బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) లో పదో వారం ముగిసింది. బిగ్ బాస్(Big Boss) సండే ఫండే ఎపిసోడ్ ప్రారంభించే ముందు గంగవ్వ కట్టుకున్న కొత్తింటి గురించి కంటెస్టెంట్లకు(Contestants) చూపించాడు హోస్ట్ నాగార్జున.

అంతే కాకుండా గంగవ్వ ఇంటికి సంబంధించిన విజువల్స్‌(Visuals) ను కూడా చూపించాడు.

ఆ తరువాత చిల్డ్రన్స్ డే(Childrens Day) సందర్భంగా హౌస్ మేట్స్(House mates) తో పిల్లాటలు ఆడించాడు.

Childrens Day

చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, ఓడిపోయిన కంటెస్టెంట్లకు స్కూల్‌లో ఇచ్చే శిక్షలు విధించాడు. ఈ ఆటలో భాగం గా హౌస్ మేట్స్ రెండు టీంల గ విభజించాడు.

సెక్షన్ ఏ అంటూ షన్ను, ఆనీ, ప్రియాంక, సన్నీ టీంగా విడగొట్టాడు. మిగతా వాళ్లను సెక్షన్ బీలో వేశాడు. ఇక మానస్ సంచాలకులు గా వ్యవహరించాడు.

మొద‌టి గేమ్‌(Game)లో గార్డెన్ ఏరియా లో ఐస్(ICE), వాటర్,(Water) ఫైర్(Fire) అంటూ గేమ్స్ ఆడించాడు.  కంటెస్టెంట్లు(Contestants) డ్యాన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో సాంగ్ ఆగినప్పుడు నాగార్జున‌ ఫైర్‌, ఐస్‌, వాట‌ర్ అని ప‌లికిన‌ప్పుడు ఆయా బోర్డుల ద‌గ్గర‌కు ప‌రిగెత్తుకెళ్లాలి. చివ‌ర‌గా బోర్డును చేరుకున్న వ్యక్తి  ఓడిపోతారు.

అంతేకాకుండా వారికి శిక్ష కూడా ఉంటుంది. అలా ఈ ఆటలో నాగ్‌, మొదట అవుట్ అయినా శ్రీ రామ్ తో నోటి  మీద  వేలు వేసుకుని కూర్చొమని శిక్ష విధించాడు. రవితో గోడ‌కుర్చీ  వేయించాడు, ష‌ణ్నును మోకాళ్ల మీద కూర్చోబెట్టి, సిరిని ఒంటికాలిపై, యానీని రెండు చేతులు పైకెట్టి నిల్చోబెట్టాడు. మొత్తంగా ఈ గేమ్‌లో ఏ టీమ్‌లోని స‌న్నీ గెలిచాడు.

ఇక ఆ తరువాత ఓ కంటెస్టెంట్‌(Contestant)ను సేఫ్ చేయాల్సి ఉండగా, కాలింగ్ బెల్‌తో సేఫ్, అన్ సేఫ్ అనేది ప్రకటించారు. కాలింగ్ బెల్ నొక్కితే రెస్టారెంట్ క్లోజ్డ్ అని వస్తే అన్ సేఫ్ ఆర్డర్ ప్లీజ్ అని వస్తే సేఫ్(Safe)అయ్యినట్టు. అలా సిరి నొక్కినప్పుడు మాత్రమే ఆర్డర్ ప్లీజ్ అని రావడంతో, సిరి సేఫ్ అయిపోయింది.

రవి, కాజల్, మానస్‌లు అన్ సేఫ్ అయ్యారు. త‌ర్వాత మరో గేమ్ ఆడించాడు. ఈ గేమ్‌లో హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చూపించ‌గా అది ఎవ‌రో గుర్తుప‌ట్టాల‌న్నాడు నాగ్‌. ఈ గేమ్‌లోనూ ఏ టీమ్ విజయం సాధించింది.

త‌ర్వాత గేమ్‌లో కొన్ని ప‌దాలున్న మెడ‌ల్స్‌ ను దానికి స‌రిగ్గా స‌రిపోయే వ్యక్తికి వేయాల‌న్నాడు. స‌న్నీ ఫేక్(Fake) అన్న మెడ‌ల్‌ను ర‌వికి వేశాడు.

మాన‌స్‌, ప్రియాంక త‌న‌కు త‌ల‌నొప్పిగా మారింద‌న్నాడు. శ్రీరామ్‌ గేమ్‌లో కాజ‌ల్ క‌న్నింగ్(Cunning) అని చెప్పాడు.

