బిగ్ బాస్ సీజన్5(Big Boss Season 5) పదకొండో వారం మొదలైంది.

ఆదివారం మానస్, కాజల్ ఎలిమినేషన్(Elimination) చివరి దశలో ఉండగా, బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో ట్విస్ట్ పెట్టాడు అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ ని ఇంటి నుంచి బయటకు పంపారు.

ఇక మానస్, కాజల్ ఈ వారం సేవ్(Save) అయ్యారు. దీనితో మొత్తం 9 మంది కంటెస్టెంట్స్  హౌస్లో మిగిలారు. సోమవారం జరిగే నామినేషన్(Nomination) ప్రక్రియ కూడా ముగిసింది.

మరి కంటెస్టెంట్స్(Contestants) ఎవరు ఎవరిని నామినేట్ చేసారు వారి మధ్య జరిగిన హీట్ డిస్కషన్ ఏంటో తెలియాలంటే 72వ ఎపిసోడ్ పై ఓ లుక్ వేద్దాం.

ఈ వారం మొత్తంలో జరిగిన గొడవలకు తనకు గిల్టీ (Guilty)బోర్డు తగిలించుకుని తిరగడంపై అవమానంతో మానస్ దగ్గర బాధపడుతూ కనిపించాడు సన్నీ.

నోరు పారేసుకోవడం ఎందుకు ఆ తరువాత అవమానం భారంతో బాధపడడం ఎందుకు?. వీళ్ల మాటల మధ్యలో రవి ప్రస్తావన వచ్చింది. రవి అవకాశవాది తాను ఎలా కావాలంటే ఆలా మాట్లాడతాడు.

జెస్సీ ఉన్నప్పుడు వాడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. నా గేమ్ నేను ఆడుతున్నా కాబట్టే ఇక్కడ ఉన్నా అని రవికి జెస్సీ చాలా సార్లు చెప్పాడు.

ఎవడ్నైనా బ్యాడ్ చేయడానికి ఛాన్స్ దొరికితే చేయాలనే చూస్తాడు రవి. ఎక్కువ శాతం మంది తన వైపున ఉన్నారని దాన్ని అవకాశంగా తీసుకున్నాడు.

కొడతా, తన్నుతా, అద్దం నుంచి అవతల పడతారు లాంటివి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు వస్తుంటాయి. వాటిని

కూడా పాయింట్‌గా లేవనెత్తాడు. సడెన్‌గా నేను బ్యాడ్ బిహేవియర్(Bad Behaviour) అని గుర్తుకువచ్చింది. ఏదో ఒక రోజు సార్ గుడ్ అంటే చాలు అని మానస్ దగ్గర ఫీల్ అవుతాడు సన్నీ.

జెస్సీ వెళ్లిపోయిన‌ప్పుడు నాకే ఏడుపు రాలేదు, వీళ్లకెలా వ‌స్తుంది? ఎందుకుఅంత డ్రామాలు ఆడుతున్నారని హౌస్‌మేట్స్‌(House mate)ను పాయింట్ అవుట్ చేసిన ష‌ణ్ముఖ్‌.

మ‌రోప‌క్క కాజ‌ల్‌, జెస్సీ హెచ్చరికతో  ఎట్టు తేల్చుకోలేక కాంఫుసే అయింది. నీ ఫ్రెండ్స్ నిన్ను వాడుకుంటున్నార‌ని, వారు నిన్ను న‌మ్మ‌డం లేద‌ని జెస్సీ చెప్పిన మాటలు ఎంత మేర నిజం ఉందో తెలుసుకోవాల‌నుకుంది.

గ‌త‌ వారం నామినేష‌న్స్‌(Nominations) లో మిమ్మల్ని సేవ్(Save) చేయ‌నందుకు నాపై న‌మ్మకం తగ్గిందా అని స‌న్నీ, మాన‌స్‌ల‌ను అడిగింది.

అందుకు మాన‌స్‌ ఆటలో నిన్ను న‌మ్మం కానీ ఫ్రెండ్‌షిప్‌లో మాత్రం నిన్ను ఎన్న‌డూ త‌క్కువ చేసి చూడ‌మ‌ని కాజల్  డౌట్ క్లియర్ చేసాడు.

ఇక ర‌వి యానీ ముచ్చట్లు పెడతారు, స‌న్నీ ఇంత‌వ‌ర‌కు సిరి, ష‌ణ్నుకు సారీ చెప్ప‌లేద‌ని చెవులు కోరుకుంటారు. గిల్టీ(Guilty) బోర్డును ధరించిన స‌న్నీ హౌస్‌మేట్స్(House mates) గురించి మాన‌స్‌, కాజ‌ల్‌తో మాట్లాడాడు.

