మెగాస్టార్(Megastar) చిరంజీవి(Chiranjeevi) తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు మాస్ మహారాజా(Mass maharaja) రవితేజ(Ravi Teja).

ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ ఈ ఏడాది ‘ఖిలాడీ(Khiladi)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జూన్ 17న ‘రామారావ్ ఆన్ డ్యూటీ’(Rama Rao on Duty)తో పాటు ఈ ఏడాది దసరాకి ‘ధమాకా(Dhamaka)’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే హీరోగా ఇంత బిజీగా ఉన్న రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హీరో(Hero) మాత్రమే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్లు(Supporting Characters) కూడా నచ్చితే చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు చెప్పినట్లు టాక్. బాబీ(Bobby) దర్శకత్వం(Direction)లో చిరంజీవి చేయబోయే సినిమాలో రవితేజ కీలక పాత్ర(Main Role)లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

మరోవైపు బాలకృష్ణ(Bala Krishna), అనిల్ రావిపూడి(ANIL Ravipudi) చిత్రాల్లో రవితేజ కూడా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక సమాచారం(Official Announcement) రావాల్సి ఉంది.