ఈ రోజుల్లో విద్యార్థులు(Students), ఉద్యోగులు(Employees) ఇలా చాలా మందికి ల్యాప్‌టాప్‌(Laptop)లు బాగా యూజ్(Use) అవుతున్నాయి .

మరి లాక్‌డౌన్‌ టైం లో అయితే  ఆన్‌లైన్‌ క్లాసుల(Online Classes), ఆఫీస్‌ వర్క్‌ల(Office Works) కోసం చాలా మంది ల్యాప్‌టాప్‌ల పైనే ఆధారపడ్డారు. కానీ  ఎక్కువ సేపు వాడటం వల్ల ల్యాప్‌టాప్‌లు హీట్(Heat) ఎక్కుతాయి .

ఇవి బాగా వేడెక్కితే అందులోని సున్నితమైన భాగాలు కాలిపోయే ప్రమాదం ఉంది.నిజానికి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ల్యాపీలు కాలిపోతుంటాయి.అయితే ల్యాప్‌టాప్‌లు కాలిపోయేంత వేడెక్కకుండా అందులోని కూలింగ్ ఫ్యాన్‌(Cooling Fans)లు ఎప్పటికప్పుడు చల్లదనాన్ని అందిస్తుంటాయి.

అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు ఈ ఫ్యాన్లలోకి దుమ్ము(Dust), ధూళి కణాలు చేరుతుంటాయి.దీని వల్ల ఆ ఫ్యాన్ల పనితీరుపై ప్రభావితమవుతుంది. అలా ఫ్యాన్లు కావాల్సినంత కూలింగ్‌ను ల్యాప్‌టాప్‌లకు అందించలేకపోతే, ఫలితంగా ల్యాప్‌టాప్‌ల్లోని కాంపోనెంట్స్(Components) కాలిపోతాయి. అయితే ల్యాప్‌టాప్‌లు హీట్ ఎక్కకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్‌(Laptop) టర్న్ ఆన్(Turn On) చేయగానే అందులోని కూలింగ్ ఫ్యాన్లు(Cooling Fan) వేగంగా తిరుగుతున్నట్టు శబ్దం(Sound) వినిపిస్తే వాటి పనితీరు తగ్గినట్లు మీరు అర్థం చేసుకోవాలి. దీనివల్ల ల్యాపీ ఎక్కువ హీట్ అవుతుందని గుర్తించాలి.

ల్యాప్‌టాప్‌ వేడెక్కుతుందని గమనించగానే మీరు కూలింగ్ ఫ్యాన్లను క్లీన్(Clean) చేసుకోవాలి. సీపీయూ(CPU), జీపీయూ(GPU) పార్టులకు కూలింగ్‌ను అందించే ఫ్యాన్స్ లోకి దుమ్ము, ధూళి  చేరితే ఫ్యాన్లు పాడైపోతాయి.అలాగే ఈ దుమ్ము అనేది ఎయిర్‌ఫ్లో(Air Flow)కు అడ్డుగా మారి హీట్ పెంచుతుంది. వీటిని శుభ్రం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు (Tips)పాటించడం(Follow) ముఖ్యం.

క్లీన్ చేసే ముందు ల్యాప్‌టాప్‌ను ఆఫ్ చేసి కేబుల్స్‌(Cables), బ్యాటరీ(Battery)ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి.ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ బ్యాక్ ఓపెన్ చేసి అందులోని ఫ్యాన్లను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లో ముంచిన కాటన్ తో క్లీన్ చేసుకోవాలి.

ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్(Isoprofiel Alcohol) ల్యాప్‌టాప్‌లోని కాంపోనెంట్స్‌(Components) పై తడిగా ఉండకుండా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. లేదంటే అవి పాడయ్యే ప్రమాదం ఉంది.

అతి తక్కువ ప్రెజర్‌ ఉన్న ఎయిర్‌ పంప్‌(Air Pumps)ల సాయం(Help)తో కూలింగ్‌ ఫ్యాన్‌లు క్లీన్ చేసుకోవచ్చు.అలాగే ల్యాప్‌టాప్‌ ఎగ్జాస్ట్‌(Exhaust), వెంటిలేటర్ల(Ventilators)ను సాఫ్ట్ బ్రష్‌(Soft Brush)తో శుభ్రం చేసుకుంటే ల్యాప్‌టాప్‌ వేడెక్కదు.