యానీ మాస్టర్‌ అన‌కొండ, సిరి క‌ట్ల‌పాము, ష‌ణ్ముఖ్ న‌ల్లతాచు అని పేర్లు పెట్టాడు.

ర‌వికి మాత్రం న‌ట‌రాజ్ మాస్టర్ ఇచ్చిన గుంట‌న‌క్కే స‌రిగ్గా సూట్ అవుతుందని. తాను మంకీ లేదా చింపాంజీన‌ని చెప్పుకొచ్చాడు.

త‌ర్వాత 11వ వారం నామినేష‌న్(Nomination) ప్రక్రియ పమొదలైంది. నామినేట్ చేయాల‌నుకున్న వ్య‌క్తుల త‌ల‌పై బాటిల్‌ లోని లిక్విడ్ ని పోయాలని  ఆదేశించాడు.

స‌న్నీ మెడ‌లో గిల్టీ ట్యాగ్‌ను తొల‌గించ‌డంతో ఈ ప్రక్రియ మొద‌లైంది. మొద‌ట‌గా కెప్టెన్(Captain) ర‌వి త‌న‌ను ఫే(Fake)క్ అన‌డం న‌చ్చలేదంటూ స‌న్నీని, స‌న్నీని రెచ్చగొట్టిందంటూ కాజ‌ల్‌ను నామినేట్ చేశాడు.

ష‌ణ్ముఖ్‌, కాజ‌ల్ ఇంటి నుంచి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌ని నామినేట్ (Nominate) చేసిన షన్ను. ఆ తరువాత  ప్రియాంక సింగ్‌పై బాటిల్‌లోని ద్రవాన్ని పోశాడు.

మాన‌స్‌- ష‌ణ్ను, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. శ్రీరామ్‌-మాన‌స్‌, స‌న్నీని నామినేట్ చేశాడు.

కాజ‌ల్ మాట్లాడుతూ నేను ఎంత ట్రై చేసినా క‌నెక్ట్ కావ‌ట్లేదని, పైగా వెక్కిరించ‌డం అస్స‌లు న‌చ్చలేదంటూ యానీని నామినేట్ చేసింది.

దీంతో పిచ్చెక్కిపోయిన యానీ కుప్పిగెంతులేసి ఆమె స‌హనాన్ని పరీక్షించింది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌నుకోవ‌డం చెప్పడం కరెక్ట్ కాదని  ష‌ణ్నును నామినేట్ చేసింది .

సిరి.. కెప్టెన్సీ(Captaincy) కంటెండ‌ర్స్ టాస్క్‌ లో ప్రియాంక సింగ్ త‌న‌కు స‌పోర్ట్ చేయ‌లేద‌ని, మాన‌స్ గేమ్ కూడా తానే ఆడుతోందంటూ నామినేట్ చేసింది. సిల్లీ రీజ‌న్స్(Silly Reasons) ఇవ్వ‌కంటూ కాజ‌ల్ ని నామినేట్ చేసింది.

త‌ర్వాత ప్రియాంక సింగ్‌-సిరి, ష‌ణ్ముఖ్‌ల‌ను నామినేట్(Nominate) చేసింది. స‌న్నీ- శ్రీరామ్‌ను నామినేట్ చేసే టైం లో వీళ్ళ మధ్య వాగ్వాదానలు జరిగాయి. శ్రీరామ్‌తో పాటు సిరిని నామినేట్ చేశాడు.

ఇక యానీ వంతు రాగా.. నేను మా ఫ్యామిలీని మిస్ అవుతున్నాన‌ని హ‌గ్ చేశాను. కానీ హ‌గ్ పాయింట్‌ను ఇలా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి నామినేట్ చేయ‌డం న‌చ్చలేదంటూ మాన‌స్ త‌ల‌పై బాటిల్ లోని లిక్విడ్(Liquid) ని పోసింది. త‌ర్వాత కాజ‌ల్‌ను నామినేట్ చేస్తూ వెక్కిరించింది.

ఇలా వెక్కిరించ‌డాన్నే అగౌరవ పరచడం అంటార‌ని కాజ‌ల్ అంది. దీంతో యానీ  వెక్కిరించ‌డం అంటే అవ‌మానించ‌డం అని ఏ ఒక్కరితో అనిపించినా ఆ రోజు నేను నీ కాళ్లు మొక్కుతాను,

అది కూడా సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తాన‌ని గట్టి గానే కౌంటర్ ఇచ్చింది.

మొత్తంగా కెప్టెన్Captain) ర‌వి తప్ప మిగిలిన ఎనిమిది మంది ఈ వారం నామినేట్ అయ్యారు.

ఈ నామినేషన్ ప్రక్రియ లో జరిగిన వాగ్వాదానలను ఈ వారం మొత్తం లో ఎలాంటి  పరిణామాలకు దారి తీయనున్నాయో ….