కేంద్ర ప్రభుత్వ(Central Government) ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) దేశవ్యాప్తం(World Wide)గా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు(Depo), కార్యాలయా(Offices)ల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ(Management Trainee), మేనేజర్(Manger) పోస్టుల కోసం అర్హత(Qualified), ఆసక్తి(Interested) వున్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్(Online) దరఖాస్తుల(Applications)ను కోరుతుంది.

ఈ నోటిఫికేషన్‌(Notification) ద్వారా 113 పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ ఉద్యోగానికి అభ్యర్థులు(Candidates) ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు(Full details) https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్‌(Website) చూడొచ్చు. ఈ పోస్టులకు ఎన్ని ఖాళీలు వున్నాయి, అర్హత ఏంటి, జోన్ల వారీగా ఎన్ని పోస్ట్లు ఉన్నాయో  ఇక్కడ చూడండి.

మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీలు: 113

విభాగాలు: జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

జోన్ల వారీగా ఖాళీలు:

నార్త్ జోన్: 38 పోస్టులు

సౌత్ జోన్: 16 పోస్టులు

వెస్ట్ జోన్: 20 పోస్టులు

ఈస్ట్ జోన్: 21 పోస్టులు

నార్త్-ఈస్ట్ జోన్: 18 పోస్టులు

ముఖ్య సమాచారం:

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్(Graduate), బీకాం, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, సీఏ(CA), సీఎస్‌(CS), ఐసీడబ్ల్యూఏ(ICWA), ఎంఏ(MA), ఎంబీఏ(MBA), పీజీడీఎం(PGDM), పీజీ డిప్లొమా(PG DIPLOMA), ఐసీఏఐ(ICAI) ఉత్తీర్ణత ఉండాలి.

జీత భత్యాలు: రూ.40,000 – రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), ఇంటర్వ్యూ(Interview), ట్రెయినింగ్‌(Training) ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.800

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు(ఫేజ్-1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 27, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 26, 2022

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.recruitmentfci.in/