీస్ట్ (Beast) అనే చిత్రం లో హీరోగా  నటిస్తున్నారు. ఈ  చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  డైరెక్టర్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్ (Nelson Dillep Direction) లో భారీ యాక్షన్  మూవీ గా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.

తాజా గా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న  న్యూస్ ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ను ఈ నెల చివరకి దాదాపుగా  పూర్తిచేయనున్నారు.

మూవీ రేలీజ్ డేట్  పై కూడా గత కొన్నాళ్లుగా ఉన్న అనుమానాలకు ముగింపు పెట్టబోతున్నారు.

ఈ మూవీ లో పూజా హెగ్డే  (Pooja Hegde) హీరోయిన్‌గా  నటిస్తోంది. చిత్ర దర్శకుడు ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని కి సంగీతం అనిరుద్ రవీందర్ అందిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ ను చేస్తూనే మరో వైపు బీస్ట్ సినిమాకు సంబంధించి వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారు.

బెస్ట్ వ్యాపారం

విజయ్ అన్ని చిత్రాలు కూడా వందల కోట్ల భారీ  వసూళ్లు అందుకుంటున్నాయి. కాబట్టి  ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే బీస్ట్  సినిమాకు గాను అన్ని రకాలు గా బెస్ట్ వ్యాపారం  అవుతోంది.

BEAST 1

సోషల్ మీడియా లో సంచలనం

అయితే తాజాగా ఈ మూవీ కి  సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియా(Social media) లో చెక్కర్లు కొడుతోంది.

ఈ చిత్ర  ఓటీటీ రిలీజ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయింది అని సమాచారం. అయితే ధర ఎంత తెలియదు.కానీ ఈ చిత్రాన్ని  ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (OTT Netflix) వారు ఓటిటి హక్కుల ప్రసారాలను సొంతంచేసుకున్నారట.

ఇప్పటి వరకు తమిళంలో ఏ మూవీ కి కూడా దక్కని ధర ను బీస్ట్ కు  నెట్ ఫ్లిక్స్ వారు ఇవ్వబోతున్నారట.

తెలుగులో ఈ మూవీ  డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మడు పోయిందని సమాచారం.

పూజా హెగ్డే ఉండటంతో పాటు చిత్రానికి  సంబంధించినంత వరకు విజయ్ ఫ్యాన్స్ భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు.

విజయ్ బీస్ట్ తరువాత తెలుగు లో  దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం అవుతున్నచిత్రానికి వంశీ పైడి పల్లి డైరెక్షన్ చేయబోతున్నారు అని సమాచారం .

బీస్ట్ చిత్రం విజయ్ ఫ్యాన్స్ కి ఎంత వరకు నచ్చుతుందో , ఓటీటీ నెట్ ఫ్లిక్స్  వారి ధరకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి ….

ఆల్ ది బెస్ట్ విజయ్….