బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) గురువారం నాటితో బిగ్ బాస్ 68వ ఎపిసోడ్‌ లో ఈవారం కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల టాస్క్‌ లో భాగంగా బిబి హోటల్‌(BB Hotel) టాస్క్‌ చాలా ఫన్నీ గా సాగుతోంది.

ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సిరి, సన్నీ, కాజల్‌, ప్రియాంక, మానస్‌ అక్కడి సిబ్బందితో సర్వీస్ చేయించుకుంటూ టిప్పులివ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌లో వీజే ఊర మాస్‌గా కనిపించి పంచ్‌లతో తెగ నవ్వించేసాడు…..

ఇక రవి, షన్ను అయితే సర్వెంట్స్ గా వారి పెర్ఫార్మన్స్(Performance) అదిరిపోయింది. వీరి ప్రవర్తనతో విసిగిపోయిన హోటల్‌ స్టాఫ్‌ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని రిక్వెస్ట్ చేసిన అతిధులు వినిపించుకోలేదు. మరో పక్క హోటల్‌కి గెస్ట్‌ గా వచ్చిన కాజల్ వద్ద రవి డబ్బుల్ని కొట్టేయడంతో హోటల్ సిబ్బందికి, గెస్ట్‌(Guest) ల మధ్య డిస్కషన్ జరుగుతుంది.

నాకు రవిపైనే డౌట్ ఉందని కాజల్ చెప్పడంతో మా హోటల్ టీం తీయలేదని చెప్పింది మేనేజర్ ఆనీ మాస్టర్. నా దగ్గర కొట్టేసిన 17 వందల లెక్క తేలేవరకూ మా దగ్గర నుంచి టిప్‌(TIP)గా ఒక్క రూపాయి కూడా రాదని తెగేసి చెప్పింది కాజల్. మీరు డబ్బులు ఇవ్వకపోతే మేం సర్వీస్‌(Service)లు నిలిపివేస్తాం అని చెప్పాడు రవి.

ఉదయం నుంచి సర్వీస్‌లు చేస్తున్న అందుకు తగ్గట్టుగా గెస్ట్‌లు టిప్‌లు ఇవ్వడం లేదని నలుగురికి నాలుగు వందలు కూడా రాలేదు. డిన్నర్ సర్వీస్ చేయాలంటే టిప్‌లు ఇస్తేనే చేస్తాం అని గెస్ట్స్ తో చెప్పింది ఆనీ మాస్టర్.

ఆ తరువాత హనీమూన్ కపుల్‌గా మానస్-ప్రియాంకల కోసం హనీమూన్ బెడ్ రెడీ చేసి టిప్ కొట్టేసేందుకు ఆనీ మాస్టర్ ప్లాన్ చేయగా సన్నీ ఆ ప్లాన్ ని అట్టర్ ప్లాప్ చేసాడు. అయితే రవి కాజల్ డబ్బుల్ని కాజేయడాన్ని షణ్ముఖ్ చూసేస్తాడు .

డబ్బుల్ని కాజేయడం నేను చూశాను రవి దాని వల్ల మన గేమ్‌కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పాడు షణ్ముఖ్. అయితే తాను తీయలేదని రవి మాట మార్చేస్తాడు. రవి డబ్బులు కొట్టేయడం సీక్రెట్(Secret) టాస్క్ లో భాగం అనే సంగతి తెలియక నేను చూశాను నువ్వు తీయడం అంటాడు షణ్ముఖ్.

ఈవారం నామినేషన్స్‌(Nominations) లో భాగంగా సన్నీని ఆనీ మాస్టర్ జైలుకి పంపినప్పుడు ‘అపనా టైం ఆయగా నాకూ టైం వస్తుంది మాస్టర్’ అని అన్నాడు.

ఆ టైంలో ఆనీ మాస్టర్ సన్నీ మీద ఫైర్ అయింది. అయితే ఈ హోటల్ టాస్క్‌ లో టైం రావడం అంటే ఏంటో ఆనీ మాస్టర్‌కి చూపించాడు సన్నీ.

