మీ పీసీ(PC)లో విండోస్ 7,8 (WINDOWS) ఆపరేటింగ్ సిస్టం(OS)ను ఉపయోగిస్తున్నారా..? అయితే, ఈ చిట్కాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం!

విండోస్ 7 డెస్క్‌టాప్ ట్రిక్స్

* టాస్క్‌బార్(Taskbar) పై తెరిచి ఉన్న అప్లికేషన్‌ల(Applications)ను సెలక్ట్ చేసుకునేందుకు కీబోర్డ్‌(Keyboard)లో (win+T) షార్ట్ కట్‌ను అమలు చేయండి
* డెస్క్‌ టాప్ పై ఉన్న ఫైళ్లను కాపీ(Files Copy), పేస్ట్ ఇంకా మూవ్(Paste and Move) చేసేందుకు కీబోర్డ్‌లో (ctrl+C), (ctrl+V), (ctrl+Z) షార్ట్ కట్‌‌ల(Shortcuts)ను అమలు చేయండి.
* టాస్క్ మేనేజర్‌(Task Manager)ను ఓపెన్ చేసుకునేందుకు కీబోర్డ్‌లో (Ctrl+Shift+Esc) షార్ట్ కట్‌‌ను అమలు చేయండి. టాస్క్ మేనేజర్ అంటే పీసీలో ఏఏ ప్రోగ్రామ్‌లు(Programs) పనిచేస్తున్నాయో తెలుపుతుంది. ఏమైనా ప్రోగ్రామ్‌లు పనిచేయకుంటే టాస్క్ మేనేజర్ ద్వారా వాటిని కిల్ చేయవచ్చు.
* డెస్క్‌ టాప్ పై పిన్ చేసి ఉన్న అప్లికేషన్‌లను ఓపెన్ చేసేందుకు కీబోర్డ్‌లో విండోస్ బటన్‌(Windows Button)ను ప్రెస్ చేసి 1 నుంచి 9 లోపు ఏదైనా ఒక సంఖ్య గల బటన్‌ను ప్రెస్ చేసినట్లయితే వరస క్రమాన్ని బట్టి యాప్‌లు ఓపెన్ అవుతాయి.
* డెస్క్‌ టాప్ పై కొత్త షార్ట్‌ కట్‌ను క్రియేట్ చేసేందుకు ఫోల్డర్ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఆప్షన్‌(Create Option)లో షార్ట్‌ కట్‌ను ఎంపిక చేసుకోండి.
* డెస్క్‌ టాప్ పై కమాండ్ ప్రాంప్ట్‌(Command Prompt)ను ఓపెన్ చేసేందుకు కీబోర్డ్ లో shift బటన్‌ను పట్టుకుని మౌస్ రైట్ క్లిక్(Mouse Right Click) చేసిననట్లయితే కమాండ్ విండో ఆప్షన్‌(Command Window Option)తో కూడిన మోనూ(Menu) ఓపెన్ అవుతుంది.
* డెస్క్ టాప్ పై రన్ కమాండ్‌(Run Command)ను ఓపెన్ చేసేందుకు కీబోర్డ్‌లో (win+R) షార్ట్ కట్‌నుఅమలు చేస్తే సరిపోతుంది.

ముఖ్యమైన విండోస్ 8 షార్ట్‌కట్‌లు:

స్క్రీన్ పై అనేక విండోస్ అప్లికేషన్‌లు(Windows Applications) ఓపెన్ చేసి ఉన్నప్పటికి డెస్క్‌టాప్ మీదకు వచ్చేందుకు విండోస్ కీ + బీ (windows key + b) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌‍టాప్ పై ఓపెన్ చేసిన విండోలను మినిమైజ్(Minimize) చేసేందుకు విండోస్ కీ + డీ (windows key + D) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్(Desktop) పై మై కంప్యూటర్‌ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీ + ఇ(windows key + E) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై ఏమైనా ఫైల్స్ వెతకాలంటే విండోస్ కీ + ఎఫ్(windows key + F) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై షేర్ సెట్టింగ్స్‌(Share Settings) ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీ + హెచ్ (windows key + H) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ పై ఓపెన్ చేసి ఉన్న అప్లికేషన్ సెట్టింగ్స్(Application Settings) ను వీక్షించేందుకు విండోస్ కీ + ఐ (windows key + I) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్‌ను లాక్ చేసేందుకు విండోస్ కీ + ఎల్ (windows key + L) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.