ఉద్యోగార్థలుకు ఇండియ‌న్ రైల్వే(Indian Railway) గుడ్ న్యూస్(Good News) చెప్పింది. ప‌దోత‌ర‌గ‌తి పాసైన వారికి మంచి ఛాన్స్ ఇచ్చింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) యొక్క వివిధ ట్రేడ్‌ల(Trades)లో 2077 అప్రెంటీస్ పోస్టుల(Apprentice Posts) భ‌ర్తీకి నోటిఫికేష‌న్(Notification) రిలీజ్(Release) చేసింది.

ఎటువంటి ప‌రీక్ష లేకుండా ప‌దోత‌ర‌గ‌తి(Tenth Class) విద్యార్హ‌త‌(Education Qualification)తోనే అభ్య‌ర్థుల‌(Candidates)ను సెలెక్ట్(Select) చేయనున్నారు.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ‌(Application Process), నోటిఫికేష‌న్(Notification) వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్(Official Website) https://secr.indianrailways.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. అయితే నాగ్‌పూర్ డివిజన్(Nagpur Division) కోసం దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ(last date) జూన్ 3, 2022 వ‌ర‌కు, రాయ్‌పూర్ డివిజన్(Raipur Division) కోసం దరఖాస్తు సమర్పించడానికి మే 24(May 24th), 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

పోస్టుల వివ‌రాలు:

నాగ్‌పూర్ డివిజన్ కోసం పోస్టుల సంఖ్య : 1044

రాయ్‌పూర్ డివిజన్ కోసం ఖాళీల సంఖ్య: 1033

విద్యార్హత‌లు:

అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు(Recognized Board) నుంచి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ(Reserved Category) అభ్యర్థుల(Candidates)కు వయోపరిమితి(Age Limit)లో సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే..

  • అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్(Official Website) https://www.apprenticeshipindia.gov.in/login ఓపెన్ చేయాలి.
  • తరువాత హోం పేజీ(Home Page)లో కనిపించే ‘Online application for engagement of apprentices for the year 2022’ లింక్ పై క్లిక్ చేయాలి.
  • కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేయాలి. సూచించిన సర్టిఫికేట్ల(Certificates)ను అప్ లోడ్(UPLOAD) చేయాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఫామ్(Application Form) నింపడం పూర్తయిన తర్వాత సబ్మిట్(Submit) పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీ(Print Copy)ని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.