పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan) లేటెస్ట్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్(Bheemla Nayak) విడుదలై సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. 

భీమ్లా నాయక్ తరువాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, క్రిష్(Krissh) దర్శకత్వం(Direction)లో నటిస్తున్న సినిమా  ‘హరిహర వీరమల్లు’(HARIHARA VEERAMALLU).

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది. శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా చిత్ర యూనిట్(Movie Unit), ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్‌(Poster)ను రిలీజ్‌ చేశారు. ఇందులో ఇంటెన్స్ లుక్‌(Intense Look)తో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటున్నారు.  పవన్‌  ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతోంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామా(Periodic Action Drama) నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ‘హరిహర వీర మల్లు’ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌(Mega Surya Productions Banner)పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రిలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇక సినిమాకు ఎమ్‌ఎమ్ కీర‌వాణి(MM Keeravani) సంగీతం(Music) అందిస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌(Martial Art Skills)కు మరోసారి పదును పెడుతున్నారు. పవన్, క్రిష్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం  ఇప్పుడు సినిమాల‌పై పూర్తి దృష్టి పెట్టిన పవర్‌ స్టార్ నాలుగు మూవీస్ లో నటించనున్నారని సమాచారం.