బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) పద్నాలుగో వారం పూర్తయింది. కాజల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్(Eliminate) అయ్యి బయటకు వెళ్లిపోవడంతో కేవలం టాప్ 5 కంటెస్టెంట్స్(Contestants) మాత్రమే మిగిలారు. ఇక ముందు ముందు ఎలాంటి టఫ్ కాంపిటీషన్ ని ఎదురుకోబతున్నారో టాప్ 5 ఫైనలిస్ట్స్(Finalist). ఈ వారం చివరి బిగ్ బాస్ సండే ఫండే అని పేరుకున్న నాగార్జున. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే (Grand finale)సంబరాలు జరుపుకోనునాటు ప్రకటించిన నాగ్ సర్. అంటే వచ్చే ఆదివారంతో బిగ్ బాస్ విజేత ఎవరో తేలిపోనుంది. అలాగే స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో(Reality show) సీజన్ 5 బిగ్ బాస్ కూడా శుభం కార్డు పడనుంది. శ్రీరామ్, ఫస్ట్ ఫైనలిస్ట్ గా, సన్నీ సెకండ్ ఫైనలిస్ట్ గా ఇప్పటికే వెల్లడించారు. మరి ఆదివారం 99వ ఎపిసోడ్ లో మూడో ఫైనలిస్ట్ గా, షన్ను నాలుగో ఫైనలిస్ట్ గా, మానస్ ఐదో ఫైనలిస్ట్ గా ప్రకటించడంతో ఆనందంతో మునిగితేలారు. ఆ హై లైట్స్ మీ కోసం ఇక్కడ చూద్దాం,

సండే అంటేనే ఫండే అందులో భాగంగా ముందు హౌస్ మేట్స్(House mates)తో పాటలను గెస్ చేసే ఆటను ఆడించాడు కింగ్ నాగార్జున . చిట్టీలో రాసిన పాటను చూసి  పాడకుండా, స్టెప్పులు వేయకుండా యాక్ట్ చేసి మాత్రమే చూపించాలి. అవతలి వాళ్లు ఆ పాత ఏంటో  గెస్ చేయాలి. ఇందులో కోసం శ్రీరామచంద్ర, కాజల్, షన్ను ఒక టీం. మిగిలిన మానస్, సిరి, సన్నీలను మరో టీంగా విడగొట్టారు. ఈ గేమ్(Game) లో శ్రీరామచంద్ర టీం గెలించింది. ఆ తరువాత సిరి మూడో ఫైనలిస్ట్‌(Finalist) గా సన్నీ తో  ప్రకటించాడు నాగ్ సర్. ఆ తరువాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు(Contestants) హౌస్ లో  ఉన్న కంటెస్టెంట్లను వీడియో ద్వారా  కొన్ని ప్రశ్నలు వేశారు. అలా సిరి, షన్నులని జెస్సీ కొన్ని ప్రశ్నలు అడిగాడు. మానస్ కోసం ప్రియాంక ఓ ప్రశ్నను వేసింది. కాజల్ కోసం ప్రియ, శ్రీరామచంద్ర కోసం నటరాజ్ మాస్టర్ ప్రశ్నలు వేశారు.

