అత్యంత ప్రమాదకరమైన (dangerous) అంటువ్యాధు (Infections) ల్లో H3N2 వైరస్(Virus) ఒక్కటి. హెచ్3యెన్2 వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫ్లుఎంజా(Influenza) కేసులలో భారతదేశం వేగంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి.H3N2తో సహా వివిధ రకాల ఇన్‌ఫ్లుఎంజాలకు సంబంధించిన కేసులు భారత్‌ వ్యాప్తం(Country wide)గా 3,038పైగా నమోదయ్యాయని నిపుణులు(Experts) ధృవీకరించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 కేసులు నమోదయ్యాయి. సీజనల్ ఇన్ఫ్లుఎంజా సబ్టైప్(Seasonal Influenza subtype) H3N2 కారణంగా ఇద్దరు మరణించారు. ఈ వైరస్‌ కారణంగా శ్వాసకోశ వ్యాధి (respiratory disease )తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం H3N2 ఫ్లూ లక్షణాలు ఉంటే తప్పకుండా తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మాస్క్‌ (Mask)ను కూడా ధరించాల్సి ఉంటుంది.

H3N2 ఇన్ఫ్లుఎంజా బాధపడుతున్నవారు తప్పకుండా ఈ ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది:

సమతుల్య ఆహారం(Balanced Diet) ప్రతి రోజూ తీసుకుంటే ఈ H3N2 ఇన్ఫ్లుఎంజా సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకున్న ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. కనీసం కిలో శరీర బరువుకు 0.8 నుండి 1 గ్రా ప్రోటీన్(Protein) తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్3యెన్2(H3N2) ఇన్ఫ్లుఎంజా రికవరీ కోసం తప్పకుండా పాల ఉత్పత్తులు, పనీర్, సోయా, టోఫు, కాయధాన్యాలు, గింజలు తీసుకోవాల్సి ఉంటుంది.

విటమిన్లు & మినరల్స్ – యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలతో పాటు పండ్లను ప్రతి రోజూ తీసుకోవాలి. విటమిన్ ఎ(Vitamin A) కోసం క్యారెట్, బత్తాయి, బొప్పాయి, ఆప్రికాట్లు, విటమిన్ సి కోసం నిమ్మ, ఉసిరి, టమోటాలు, నారింజ, విటమిన్ ఇ కోసం పొద్దుతిరుగుడు గింజలు, కుసుమ గింజలు, బాదం, పిస్తాపప్పులు తీసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ(Inflammatory), యాంటీ మైక్రోబియల్(Anti-microbial), యాంటీ బాక్టీరియల్(Anti-Bacterial) గుణాలు కలిగిన తులసి, ఎండు అల్లం, నిమ్మరసం, వెల్లుల్లి, పసుపు తీసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్రీన్ టీతో సహా హైడ్రేషన్‌ (Hydration Drinks) తీసుకోవాల్సి ఉంటుంది.