ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కాంబినేషన్‌లో`ఆర్‌ఆర్‌ఆర్‌` (RRR) దోస్తీ లోని సాంగ్‌ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఆయా భాషలకు చెందిన ఐదుగురు సింగర్స్ తో పాడించారు.

ఆగస్ట్ లో రాబోతోన్న ఈ దోస్తీ  సాంగ్ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆగస్ట్ 1st న ఫ్రెండ్ షిప్ డే (Friendship day)సందర్బం గా ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు .

దీనిలో  రానా, రవితేజ, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌,ప్రభాస్‌ లపై ఈ పాటని చిత్రీకరించినట్టు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

వీడియోతో సహ ఈ పాటని ఆగష్టు 1st న రిలీజ్‌ చేయబోతున్నట్టు సమాచారం.

దీంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందని, దీనిని ఎలా చిత్రీకరించారనేది అందరిలోనూ సరికొత్త ఆసక్తి నెలకొంది.

దీని కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఉత్కంఠభరితంగా వెయిట్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్‌ పాటలు పాడిన సింగర్ హేమచంద్ర ఈ సాంగ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Hema chandra

దర్శకుడు రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో పనిచేయడం నాకు ఇదే తొలి సినిమా అని, ఇది నాకు ఒక పెద్ద  డ్రీమ్‌ అని, ఈ అవకాశం రావడం చాలా అదృష్టం అని తెలిపారు .

ఈ ఆనందాన్నిమాటల్లో  చెప్పలేను అని అన్నారు . పాట మొదలు పెట్టినప్పటి నుండి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పారు.

రాజమౌళి ఈ సాంగ్‌ షూట్‌ చేసిన విధానం ఎక్స్ట్రా ఆర్డినరీ అని,నెక్ట్స్ లెవల్‌ అని తెలిపారు.

సింగర్స్ కి ప్రతి పాటకి బాగా పాడతామా లేదా? అనే ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. దానిలో  ఇది పాన్‌ ఇండియా సినిమా, పైగా రాజమౌళిగారిది. ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.

Dosti music team

ఈ ప్రాజెక్ట్ లో నేను ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ పాడటం నిజంగా చెప్పలేని అనుభూతి అని తెలిపారు. రాజమౌళి పాట చిత్రీకరించిన విధానం మైండ్‌ బ్లోయింగ్‌ అని, లిరిక్స్ అయితే చాలా అద్బుతంగా ఉన్నాయి అని ఆయన మాటల్లో తెలిపారు .

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు బ్యూటీఫుల్‌ లిరిక్స్ రాశారని తెలిపారు. టోటల్ గా చెప్పాలి అంటే ఓవరాల్‌ ప్యాకేజీ సాంగ్‌ అని చెప్పారు.

అయితే ఈ చిత్ర  షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని సారధి అన్నపూర్ణ స్టూడియోలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లలో జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా హేమ చంద్ర మాటలతో ప్రమోషనల్ సాంగ్ పైన భారీ ఊహలలో ఉన్నారు ప్రేక్షకులు .. దోస్తీ సాంగ్ ప్రేక్షకుల అంచనాల కి తగ్గట్టు గా ఉందో లేదో ఆగస్ట్ 1st న చూసేద్దాం ..

ఆల్ ది బెస్ట్ దోస్తీ టీమ్ (All the best Dosti team)…