ముందుగా  షణ్నుకి, సిరికి ఎలాంటి బాండింగ్‌ ఉందో నాకు తెలుసు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? అని ఎప్పుడైనా ఆలోచించావా? అని షన్ను ని అడిగిన ప్రశ్నకు షన్ను జవాబిస్తూ, ఫ్యామిలీస్‌ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి  నాకూ ఈ ప్రశ్న ఎదురైంది. అది తప్పే, కానీ సిరి నా బెస్ట్‌ఫ్రెండ్‌ జీవితాంతం ఆమెకు సపోర్ట్‌(Support) గా ఉంటాను చెప్పాడు.  బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక కొన్ని ఎపిసోడ్లు చూశాను. సన్నీ, మానస్‌ నా వెనకాల మాట్లాడారు. నేనెప్పుడూ నీ గురించి బ్యాక్‌ బిచింగ్‌ చేయలేదు. నువ్వు నా గుడ్‌ ఫ్రెండ్‌ అన్నాను. కానీ నువ్వు మాత్రం నేను నటిస్తున్నానని ఇంకా ఏవేవో అన్నావు. నిజంగా నీ మీద జెలసీ ఉంటే నిన్ను కెప్టెన్‌(Captain) చేయడం కోసం నేను కష్టపడకపోయేదాన్నిఅని ఎందుకు బ్యాక్ బిచింగ్‌ చేసావా అని యాని మాస్టర్ అడిగిన ప్రశ్నకు సన్నీ, నేను బ్యాక్‌ బిచింగ్‌(Back Bitching) చేయలేదు. యానీ మాస్టర్‌ కొన్నిసార్లు మాట మీద నిలబడదు, అప్పుడు నేను నా అభిప్రాయాన్ని ఫ్రెండ్స్‌ తో షేర్‌ చేసుకున్నానంతే. ఆమె నాకెప్పుడూ మంచి స్నేహితురాలే అని రిప్లై ఇచ్చాడు.

ఐస్‌ టాస్క్‌ లో పింకీ చేసిన వైద్యం వల్ల శ్రీరామ్‌ నడవలేకపోయాడు. టికెట్‌ టు ఫినాలే(Ticket to finale) టాస్కులో వేరేవాళ్లు నీ తరపున గేమ్‌ ఆడారు. అంటే పింకీ చేసిన వైద్యం గేమ్‌(Game) పరంగా నీకు ప్లస్‌ అయిందా? మైనస్‌ అయిందా? అని నటరాజ్ మాస్టర్ ప్రశ్నకు సమాధానం గా,  ఇది ప్లస్సో, మైనసో పక్కన పెడితే నేను టాస్కుల్లో 100% ఇచ్చాను. నా ఆట నేను ఆడలేకపోయాను కాబట్టి మైనస్‌ అయింది రిప్లై ఇచ్చిన శ్రీరామ్. ఇక మానస్ ని ప్రియాంక, ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? నటించావా? అని అడగగా మానస్‌ కచ్చితంగా భరించాను. నేనైతే నటించలేదు. కొన్ని సిట్యూషన్ లో ఓపెన్ గా కూడా న అభిప్రాయాన్ని చెప్పాను అని జవాబిచ్చాడు. బిగ్‌బాస్‌(Big Boss) హౌస్‌లోకి గేమ్‌ ఆడటానికి వెళ్లావు కదా, కానీ నువ్వు గేమ్‌ మీద శ్రద్ధ తగ్గించి ఎమోషనల్‌గా  కనెక్ట్‌ అవుతున్నాను అదీఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, నీకిది అవసరమా? అని సిరి, జెస్సీ కోపం తో ప్రశ్న వేసాడు. గేమ్‌ ఆడటానికే వచ్చాను. మధ్యలో కొన్నికొన్ని ఎమోషన్స్‌(Emotions) తీసుకుంటున్నాను. కానీ గేమ్‌లో ఎమోషనల్‌ కనెక్ట్‌ అయితే అవసరం లేదు అని చెప్పుకొచ్చింది సిరి. ఇక ప్రియా, బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. సహజంగా నువ్వు ఇలాగే ఉంటావా? గేమ్‌ వరకేనా? ఇది వరకు ఈ ప్రశ్న హౌస్ లో వున్నపుడు కూడా మనము డిస్కస్ చేసాం అని తెలిపింది. దానికి సమాధానంగా  నాకు ఎప్పుడు ఎలా రియాక్ట్‌ అవ్వాలనిపిస్తే, అలానే రియాక్ట్‌ అవుతున్నా. నేనిలాగే ఉంటాను అని తెలిపింది కాజల్.