సన్నీకి సర్వీసులు చేస్తూ టిప్ కోసం అతన్ని  ఆనీ.దీంతో సన్నీ వంద టిప్ ఇస్తూ గల్లీ బాయ్ పాట ఏంటి అది అని అడిగాడు అపనా టైం ఆయగా అని చెప్పింది ఆనీ మాస్టర్.

దీంతో సన్నీ నవ్వుతూ ఓ మూమెంట్ వేయండి అని అడిగాడు. అపనా టైం ఆయగా అంటూ ఆనీ మాస్టర్ స్టెప్ వేసి మరీ చూపించింది.

మొత్తానికి ఆనీ మాస్టర్‌కి టైం రావడం అంటే ఏంటో చూపించి రివెంజ్(Revenge) తీసుకున్నాడు  సన్నీ.

ఈ టాస్క్‌(Task) లో డాన్ కూతురుగా వచ్చిన సిరి గెస్ట్(Guest) గా పెర్ఫార్మన్స్(Performance) ఇరగదీస్తోంది. ముఖ్యంగా షన్ను తో  అన్ని పనులు చేయించుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌ని డ్రింక్ తాగించమని కోరింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో తల పట్టించుకుంటూ కనిపించింది. నాతో చాలా సర్వీసులు  చేయించుకుంటున్నారు.

మీకు అర్థం కావడం లేదు ఈ టాస్క్ తరువాత ఎలా ఉంటుందో అని షణ్ముఖ్ అంటే మీకు కూడా అర్ధం కావడం లేదు ఈ టాస్క్ తరువాత కూడా  ఏం పీకలేవు అంటూ నోరు పారేసుకుంది సిరి.మరోపక్క రవి తన దగ్గర డబ్బులు కొట్టేయడంతో కాజల్ మాటు వేసి ఆనీ మాస్టర్ దగ్గర డబ్బుల్ని నొక్కేసింది.

ఆ తరువాత కాజల్ తాగే వాటర్‌లో కారం కలిపేశాడు రవి. దీంతో రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టు ఉన్నారని కనిపెట్టేసింది కాజల్. ఇక సిరి, ప్రియాంకలు కూడా కారం రవినే కలిపాడు ఖచ్చితంగా సీక్రెట్ టాస్క్ అని చెప్పడంతో ఆనీ మాస్టర్ కూడా సీక్రెట్ టాస్క్‌ ‌నా అని అడిగింది.

మొత్తానికి ఇతని సీక్రెట్ టాస్క్‌ అనే విషయం బయటపడటంతో  రవి కెప్టెన్(Captain) పోటీదారుడు అయ్యే ఛాన్స్(chance) ని  కోల్పోయినట్టే.

ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన స్టాఫ్(Staff) కి  మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్‌ పెట్టమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో  చేసేది ఏమి లేక అతిథులు డబ్బులు ఇచ్చి ఆహారం తీసుకున్నారు.

ఇక సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీ అయితే తన ఆరోగ్యం(Health) సరిగా లేదని బిగ్ బాస్(Big Boss) కెమెరాలతో తన బాధను చెప్పుకున్నాడు.  తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు పడిపోతున్నానని చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్‌ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు.

దీంతో అతడిని చెకప్‌ చేసేందుకు డాక్టర్‌ రాగా జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్‌, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్‌మెంట్‌(Treatment) ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి చెప్పాడు  బిగ్ బాస్ .

ఆరోగ్యం మెరుగుపడే వరకు సీక్రెట్ రూమ్(Secret room) లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారో  లేదా వీకెండ్ ఎలిమినేషన్(Elimination) లేకుండా జెస్సీ ని  ఇంటికి పంపుతారో ? ఏదైనా తెలియాలంటే బిగ్ బాస్(Big Boss) తదుపరి ఆదేశం వరకు ఎదురుచూడాల్సిందే……