మన శరీరం(Body)లో ఎముకలు(Bones) అనేవి ప్రధానమైనటువంటి భాగం. ఎములకల ఆరోగ్యాన్ని బట్టే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. ఎముకలు అనేవి జీవించిన ఉన్న కణజాలాలు మరియు ఇవి కొత్త ఎముకలు ఏర్పడటంతో నిరంతరం మారుతుంటాయి.

పాత ఎముకలు పాడైతే వాటి స్థానంలో కొత్త ఎముకలు ఉద్భవిస్తాయి. ఇలా జీవితకాలం(Life time) మొత్తం జరుగుతుంది. నడవడం కోసం మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మనం మన ఎముకల్ని ఆరోగ్యవంతంగాను మరియు వ్యాధులను నుంచి సంరక్షించుకోవాలి. మనకు 35 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎముకలు బలం(Bone Strong)గా ఎదుగుతాయి.

వయస్సు పెరుగుతున్న కొలదీ, కొత్త ఎముకలు ఏర్పడే రేటుతో పోలిస్తే, పాత ఎముకలు వేగంగా నాశనం అవుతుంటాయి. మరిముఖ్యంగా ఆడవారిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి ప్రత్యామ్నాయం కల్పించడం కోసం ఎముకలు ఏర్పడతాయి. ఈ ఎముకలు చాలా బలహీనం(Weak)గా, పెళుసగా మరియు తేలికగా విరిగిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి ఎముకలను కాపాడుకోవాల్సిన బాధ్యత(Responsibility) మనదే. ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం కాల్షియం మరియు విటమిన్‌ డి(Vitamin D) ఎంతగానో అవసరం అవుతాయి.

విటమిన్‌ డి మరియు కాల్షియం(Calcium) వీటిలో ఎక్కువగా ఉంటుంది. పాలు(Milk) మరియు పాల ఉత్పత్తులు(Dairy Products), బీన్స్‌(Beans), స్పినాచ్‌(leafy vegetables), నట్స్‌(Nuts) మరియు డ్రైడ్‌ ఫూట్స్‌(Dry Fruits) లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకలను స్ట్రాంగ్ ఉంచి లైఫ్ హాపీగా ఉండేలా చేసే కొన్ని ఆహారాలు మీకోసం

ముదురు రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, బ్రొకోలీ, డైరీ ఉత్పత్తులు వంటి వాటిల్లో ‘విటమిన్ డి’ అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయ(Onion) మరియు వెల్లుల్లి(Garlic)లో అధిక శాతంలో సల్ఫ(Sulphar)ర్ ఉండటం వల్ల ఇవి ఎముకలకు ఎంతో అవసరం. కాబట్టి మీ డైయట్ లో తప్పనిసరిగా తీసుకోవాలి. కార్బో హైడ్రేట్స్(Carbohydrates) కలిగినటువంటి డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. కోక్ వంటివి తీసుకోవడం వల్ల పళ్ళను అనోరాగ్యానికి గురిచేస్తాయి.

కోకో డ్రింక్స్(COCO drinks) లో ఉండే ఫాస్ఫరస్(Phosphorus) శరీరంలోని క్యాల్షియంను బయటకు పంపిచేస్తుంది. అధిక ప్రోటీనుల(Proteins)ను కలిగిన అనిమల్ ఫుడ్(Animal Food) ను తినడం మానేయాలి. శరీరంలో ఉన్న క్యాల్షియంను బయటకు పంపివేయబడటానికి దోహదం చేస్తుంది. కాఫీ మరియు టీ లను తాగడం సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. కాఫీ, టీలకు బదులుగా ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

మరియు పాల వల్ల కాల్షియం అందుతుంది. మరియు ఎముకలకు అవసరమయ్యే ఇతర విటమిన్ డి తో పాటు, ప్రోటీన్, ఫాస్పరస్, మరియు పొటాషియం(Potassium) వంటివి పుష్కలంగా అందుతాయి.వ్యాయామం(Exercise) చేయడం వల్ల ఎముకల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది.

రోజువారీగా వేగంగా నడవడం వల్ల ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండటానికి సాయపడతాయి. ఇది బ్యాలెన్స్‌(Balance) మరియు కో ఆర్డినేషన్‌(CO-Ordination)ను పెంచుతుంది. తద్వారా పడకుండా ఉంటాం. డాన్సింగ్, పరిగెత్తడం, జాగింగ్, బరువులు ఎత్తడం వంటివి ఎముకలను గట్టిపరుస్తాయి. మీరు తీసుకొనే ఆహారంతో సరైన ఆహారం తీసుకోవాలి. స్నాక్స్(Snacks) మరియు జంక్ ఫుడ్స్(Junk Foods) ను తినకపోవడమే మంచిది.

మీ డైయట్ లో అటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేట్లైతే డాక్టర్ సలహా(Doctors Advice) తీసుకోని శరీరానికి కావల్సిన విటమిన్స సప్లిమెంట్స్(Supplements) ను తీసుకోవడం ఉత్తమం. ఎముకలను స్ట్రాంగ్ ఉంచడంలో ఆటలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే ఫుట్ బాల్(Foot Ball), బాస్కెట్ బాల్(Basket Ball), బాడ్మింటన్(Badminton) వంటి ఆటలు ఆడటం వల్ల కండరాల పెరుగుదలకు మరియు ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతాయి. ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంలో మూలికలను జోడించండి.

బార్లీ, గోధుమ గడ్డి, డాండెలియన్ రూట్, దురదగొండి, కొత్తిమీర, గులాబీ పండ్లు ఇలా కొన్నింటికి ప్రాధాన్యత ఇవ్వండి.

ఉదయం సూర్యకిరణాలు: శరీరంలో విటమిన్ డి స్థాయి బాగా పెరగాలంటే ఉదయాన్నే పడే సూర్యకిరణాలలో కనీసం పదిహేను నిముషాల పాటు ఉండటం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డి లెవల్స్(Vitamin D Levels) అధికంగా పెరుగుతుంది(Increases).