ప్రశ్నోత్తరాల  అనంతరం షన్ను నాలుగో ఫైనలిస్ట్(Finalist) అని నాగార్జున ప్రకటించాడు. ఆ తరువాత కంటెస్టెంట్స్ తో మళ్లీ ఓ ఆట(Game) ఆడించాడు. ఒక్కో కంటెస్టెంట్ మిగిలిన వేరే కంటెస్టెంట్‌లా మారి ఫైనల్ స్పీచ్(Final speech) ఇవ్వాలని తెలిపాడు. అలా శ్రీరామచంద్రలా మారి మానస్ మరి బాగా ఇమిటేట్ చేస్తూ, శ్రీ రామ్  ఫైనల్ స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాడు.ఆ తరువాత కాజల్ ల ఫైనల్ స్పీచ్ ఇచ్చిన శ్రీరామ్ ఇరగదీసాడు. ఆ తరువాత సన్నీ వచ్చి సిరిలా మారిపోయాడు. హగ్గులు, షన్ను మ్యాటర్ తీస్తూ సిరిని బాగా పాయింట్ అవుట్ చేస్తూ ఫైనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇక షన్నులా మారిన కాజల్ అదరగొట్టేసింది. చివరకు షన్ను, సన్నీలా ఆక్ట్ చేస్తూ ఫైనల్ స్పీచ్ ఇచ్చే ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసికొట్టింది, ఇక లాభం లేదనుకున్నాడో ఏమో తనలానే మాట్లాడుతూ సన్నీ మనసులో వున్నా మాటలను తెలిపాడు.ఫైనల్ స్పీచ్ గేమ్ ముగిసిన తర్వాత మానస్‌ను ఐదో ఫైనలిస్టుగా ప్రకటించిన నాగ్‌, కాజల్‌ ఎలిమినేట్‌(Eliminate) అయినట్లు వెల్లడించాడు. దీంతో సన్నీ, మానస్‌ ఎమోషనల్(Emotional) అయ్యి  వెక్కివెక్కి ఏడ్చారు. ఇక శ్రీరామ్‌తో నువ్వెప్పటికీ నా బ్రదర్‌వే అని చెప్పుకొచ్చింది కాజల్‌. నన్ను బాగా మిస్సవ్వండి అంటూ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బిగ్ బాస్(Big Boss) స్టేజీ మీదకు వచ్చిన కాజల్‌తో నాగార్జున ఓ ఆసక్తి కరమైన గేమ్‌ ఆడించాడు. ఐదు ఎమోషన్స్‌ను ఐదుగురు కంటెస్టెంట్ల(Contestants)కు డేడికేట్(Dedicate) చేయాలనీ చెప్పాడు

ఎంటర్‌టైన్‌మెంట్‌(Entertainment) చేయడంలో ఐదు రెట్ల సన్నీ ఇస్తే, మానస్‌ ఐదు రేట్లు ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడంది కాజల్. సిరి ఐదు రెట్ల ఎమోషన్‌ ఇస్తే, శ్రీరామ్‌ ఐదు రెట్ల యాక్షన్‌ చేస్తాడని తెలిపింది. షణ్ముఖ్‌ ఐదు రెట్ల డ్రామా చేస్తాడని తెలిపింది . ఎలాంటి డ్రామా(Drama) చేస్తాడు అని నాగ్ అడగగా, సిరిని కంట్రోల్‌(Control) చేయడం, తిట్టడం, హగ్గులివ్వడం ఇలా ప్రతిదాంట్లో డ్రామా ఉంటుందని పేర్కొంది. తాను టాప్‌ 6లో ఉండగానే ఎలిమినేట్‌(Eliminate) అవుతానని కల వచ్చిందని, చివరకు అదే నిజమైందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. చివరగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ తనే మూల కారణమని ఒప్పుకోవడం హైలైట్. కానీ అవేవీ తను కావాలని చేయలేదని సిట్యుయేషన్ కి తగ్గట్టు ప్రవర్తించానని తెలిపింది. ఫైనల్(Final)గా బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) లో  శ్రీరామ్‌, సిరి, మానస్‌, షణ్ను, సన్నీలు  టాప్‌ 5 కంటెస్టెంట్లు (Contestants)గా నిలిచి ట్రోఫీ(Trophy) కోసం పోటీపడనున్నారు.