భారత సంప్రదాయంలో ఔషధం(Medicine)గా పేరుపొందింది పసుపు(Turmeric). ఇది ఓ ఆంటీబయోటిక్(Antibiotic) లా పనిచేస్తుంది. చిటికెడు పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనా(Benefits)లు ఉన్నాయి.

శ్వాసకోశ సమస్యలతో పాటు కాన్సర్ మహమ్మారితో సైతం ఇది పోరాడుతుంది. పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో? ఇక్కడ  తెలుసుకుందాం. భారతదేశంలో విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి. ఈ విషయాన్ని నిరూపించడానికి ఎన్నో పరిశోధనలు ఉన్నాయి.

పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్(Curcumin) ఇది దాదాపు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పసుపులోని గుణాలు మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అంతేకాక పసుపు గాయాలను తగ్గిస్తుందని, సౌందర్య ఉత్పత్తులలో వాడతారనీ, చర్మ సౌందర్యానికి పరమ ఔషధమనీ విని ఉంటారు.

పసుపు అల్లం జాతికి చెందిన మసాలా(Masala) ద్రవ్యం లాంటి పదార్థం. భారత్లో, ఆసియాలో తయారు చేసే వంటకాల్లో దీన్ని తప్పకుండ ఉపయోగిస్తారు. పసుపు(Turmeric) వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యమే కాకుండా, ఎన్నో రకాల వ్యాధులను ఎదురుకునే దివ్యఔషదం కూడా.

శ్వాసకోశ వ్యాధులకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కాన్సర్ తో పోరాడుతుంది.మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్(Artharitis) వ్యాధి వున్నవారు రోజు పసుపు తీసుకోవడం మంచిది.

దీని వల్ల కీళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ముఖ్యం గా జాయింట్(Joints) లు పట్టేసినట్లు ఉండకుండా ఉంటాయి.

పసుపు తీసుకున్న వారిలో డేటాక్సీఫయింగ్(De-Toxfying) ఎంజయ్మ్(Enzymes) ఉత్పత్తవుతుంది. ఇది కాన్సర్ ట్యూమర్  కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. దింతో కాన్సర్ కణాలు చచ్చిపోయి వ్యాధి ముదరకుండా కాపాడుతుంది.

మరో వైపు కాన్సర్(Cancer) రోగులు కీమో థెరపీ చికిత్స తీసుకున్నపుడు వారికి వైద్యులు ఇచ్చే మందులతోను పసుపు కలిపి పని చేస్తుంది. దింతో కాన్సర్ తగ్గుముఖం పట్టడంలో  కీలక పాత్రపోషిస్తుంది.టైపు 2 డయాబెటిస్ చికిత్సలో పసుపు దివ్య ఔషధంగా పని చేస్తుంది.

పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు నివారణ కొరకు విస్తృతంగా ఉపయోగిస్తారు. దానిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియు యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని ఎన్నోఅధ్యయనాలు పేర్కొన్నాయి.

శరీరం వాపులు రాకుండా నిరోధించే పసుపు, రక్తంలో చెక్కర స్థాయిని నిరోధిస్తుంది.దింతో టైపు 2(Type 2) డయాబెటిస్ చాలా వరకు నియంత్రణలో వుండే అవకాశం వుంది.

వాతావరణం మార్పుల వల్ల అల్లెర్జిలు(Allergies), వైరల్ ఇన్ఫెక్షన్లు(Viral Infections) కలగడం సాధారణం అయితే వీటికి చక్కటి ఔషధంగా పని చేస్తుందని తెలుస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలంటే పసుపు టీ(Turmeric tea) తాగితే ఉపశమనం లభిస్తుంది. ఫ్లూ, వైరస్, అల్లెర్జిలను పసుపు దీటుగా ఎదుర్కొంటుంది ఈ రోజులల్లో పని భారం పెరగడం, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా మానసిక ఒత్తిడి( Mentalstress) విపరీతంగా పెరుగుతుంది.

అయితే దీనికి కూడా పసుపు మంచి ఔషధం(Medicine)గా పనిచేస్తుందని పలు పరిశోధనలో తేలింది.

మహిళల్లో రుతుక్రమంలో వచ్చే తిమ్మిర్లను కూడా పసుపు నియంత్రిస్తుంది. శరీరంలో చేదు కొలెస్ట్రాల్(Cholestrol) స్థాయిలను నియంత్రించడంలోను పసుపు ఉపయోగం చాలా వుంది. చేడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండడంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అంటే చిటికెడు పసుపు ప్రాణనాన్ని కాపాడుతుందన్న మాట అంటి ఇన్ఫలమ్మటరీ(Anti-Inflammatory) గా పని చేసే పసుపు దీర్ఘకాలిక(Chronic) వ్యాధులకు సైతం పని చేస్తుంది.

అలజమీర్స్(Alzhemiers) రాకుండా నిరోధిస్తుంది పరిశోధన(Research)లు చెబుతున్నాయి.

కాబట్టి ఇక పై కూడా అందరు నిరంతరం పసుపు(Turmeric)ను రోజువారీ లో ఉపయోగించడం చాలా మంచిది….