ర‌వి యారోగెంట్‌(Arrogant) మెడ‌ల్‌ను యానీకి ఇచ్చాడు. ప్రియాంక సింగ్‌, ష‌ణ్ముఖ్ సెల్ఫిష్(Selfish) అని చెప్పింది. యానీ, స‌న్నీ సెల్ఫిష్ అంది. కాజ‌ల్‌, సిరి డ‌బుల్ ఫేస్ అని తెలిపింది. సిరి,ష‌ణ్ముఖ్ నెగటివ్ మెడల్ ను ఇచ్చింది.

ప్రతిసారి నేను వెళ్లిపోతానేమోన‌ని నెగెటివ్‌(Negative)గా మాట్లాడుతాడ‌ని బుంగ‌మూతి పెట్టుకుంది. ఇక చివరగా నామినేషన్స్(Nominations) లో వున్న మానస్, కాజల్ లో నుంచి ఒక్కరు బయటకు వెలసిన టైం వచ్చిందని కాసేపు టెన్షన్ పెట్టిస్తాడు నాగ్.

త‌ర్వాత మాన‌స్‌, కాజ‌ల్ ఇద్దరూ సేఫ్(Safe) అని ప్రక‌టించిన నాగ్ మీ ఇద్దరూ కాకుండా మ‌రొక హౌస్‌మేట్ వెళ్లిపోతున్నాడ‌ని చెప్పాడు.

సీక్రెట్ రూమ్‌(Secret room)లో ఉన్న‌ జెస్సీ ఆరోగ్యం బాగోలేనందున అత‌డిని హౌస్ నుంచి పంపక త‌ప్పద‌ని వెల్లడించాడు. అలా మాన‌స్‌, కాజ‌ల్‌ల‌లో ఒక‌రికి బ‌దులుగా అస‌లు నామినేష‌న్‌లోనే లేని జెస్సీ ఆట నుంచి అర్ధాంత‌రంగా వెళ్ళిపోయాడు.

స్టేజీ మీద‌కు వ‌చ్చిన జెస్సీ కి  త‌న జ‌ర్నీ వీడియను చూసుకుని ఎమోషనల్(Emotional) అయ్యాడు.

ఆ తరువాత  జెస్సీ హౌస్ మేట్స్(House mates) ఒక్కొక్కగారితో పర్సనల్‌(Personal)గా ఫోన్‌లో మాట్లాడాడు. మొదటగా సన్నీతో మాట్లాడాడు ఆట బాగానే ఆడుతున్నావు కొంత మంది నిన్ను వాడుకుంటున్నారు, మాటలు జారుతున్నావు  అది కాస్త చూసుకో అని హెచ్చరించాడు.

మానస్‌తో మాట్లాడుతూ నువ్ సైలెంట్ కిల్లర్ సీక్రెట్ రూంలో ఇంకో యాంగిల్ చూశాను. రవి కంటే బాబువి నువ్వు  ఈ మ్యాటర్ నువ్వు ఒప్పుకోవు కానీ ఒప్పుకో నీ ఐడియాలు బాగున్నాయ్. కానీ అందరినీ నెగెటివ్‌గా, తప్పుగా చూస్తున్నావు  నామినేషన్ల(Nomination) గురించి కాజల్‌‌తో నేను డిస్కషన్ చేయలేదు అని అన్నాడు.

ఇక కాజల్‌తో మాట్లాడుతూ నవ్వకు నిన్ను తిట్టాలని ఉంది.  ఈ వారం రోజులు నిన్ను చూశాను. ఎలా ఆడుతున్నావు. మొదట్లో ఉన్నట్టు ఉండు నీ ఐడియాతో నువ్వు ఆడుకో గ్రూప్ కోసం ఆడకు నీ ఫ్రెండ్స్ నీకేం వాల్యూ ఇవ్వడం లేదు నిన్ను వాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అది తెలుసుకో అని చెప్పాడు.

ఆనీ మాస్టర్‌తో మాట్లాడుతూ హాయ్ ఫైటర్(Fighter) ఆట బాగానే ఉంది. కుచ్ బీ అని అనడం క్యూట్‌(Cute)గా ఉంది. బీబీ హోటల్ టాస్కులో మిమ్మల్ని అందరూ విసిగిస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్స్ పెట్టారుకదా? బాగున్నాయి.

మంచిగా ఆడుతున్నారు కానీ మీకు కాజల్‌కు గొడవలేంటి అర్థం కాలేదు అని అన్నాడు.

