జగపతిబాబు(Jagapathi Babu) హీరో(Hero)గా నటిస్తున్న తాజా చిత్రం ‘సింబా(Simbha)’.‘ది ఫారెస్ట్ మ్యాన్’(The Forest Man) అనేది ట్యాగ్ లైన్(Tag Line).

మురళీ మనోహర్ రెడ్డి(Murali Manohar Reddy) దర్శకత్వం(Direction) వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్(Science Fiction Thriller) సబ్జెక్ట్‌కి దర్శకుడు సంపత్ నంది(Sampath Nnadi) కథ అందించారు.

సంపత్ నంది టీమ్‌వర్క్స్(Samapth Nandi Team Works) సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌(Raj Dasari Productions Banner)పై రాజేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environment Day) పురస్కరించుకుని మేకర్స్(Makers) ఫస్ట్ లుక్‌(First Look)ని ఆదివారం (జూన్ 5) రిలీజ్ (Release)చేశారు. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి కుమారుడి(Nature Son)గా అద్భుతమైన పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో జగపతిబాబు అడవిలో నివసించే మహా మనిషిగా చూపించారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జగపతిబాబు చెట్లను భుజాలపై మోస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.‘అతను ప్రకృతి పుత్రుడు జగపతిబాబుని సింబా(Simbha)గా పరిచయం చేయడం ఆనందంగా ఉంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్(Forest Man) సింబాను పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం(Movie Team) తెలిపింది.