మనలో చాలా మంది టీ తాగడం వల్ల చాలా రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుందని, అందుకే తప్పకుండా టీ’ తాగుతామని చెబుతారు.. కానీ టీ కేవలం మంచి రెఫ్రెష్‌మెంట్ మాత్రమే కాదు ,దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది.

 రెగ్యులర్ గా టీ తాగడం వలన  ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు .

చాలా మంది వారి రోజును వేడి వేడి టీ తో ప్రారంభిస్తారు, ఎందుకంటే టీ తాగడం దిన చర్యను ఉల్లాసంగా ప్రారంభించవచ్చును అని అనేక మంది భావిస్తారు.

అందుకే సీజన్ ఏదైనా, టీ రుచికరమైన పానీయంగా పరిగణిస్తారు. ఎందుకంటే టీ ని చల్లగా అంటే ఐస్ టీ, వేడిగా కూడా తాగుతారు.

ఈ టీ లో కూడా అనేక రకాలు ఉన్నాయి. తయారీ విధానాలు ఎంత వేరైనప్పటికీ టీ అందరి ఆదరణ పొందుతోంది టీ .

ప్రపంచవ్యాప్తంగా నూటికి 90 శాతం మంది టీ ప్రేమికులే.

టీ తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అనేక అధ్యయనాలు తెలిపాయి.

ముఖ్యంగా టీ ను క్రమంగా తాగేవారు అనారోగ్యాల బారిన పడే అవకాశం తక్కువ అని తెలిపారు. టీని కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా ఆస్వాదించిన వారు టీ వల్ల వచ్చే ప్రయోజనాలు పొందుతారు.

అయితే టీలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్ టీ తో పోలిస్తే గ్రీన్ టీ బలమైన ప్రభావాన్ని చూపుతుంది అని నిపుణులు తెలిపారు.

ఫలితాల ఆధారంగా, 50 ఏళ్ల వ్యక్తి  ప్రతీ రోజూ టీ తాగడం వల్ల గుండె జబ్బు దాదాపు ఏడాదిన్నర తరువాత ఆలస్యం అవుతుందని, ఎప్పుడూ టీ తాగని వారికంటే కనీసం ఒక సంవత్సరం ఎక్కువ కాలం జీవించవచ్చు అని అధ్యయనాలు తెలిపాయి.

టీ కు రక్తపోటును కూడా తగ్గించే సామర్థ్యం ఉంది, అందుకే ఇది ఒక మనిషి స్ట్రోక్ తో చనిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది  పేర్కొన్నారు.

అయితే ఏ రకమైన టీ తాగితే మనిషి ఆరోగ్యంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటే, మంచి మూలికేతర టీ లన్నీ కామెల్లియా సినెన్సిస్ మొక్క ఆకుల నుండి తయారవుతుంది.

ఈ ఆకులను  ప్రాసెస్ చేయబడిన సమయాన్ని బట్టి నలుపు,ఆకుపచ్చ,  లేదా ఉలాంగ్ టీ తో ముగిస్తుంది అని నిర్ణయిస్తుంది.

గ్రీన్ టీ 

green tea

గ్రీన్ టీ అనేది  తక్కువ ప్రాసెస్ చేయబడినది  మరియు అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ కలిగి ఉంటాయి. కాటెచిన్,పాలిఫెనాల్ కలిగి ఉన్న ఏకైక రకం గ్రీన్ టీ .

అందువలన  గ్రీన్ టీ మీద  చాలా అధ్యయనాలు జరిగాయి.

అల్లం టీ 

అల్లం టీని చాలా సులువుగా మనం ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు. కొద్దిగా అల్లాన్ని దంచి నీళ్లలో బాగా మరిగించి వడకట్టి తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతీ రోజు ఉదయాన్నే లేవ గానే అందరికీ కొంచెం బద్దకంగా ఉంటుంది. అయితే దాని నుండి బయట పడాలంటే ఈ అల్లం టీ చాలా పెర్ఫెక్ట్ . అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు కూడా బాగా తగ్గిపోతాయి.

అల్లం టీ వలన కీళ్ల నొప్పులు వంటి దీర్ఘ కాలిక  సమస్యల నుంచి కూడా మంచి ఉపశమనం దొరుకుతుంది.

బ్లాక్ టీ 

ఈ బ్లాక్ టీ ని Camellia sinensis అనే మొక్క నుండి తయారు చేస్తారు. గ్రీన్ టీకి వాడే మొక్క నుండే బ్లాక్ టీని కూడా తయారు చేస్తారు. ఈ ఆకుల్ని కోసి బాగా  ఎండ బెట్టి ప్రాసెస్ చేసి సూపర్ ఫ్లేవర్ వచ్చే వరకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది.

బ్లాక్ టీలో కొంచెం  కెఫిన్ కూడా  ఉంటుంది కాబట్టి మనం దీనిని గమనించి తీసుకుంటూ ఉండాలి.ఇది  రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

దీనిలో కూడా యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు బాగా ఉంటాయి. బ్లాక్ టీ స్కిన్ ర్యాషెస్ వంటివి రాకుండా కూడా  కాపాడుతుంది.

హెర్బల్ టీ

herbal tea

హెర్బల్ టీ కూడా నార్మల్ టీ కి కొంచెం దగ్గర గానే ఉంటుంది. కానీ వీటిలోని  స్పైసెస్, మూలికలు, పండ్లు మరియు ఇతర మొక్కలు సారం లాంటివి ఉంటాయి.

అయితే హెర్బల్ టీలో కెఫీన్ ఉండదు. దీనిలో శాంత పరిచే గుణాలు ఉంటాయి. హెర్బల్ టీ లో కూడా చాలా రకాలు ఉన్నాయి.

ఇక్కడ మరొక కొత్త రకమైన టీ ,దాని ప్రయోజనాలు కూడా ఉన్నాయి .. ఆలస్యం చేయకుండా చూసేయండి …

మందారపువ్వు టీ

Hibiscus tea

మందారపువ్వు పువ్వులను బాగా ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు అనేది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.

రక్తంలోని కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తుంది.  అంతేకాకుండా శరీర జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది. దీనిలో విటమిన్‌–సితో పాటు చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి.

ఇవి  కాలేయ క్యాన్సర్‌ వంటి అనేక క్యాన్సర్‌లను బాగా నివారిస్తాయి.

మందారపూలతో కాచిన టీ త్రాగడం వలన రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి.అయితే ఈ చాయ్‌ను కొంచెం పరిమితంగా తాగితేనే మేలు.

అలాగే ఈ మందారపువ్వు (hibiscus)టీ కూడా ట్రై చేయండి .

చూసారు కదా ,టీ మన నిత్య జీవితం లో ఎంత మంచిదో ..అపోహలు మాని టీ ని సేవించి ,ఆరోగ్యం గా ఉండండి.