ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పలు ఉద్యోగాల(JOBS) భర్తీకి నోటిఫికేషన్‌(Notification)ను విడుదల(Release) చేసింది. అభ్యర్థులు(Candidates) అధికారిక వెబ్‌సైట్(Official Website) isro.gov.in మరియు nrsc.gov.inని సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ(Last Date) ఏప్రిల్ 7(April 7th)గా నిర్ణయించబడింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Recruitment Drive) ద్వారా 20 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), 04 రీసెర్చ్ సైంటిస్ట్ (RS), 07 ప్రాజెక్ట్ అసోసియేట్-I మరియు 03 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హతలు: ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి BE/B.Tech/B.sc/M.sc కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: CBT/ఇంటర్వ్యూ ఆధారం(Interview Based)గా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ.56,000 వరకు జీతం(Salary) పొందుతారు. పూర్తి వివరాలకు https://www.isro.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.

వీటితో పాటు ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ), టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బీతో పాటు ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. మొత్తం దీనిలో 62 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 24, టెక్నీషియన్ బీ – 29, డ్రాఫ్ట్ మెన్ బీ – 1 , హెవీ వెహికల్ డ్రైవర్ 5, లైట్ వెహికల్ డ్రైవర్ 2, ఫైర్ మెన్ ఏ 1 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ(Application Process) నేటి నుంచి (మార్చి 27) ప్రారంభం కానుంది. వీటికి చివరి తేదీ ఏప్రిల్ 24, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాల(Full Details)కు https://www.iprc.gov.in/iprc/ వెబ్ సైట్ సందర్శించొచ్చు.

దరఖాస్తు విధానం ఇలా..

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి..
  • దీనిలో నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ డౌన్ లోడ్(PDF Download) చేసుకోవచ్చు. దాని కింద ఆన్ లైన్(Online) దరఖాస్తులు అనే ఆప్షన్ ఉంటుంది. దాని పై క్లిక్ చేయండి.
  • తర్వాత ఓపెన్ అయిన పేజీలో మీ వివరాలను నమోదు చేయాలి.
  • తదుపరి ఫైనల్ సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేస్తే.. దరఖాస్తు సమర్పించినట్లే.
  • చివరగా అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాల(Future Reference)కు ఉపయోగపడుతుంది.