ప్రియాంకతో మాట్లాడుతూ ఇకనైనా త్యాగాలు ఆపేయ్, పదో వారం దాటేసావు. ఏం చూపిద్దామని అనుకున్నావు మధర్ థెరిస్సా అనుకుంటున్నావా? లేక దేవతవి అనుకుంటున్నావా? నీ గేమ్ ఇంతేనా? ఏం ఆడుతున్నావు? రాబోయే సీజన్లలో వచ్చే వారికి నువ్వు ఒక ఇన్‌స్పిరేషన్‌(Inspiration)లా ఉండాలి. అంతే కానీ ఆ అదెందిరా పది వారాలు ఉంది అని ఎవ్వరూ అనుకోకూడదు అని గట్టిగానే ఇచ్చిపడేశాడు.

శ్రీరామచంద్రతో మాట్లాడుతూ అందరినీ అలా టచ్ చేసి పోతున్నావు ఎందులో ఇన్వాల్వ్ మెంట్ లేదు ఎందుకు టాప్ 5లో ఉంటావు మైండ్  సెట్ బాగుంది వుంది. నువ్వు  చాలా మంచోడివి. అని ప్రశంసలు కురిపించాడు.

రవితో మాట్లాడుతూ నీ కోసం పది నిమిషాలు బిగ్ బాస్‌(Big Boss)తో ఫైట్ చేశాను. కేక్ కోసం అర్హత నీకే ఉందని అన్నాను. కానీ నువ్వు  మాత్రం గివ్ అప్(Give Up) ఇచ్చేసావు. అందరికీ చెప్పాల్సింది చెప్పాను. నిన్ను ఎవరైతే ఇంఫ్లూయన్సర్ అని అంటున్నారో వాళ్లకు చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఇలానే ఆడు ఫైనల్లో కలుస్తా అని అన్నాడు.

ఇక సిరితో మాత్రం చాలా సేపు మాట్లాడాడు. మిస్ యూ, లవ్యూ, ముద్దులతోనే వీరి సంభాషణ జరిగింది. బీబీ హోటల్(BB Hotel) టాస్కులో నీ డబ్బులు నీ దగ్గర ఎందుకు పెట్టుకోలేదు అని ప్రశ్నించాడు.

ఇక ఈ ఇద్దరూ ఎంతకీ మాట్లాడుకోవడం పూర్తి కాకపోవడంతో నాగ్ మధ్యలోకి దూరాడు. ముద్దు పెట్టవా? అని జెస్సీ అడగడం, అందరూ ఉన్నారు కదా? అని సిరి అనడం, ఆ తరువాత ఫోన్ లోంచే ముద్దులు పెట్టడం వామ్మో ఈ ఇద్దరూ నాగ్ ముందు రొమాంటిక్ గేమ్ ఆడేసారు.

షన్నుతో చివరగా మాట్లాడిన జెస్సీ ఏం చెప్పాలి రా దీపుకి అని అన్నాడు. చూసిందే చెప్పు అని షన్ను అంతాడు . చాలా చూశా అని సెటైర్ వేస్తాడు జెస్సీ. అర్థమైందే చెప్పు. నువ్వు  ఇలా వెళ్లిపోతూ ఇంకొకరికి లైఫ్ ఇచ్చి వెళ్తున్నావు అది నా జెస్సీ అంటూ షన్ను అంటాడు.

ఇక నుంచి నీ తరుపున ఇంకొంచెం ఫిజికల్‌(Physical)గా అడతాను అని షన్ను అన్నాడు. బ్రిక్స్ టాస్క్‌(Bricks Task) లో నీలో నన్ను చూసుకున్నాను. నా ఫ్రెండ్స్‌ కి ఎవ్వరూ లేరు బిగ్ బాస్(Big Boss). నేను వెళ్తాను నన్ను పంపించండి అని అడిగాను. కానీ పంపించలేదు అని జెస్సీ అన్నాడు.

ఆట గురించి ఏమైనా చెబుతావా? అంటే ఏం లేదు అని అన్నాడు. బయటకు వచ్చాక కలుద్దామని జెస్సీ అంటే నాతోనే ఉండాలి అని జెస్సీతో షన్ను అంటాడు.

నీతోనే ఉంటాను జెస్సీ అంటాడు. వీళ్ళమాటలు ఇంతకీ ఆపకపోవడంతో నాగ్ ఇక ఆపేయండి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్‌లా మాట్లాడుకుంటున్నారు అని కౌంటర్ వేశాడు…..