రైల్వే ఉద్యోగాల(Railway Job) కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల(Candidates)కు శుభ వార్త. దేశవ్యాప్తంగా దాదాపు 2,98,973 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.

గ్రూప్ డీలో దాదాపు లక్షకుపైగా ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. సెంట్రల్ రైల్వే(Central Railway) ఈ సంవత్సరం 2 లక్షలకు పైగా పోస్టులను నియమించుకుంటుందన్నారు.

ఇందులో గ్రూప్ సీ(Group C) అండ్ గ్రూప్ డీ(Group D) పోస్టులు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లు మినహా ప్రతి జోన్‌లో 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) పోస్టులు కూడా దాదాపు 10 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా గ్రూప్స్ A మరియు B పోస్టులకు త్వరలో నియామకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) UPSC ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు.

2020 నుంచి రైల్వే శాఖలో గ్రూప్-ఎ, బి పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగలేదు. ఈ సారి ఈ కేటగిరీల్లో కూడా పోస్టుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పారామెడికల్‌(Para Medical), గ్రాడ్యుయేట్‌(Graduate) ఎన్‌టీపీసీ(NTPC)తో కలిపి లక్షా 39 వేల ఖాళీలకు సంబంధించి రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కొనసాగుతోంది. డిసెంబర్ 01, 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్లలోని 3.12 లక్షల నాన్ గెజిటెడ్(Non Gazetted) గ్రూప్-సి మరియు డి పోస్టులకు భారతీయ రైల్వే(Indian Railway) సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని జనవరిలో రైల్వే మంత్రి తెలియజేశారు.

కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల ప్రక్రియ(Notifications Process) జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి రైల్వేలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు.