తెలుగులో ఇప్పటికే పెద్ద సినిమాలు(Big Movies) రిలీజ్ కావడంతో చిన్న సినిమాలన్నీ విడుదలకు రంగం రెడీ చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఖాళీగా దొరుకుతుందా? సినిమాలను ఎప్పుడు విడుదల చేయాలా? అని నిర్మాతలు అంచనాలు  వేసుకుంటున్నారు. ప్రస్తుతానికి షూటింగ్స్(Shootings) కూడా నిలిచిపోయిన క్రమంలో ఇప్పటికే పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న అన్ని సినిమాలను టైం చూసుకుని విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు,  ఇక ఈవారం అంటే ఆగస్టు 5వ తేదీన కొన్ని ఆసక్తికరమైన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధమైంది.

థియేట్రికల్ రిలీజులు:

అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే బింబిసార(Bimbisara) అనే సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్(Nanadamuri Taraka Ramarao Arts Banner) పై కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కోసం నిర్మిస్తున్న బింబిసార సినిమా అటు నందమూరి అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకప్పటి నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు మల్లిడి వశిష్ట్(Mallidi Vasisht) సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్,  కేథరిన్ థెరిసా వరీనా న హుస్సేన్ వంటి వారు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేయగా సినిమా చూసిన ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా సినిమా మీద అంచనాలను రెట్టింపయ్యేలా చేశాయి.

దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నేరుగా లీడ్ రోల్(Lead Role) లో చేస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా సీతారామం(Sita ramam). మృణాల్ ఠాకూర్(Mrunaal Takur) ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం(Direction) వహించిన ఈ సినిమాకు యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్ ఉండడంతో సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్(Trailer) విడుదల కాక ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది. తెలుగు(Telugu),  తమిళ(Tamil),  మలయాళ(Malayalam) భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.

డిజిటల్ రిలీజ్:

ఈ వారం డిజిటల్ ప్లాటుఫామ్లో(Digital Platform) రిలీజ్(Release) కాబోతున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే ముందుగా గోపీచంద్(Gopichand) హీరో(Hero)గా రూపొందిన పక్కా కమర్షియల్(Pakka Commercial) సినిమా ఆహా వీడియో(AHA Video) వేదికగా తెలుగు ఆడియన్స్(Telugu audience) ముందుకు రాబోతోంది. ఇప్పటికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఆగస్టు 5(August 5th)వ తేదీ నుంచి ఆహాలో సందడి చేయబోతోంది. హన్సిక(Hansika) నటించిన మహా సినిమా(MAHA Movie) కూడా ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమౌతుంది.

ఈ సినిమా కూడా తమిళ(Tamil),  తెలుగు(Telugu) భాషలలో ఆహా వీడియోలో అందుబాటులోకి రాబోతోంది. ఇక పృథ్వీరాజ్(Prudhvi Raj) సుకుమార్(Sukumar) హీరోగా తెరకెక్కిన కడువా(Kaduva) అనే సినిమా కూడా ఆగస్టు 4(August 4th)వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తమిళ,  తెలుగు,  కన్నడ,  మలయాళం,  హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలైంది. ఇక అలియాబట్(Aliabhatt) హీరోయిన్ గా నటించిన డార్లింగ్స్(Darlings) సినిమా కూడా ఆగస్టు 5వ తేదీన నెట్ ఫ్లిక్స్(Netflix) లో అందు బాటులోకి రాబోతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే(Huge Exceptations) నెలకొన్నాయి.