కంటి నిండా గాఢమైన నిద్ర(Deep Sleep) పోగలిగితే. అది మనకు చక్కని మిత్రుని(Friendly)గా ఆరోగ్యాన్నిస్తుంది.అదే నిద్ర కరువైపోతే మాత్రం, అంతులేని ఆరోగ్య సమస్యల(Health Issues)ను తెచ్చి పెడుతుంది. శరీరం ఎప్పటికప్పుడు తనని తాను రిపేర్ చేసుకుని. తాజాగా మారడం నిద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే ఎంత సమయం, ఎంత గాఢంగా నిద్రపోతున్నాం అనేదే కాకుండా మనం నిద్రించే తీరు ఎలా వుంది అనేది కూడా మన ఆరోగ్య ప్రభావాన్ని చూపెడుతుంది.

అలాగే నిద్రపోయే భంగిమలు మన వ్యక్తిత్వం గురించి కూడా తెలియజేస్తాయి.ఆసక్తి కరమైన ఆ విశేషాలను తెలుసుకుందాం!

మనం ఎలా నిద్రపోతునం అనేది మన వ్యక్తిత్వాన్ని(Individuality) గురించి వెల్లడిస్తుందని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే నిద్రపోయే ముందు మన శరీర తీరు ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోగలం. కానీ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయాక మాత్రం మన శరీర తీరు ఎలా వుంది అనే అంశాన్ని మనం నిర్దారించలేము.చాల మంది నిద్రలో మీద పట్టేసింది అంటుంటారు.

అలాగే గురక(Snore) పెడుతున్నవారు పక్కకు తిరిగి పడుకుంటే గురక తగ్గుతుందని కూడా సంబంధిత నిపుణులు(Experts) సలహా ఇస్తుంటారు.మన ఎలా నిద్రపోతున్నాము అనేది ఆరోగ్యం పైన ప్రభావాన్ని(Influence) చూపెడుతుంది. కొంతమంది తమ పొట్టని ఆధారం చేసుకుని బోర్లా పడుకుంటారు. ఇలాంటి వారికి నిద్రలో సమస్యలు వుండే అవకాశం వుంది.

అందుకే వారు వీలైనంత వరకు సౌకర్యవంతంగా నిద్రపోవడానికి బోర్లా పడుకుంటూ వుంటారు.అయితే ఈ తరహా నిద్రించే దాని వల్ల మెడ(Neck), నడుములు(Hip), కింది భాగం ఒత్తిడి(Stress)కి గురయ్యే అవకాశం ఉంటుంది. వీరు నిద్రించడానికి మెత్తటి దిండు(Soft Pillow)ను వాడుతుంటారు.

కొంతమంది అసలు దిండును వాడరు. ఇలా నిదిరించే వారు 7 శాతం మంది వుంటారు. తలను పక్కకు తిప్పి పెడతారు.కొంతమంది వెల్లకిలా పడుకుని నిద్రపోతూ వుంటారు. ఇలాంటి వారికి కాస్త వెన్నునొప్పి వస్తుంటుంది. ఒకవేళ ఇప్పటికే వెన్ను నొప్పి(Back Pain) ఉంటే అది మరింతగా పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు వున్నవారు తాము నిద్రించే విధానం వల్ల సమస్యలు వస్తున్నప్పుడు నిపుణులను అడిగి తగ్గిన సలహాలు తీసుకోవడం మంచిది. మరి

కొందరు వెల్లకిలా పడుకుని చేతులను శరీరం పక్కన నిట్టారుగా ఉంచుతారు. ఇలా నిద్రించే వారు దాదాపు 6శాతం మంది వుంటారు.వెల్లకిలా పడుకుని చేతులు తలా చుట్టూ దండలా పెట్టుకుంటారు. దాదాపు 5 శాతం అంన్డి ఈ విధంగా నిద్రపోతారు. ఒక పక్కకు పడుకుని నిద్రపోయే విధానం చాలా మందిలో ఉంటుంది. పక్కకు తిరిగి మొక్కలను కాస్త పైకి వుంది నిద్రించే విధానం లో చాల మంది నిద్రపోతుంటారు.

నిద్రలో వున్నపుడు మన శరీరం ఎలా వుంటుంది అనేది చాల వరకు మన చేతిలో లేకపోయినా నిద్రించే విధానం మన ఆరోగ్యం, వ్యక్తిత్వాల పై ప్రభావం చూపడం అనేది కాస్త విచిత్రమే సాధారణంగా పక్కకి తిరిగి పడుకున్నప్పుడు శరీరం సౌకర్యవంతంగా ఉంటుందని భావించవచ్చు చాలా మంది.

శరీరాన్ని పక్కకు తిప్పి చేతులు ముందుకు సారి నిద్రపోయే వారు విశాలమైన మనసు కలిగిన వారు అయ్యి ఉంటారని, అయితే వీరు కాస్త అనుమానాస్పదమైన వ్యక్తులు అయ్యి ఉంటారని, తమ అభిప్రాయాలకు కట్టుబడి మొండిగా పని చేసే వారై ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.నిద్రలో గురకని తగ్గించుకోవాలనుకునే వారు, పక్కకు తిరిగి నిద్రపోవడం మంచిది.

అలా పాడుకోలేకపోతే పక్కకు దిండ్లు పెట్టుకోవాలి. నిద్రించే భంగిమ(Sleeping Angels)ల వలన శరీరంలో నొప్పులు వస్తున్నప్పుడు దిండ్ల(Pillows)ను శరీరానికి సపోర్ట్(Support) గా పెట్టుకోవడం అవసరం. నడుము వెన్ను నొప్పులు వున్నా వారు కాళ్ళ మధ్యన, వెల్లకిలా నిద్రించే వారు మొక్కల కింద దిండ్లను ఉపయోగించుకోవడం అవసరం.

గర్భిణీలు(Pregnant Ladies) ఎడమ వైపు(Left side) నిద్రించినపుడు కడుపు(Stomach)లోని బిడ్డకు(Baby) పోషకాలు(Nutrients), రక్తం(Blood) ఎక్కువగా అందుతాయి.

నిద్రకు అనుకూలంగా మన శరీర తీరు ఉండాలంటే మనం నిద్రించే పక్క కూడా సౌకర్యవంతం(Comfort)గా నిద్రకు అనుకూలంగా చూసుకోవాలి.