అగ్ర తారల్లో ఒకరు కాజల్ అగర్వాల్. ఇటీవల పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యిన మాట మన అందరికీ తెలిసిందే.

అయితే పెళ్లి తరువాత తన సినీ కెరీర్ కి పులిస్టాప్ పెడుతుందో,లేక కొంతమంది హీరోయిన్స్ లాగా కెరీర్ కంటిన్యూ చేస్తుందా అనేదానికి మాత్రం ఇప్పటిదాకా కాజల్ అగర్వాల్ ఎక్కడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు .
దీనితో కాజల్ ఫ్యాన్స్ కాజల్ కెరీర్ ఇంకా పులిస్టాప్ అనే అనుకున్నారు..

అయితే ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన కాజ‌ల్ అగ‌ర్వాల్ ,మంచి పాత్ర‌ల‌ను ఎంచుకుంటోంది. తన కెరీర్‌లో తొలిసారిగా అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

వివ‌రాల్లోకెళ్తే..

కాజల్‌ అగర్వాల్‌,జననీ అయ్యర్‌, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్‌… ప్రధాన తారలుగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘క‌రుంగాప్పియం’. దీనిలో రీసెంట్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను ఈ చిత్ర యూనిట్ ఇటీవలే రిలీజ్ చేసింది.

దీనిలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమేంటే.. పోస్ట‌ర్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఆమె ప‌క్కన ఒక పాప నిల్చుని ఉంది.

దీనిలోని ప్రత్యేకత ఏంటంటే ఈ పాత్ర స్వాతంత్య్రానికి పూర్వం.. అంటే 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందులో ఒక పాప‌కు త‌ల్లి పాత్ర‌లో కాజ‌ల్ కనిపిస్తుందని స‌మాచారం.

ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం డీకే వ‌హిస్తున్నారు.

ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ మళ్ళీ తెర మీద కనిపించడం కాజల్ ఫ్యాన్స్ కి ఒక శుభ వార్త కదా …

చూద్దాం కాజల్ అగర్వాల్ తల్లి పాత్రలో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తోందో…