డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి . కొత్త గా డ్రైవింగ్ నేర్చుకున్నవారు డ్రైవింగ్ టెస్ట్,RTO ఆఫీస్ కి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేయాలి, ఇదీ పద్ధతి .

అయితే ఇపుడు RTO ఆఫీస్ కి వెళ్లే పనిలేకుండానే సులువుగా  డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చును మీకు తెలుసా ?? అదేలా అనుకుంటున్నారా …మరి ఆలస్యం ఎందుకు వివరాలు చుసుద్దేమా …

కొత్తగా రోడ్ ట్రాన్స్ పోర్ట్ మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన సరి కొత్త రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO ఆఫీస్ వద్దకు వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఇపుడు దీని కోసం చాలా సులువైన సరి కొత్త ఆన్లైన్ విధానాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంతో డ్రైవింగ్ లైసెన్స్ అభ్యర్థులు కోసం RTO ఆఫీస్ వద్ద క్యూ లో వేచి ఉండాల్సిన పని అసలా ఉండదు.

ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ కొత్త నియమాల ప్రకారం, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం నేరుగా నమోదు చేసుకోవచ్చు.

లెర్నర్స్ తమ డ్రైవింగ్ లైసెన్స్ అర్హతను  సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి.

అభ్యర్థి ఈ కేంద్రాలలో డ్రైవింగ్ టెస్ట్ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించగలిగితే, అపుడు ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.

Driving license apply

డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌ లో ఎలా సులువుగా పొందాలి?

  1. RTO వద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా, అభ్యర్థి ఆన్‌లైన్ టెస్ట్ కోసం హాజరుకావచ్చు.
  2. ఆన్‌లైన్ టెస్ట్ ఆడిట్ అనేది ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది.
  3. భారతీయ రహదారి రంగంలో మంచి డ్రైవర్ల కొరత కారణంగా నూతన నిబంధనలు అమలు చేయబడ్డాయి. ఇది రహదారి నిబంధనలపై అవగాహన లేకపోవడం వలన పలు రకాల ప్రమాదాలకు కారణమవుతుంది.
  4. డ్రైవింగ్ లైసెన్సుల ప్రక్రియలో జరుగుతన్న జాప్యాలు తగ్గించడానికి ఈ దరఖాస్తుదారుల ఆన్‌లైన్ పరీక్ష అమలు చేయబడుతోంది.
  5. ఆన్‌లైన్ డ్రైవింగ్ (online driving) అనేది ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే మరింత సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
  6. డిజిటలైజేషన్ ప్రక్రియ అనేది డ్రైవింగ్ లైసెన్స్ ల ని మరింతగా పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది.
  7. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు డ్రైవింగ్ పాస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిక్ గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.

ఆలస్యం ఎందుకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ట్రై చేయండి మరి …

ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ లో రహదారుల రూల్స్ అన్నీ తెలుసుకుని డ్రైవర్లు అందరూ సక్రమం గా వాహనాలను నడిపి జాగ్రత్త గా ఉంటారు అని కోరుకుందాం …