పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్నీల్(Prashanthneel) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’ (Salaar Movie).

మాస్ మసాలా మూవీ(Mass Masala Movie) గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లీక్ లా బెడద తప్పడం లేదు. తాజాగా సినిమా షూటింగ్ స్పాట్(Shooting Spot)లోని ప్రభాస్ లుక్ లీకైంది (Prabhas look Leak). ఇందులో ప్రభాస్ పుల్ మాస్ లుక్  కనిపిస్తున్నాడు.

ఇది కాస్తా సోషల్ మీడియా(Social Media) వైరల్(Viral) గా మారింది. తాజాగా లుక్ పై డార్లింగ్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఘాటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించటంతో పాటు పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ద్వారా ప్రభాస్ కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇందులో డార్లింగ్ డ్యూయల్ రోల్(Dual Role) లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో శ్రుతిహాసన్(Shruthi Hassan) హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్(Hombale Films Banner) పై విజయ్ కిరగందూర్(Kiran KJiragandoor) ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్(Ravi Barsur) సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతిబాబు(Jagapathi Babu) కన్నడ నటుడు మధు గురుస్వామి(Madhu Guryswamy), మలయాళ హీరో పృథ్వీరాజ్(Prudhivi raj) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల `రాధేశ్యామ్‌`(Radheshyam)తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ప్రభాస్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా పెద్ద గా ఆడకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సలార్(Salaar) పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు.

మే(May) నెలాఖరున ఈ సినిమా టీజర్(Teaser) ను రిలీజ్ చేయడానికి మేకర్స్(Makers) సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్‌ నటించిన మరో చిత్రం ‘ఆదిపురుష్‌'(Adipurush) త్వరలో విడుదల కానుంది. అంతేకాకుండా నాగ్‌ అశ్విన్‌(Maag Aswin)తో ‘ప్రాజెక్టు-కే(Project-K)’ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్.