ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పండ్లలో ఒకటి అరటి పండ్లు(Bananas). దాదాపు ప్రతి దేశంలోనూ, అరటిపండ్లు పండిస్తారు. ఇది భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. అరటి మొక్క అతిపెద్ద పుష్పించే గుల్మకాండ మొక్క మరియు ఒకే అరటి సేకరణలో చాలా అరటి పువ్వులు ఉత్పత్తి అవుతాయి. అరటిపండ్లను ఉత్పత్తి చేసేటప్పుడు ఈ పువ్వులు సాధారణంగా వ్యర్థ పదార్థంగా అనిపిస్తుంది. అయితే ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. మరి అధిక పోషక విలువలు(Nutrition Values) వున్నా ఈ అరటి పూవుతో మంచి వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఆహారంగా తీసుకోవడం ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Healthy Benefits) కలుగుతాయి. ముఖ్యంగా ఈ అరటి పువ్వు తో స్నాక్ ఐటెం అరటి పువ్వు వడలు చేసుకోవచ్చు. ఈ వడలు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. అరటిపువ్వు వడ(Raw Banana Vada), తమిళనాడు(Tamilnadu) లో చాలా ప్రసిద్ధి చెందిన ఒక చిరుతిండి(Snacks).

సాయంత్రం వేళ ఈ స్నాక్ ని చట్నీ(Chutney), కెచప్(Ketchup) లేదా టీ తో ఆస్వాదించవచ్చు. శనగ పప్పు, అరటిపూవు, అలాగే మసాలా దినుసులతో ఈ స్నాక్ ని తయారు చేస్తారు. అరటిపూవు తో చాలా అరుదుగా చేసే వంటకం ఈ వడలు. మరి ఈ రెసిపీ(Recipe) ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం!

కావలసినవి:

నానబెట్టి రుబ్బుకోవడానికి: 1 కప్పు శనగపప్పు

1 టీస్పూన్ మెంతులు

1 టీస్పూన్ జీలకర్ర

4 ఎర్ర మిరపకాయలు

వడ మిశ్రమం:

1 కప్పు – అరటి పువ్వు

1 టేబుల్ స్పూన్ – పప్పు (నానబెట్టినది)

½ కప్పు – ఉల్లిపాయ

1.5 టీస్పూన్ – ఉప్పు

1 టీస్పూన్ పచ్చిమిర్చి మిరపకాయ

కరివేపాకు కొత్తిమీర సరిపడా

డీప్ ఫ్రై చేయడానికి నూనె

తయారు చేయు విధానం:

శనగపప్పు(Chana dal)ను కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. అరటిపువ్వును ఒలిచి అరగంటపాటు ఉప్పునీళ్లలో నానబెట్టి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర, సోంపు, ఉప్పు వేసి కాస్త బరకగా గ్రైండ్‌(Grind) చేయాలి. పప్పు మిశ్రమాన్ని గిన్నెలో వేసి చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అరటిపువ్వు, కరివేపాకు వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక పప్పు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతిలో వడల్లా ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే అరటిపువ్వు వడలు సిద్ధం. వీటిని వేడి వేడి గా కెచప్ తో సర్వ్(Serve) చేయండి.