బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సెప్టెంబర్ (September) లో ఆడియన్స్ ముందుకు వస్తున్నా హీరో విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి, శృతి హాసన్ (Sruthi Hasan) జతకట్టిన చిత్రం “లాభం”.

ఈ మూవీ తెలుగు,తమిళ భాష లో సెప్టెంబర్ 9 న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ (First look) ని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో నటిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి.వై, చిత్ర నిర్మాత బత్తుల సత్యనారాయణ, సమర్పకుడు లాయర్ శ్రీరామ్, అలాగే సినీ రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘

విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయన నటించిన మూవీస్ తెలుగులోనూ మంచి క్రేజ్ (Craze) తెచ్చిపెడుతున్నాయి.

ఇటీవల తెలుగులో నేరుగా నటించిన సైరా, ఉప్పెన మూవీస్ లో అయన చేసిన పాత్రలకు ప్రేక్షక ఆదరణ పొందింది.

ఈ చిత్రం లోని ఆయన లుక్‌ (Look) చాలా బాగుంది. లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఇందులో అతని పాత్ర ముందు చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా.

ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ (release) చేస్తున్న నిర్మాతలకు అభినందనలు..

ఈ సినిమా మంచి సక్సెస్ తో పాటు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.గాయత్రీ దేవి ఫిలిమ్స్ (Gayathri Devi films)  పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించగా, ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ మూవీ లో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర లో నటించింది.

ఈ చిత్రం తో పాటు విజయసేతుపతి మరో సినిమా కూడా సెప్టెంబర్ లోనే ఆడియన్స్ ముందుకు రానుంది.

దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం లో విజయసేతుపతి హీరో గా రూపొందుతున్న చిత్రం తుగ్లక్ దర్బార్. ఈ చిత్రం లో రాశి ఖన్నా, మంజిమా మోహన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

రాజకీయ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో విజయ సేతుపతి సింగార విలన్ (vilan) పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ (OTT Netflix) లో సెప్టెంబరు 11 నుంచి ఈ మూవీ ప్రసారం కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ (Trailer) ని రిలీజ్ చేసింది.

దీనితో పాటు దీపక్ సుందర రాజన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘అనబెల్ సేతుపతి’.

హారర్, కామెడీ (Horror, Comedy) నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని సుధన్ – జయరామ్ సంయుక్తంగా నిర్మించారు.

ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్‌ అయిన ఈ ట్రైలర్‌ను తెలుగులో విక్టరి వెంకటేశ్‌, తమిళంలో సూర్య, మలయాళంలో మోహన్ లాల్‌లు విడుదల చేశారు.

ఇటీవల రిలీజైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ (Responses) రావడంతో, తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ మూవీ హాట్ స్టార్ డిస్నీ (Hotstar Disney) లోసెప్టెంబర్ 17 నేరుగా విడుదల కానుంది.

మరి ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించాలని, అలాగే విజయసేతుపతి కి ఈ మూవీస్ మంచి హిట్ ని తెచ్చిపెట్టాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్  (All the best) చెపుదాం..