లెమన్ గ్రాస్(Lemon Grass) పేరు మీరు వినే ఉంటారు. నిమ్మగడ్డి అనేక రకాల  ప్రయోజనాలు కలిగి ఉంటుంది . దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు . ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్(Ornamental Plant) , టీ(TEA) లేదా ఎసెన్సియల్ ఆయిల్(Essential Oils) రూపంలో ఉపయోగించుకుంటారు. దీని ఆకులు(Leaves), కాండా(Branches)ల్లో,సిట్రల్(Citral), జెరానియల్(Jeranial), క్లోరోజెనిక్ యాసిడ్(Clorozenic Acid) ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ మూలికను తాజాగా వాడొచ్చు లేదా ఎండ బెట్టి వాడొచ్చు అలాగే పౌడర్ రూపంలోకి మార్చి కూడా వాడొచ్చు. ఐతే చాలా మంది తాజా లెమన్ గ్రాస్‌నే ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే అది ఎంతో రంగుతో, కాంతివంతంగా ఉంటుంది. సువాసన వస్తుంది. అదే ఎండిపోతే చెక్కముక్కల  వాసన వస్తుంది. లెమన్ గ్రాస్ సిట్రస్ టేస్ట్(Citric Taste) మరియు సున్నితమై, ఒక చిన్న పాటి సువాసన కలిగి ఉంటుంది . ఇది ఏలాంటి ఫుడ్ కైన రుచిని అందిస్తుంది. లెమన్ గ్రాస్ ను ముఖ్యంగా ట్రెడిషినల్(Traditional) గాను మెడిసిన్స్(Medicines) లో మరియ థెరఫిటిక్(Theraptic) కోసం ఉపయోగిస్తుంటారు . లెమన్ గ్రాస్ ను రెగ్యులర్ డైట్(Regular Diet) లో చేర్చుకోవడం వల్ల ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే విధంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ లో విటమిన్ ఎ(Vitamin A), విటమిన్ సి(Vitamin C), ఫోలిక్ యాసిడ్(Folic Acid), మెగ్నీషియం(Magnesium), జింక్(Zinc), కాపర్(Copper), ఐరన్(Iron), పొటాషియం(Potassium), ఫాస్పరస్(Phosporus), క్యాల్షియం(Calcium) లున్నాయి.

ఈ లెమన్ గ్రాస్(Lemon Grass)జీర్ణక్రియను(Digestive System) మెరుగుపరుస్తుంది. ఇందులో రసాన్ని తాగితే గ్యాస్టిక్స్ సమస్యలు(Gastric Problmes), పొట్టలో నొప్పి వంటివి పోతాయి. వికారం కూడా వదిలిపోతుంది. దీని నిండా యాంటీఆక్సిడెంట్(Anti Oxidanants) లు కలిగి వున్నాయి. ఇది మన బాడీలోని విషవ్యర్థాల(Toxcins)ను తరిమితరిమి కొడుతుంది. ముసలితనం రాకుండా చేస్తుంది. కాన్సర్(Cancer) వంటి సీరియస్ అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.అలాగే  గుండె సమస్యలకు చెక్ పెడుతుంది. హార్ట్ ఎటాక్(Heart Attack), రక్తం గడ్డకట్టడం(Blood Clot) లాంటి తీవ్రమైన సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో వేడిని తగ్గించే గుణాలుంటాయి. రక్తనాళాలు, ధమనుల్లో వేడిని తగ్గిస్తుంది. అందువల్ల బాడీ లోపల రక్తం గడ్డకట్టదు. బాడీలో చెడు కొలెస్ట్రాల్‌(Bad Cholestrol)ని బయటకు పంపేస్తుంది.శరీరంలోని వేడిని తగ్గిస్తూ, రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ, లెమన్ గ్రాస్ ని తీసుకోవడం వల్ల బీపీ ని కంట్రోల్ చేస్తుంది. హైబీపీ ఉన్నవారికి  లెమన్ గ్రాస్‌ను జ్యూస్‌(Lemon Grass Juice)లలో మిక్స్ చేసి తరచూ తీసుకుంటూ ఉంటే ఇది దివ్యఔషధం(Medicine)లా పని చేస్తుంది. శరీరంలో అధికబరువు తగ్గిపోతుంది. షుగర్ కలిపిన డ్రింక్స్ తాగే బదులు లెమన్ గ్రాస్ డ్రింక్ తాగితే ఆరోగ్యం మెరుగై ఫిట్ గా అవుతారు.ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటివి వెంటనే రావు. ఇందులోని పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ మూలికలో నిండా విటమిన్లు(Vitamins), మినరల్సూ(Minerals) ఉన్నాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి(Immunity Power)ని బాగా పెంచుతున్నాయి. గొంతులో మంట(Throat Pain), గరగర, ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లెమన్ గ్రాస్ తాగితే  ఉపశమనం కలుగుతుంది.

ఇన్ని మంచి గుణాలు ఉన్న లెమన్ గ్రాస్(Lemon Grass) కొంతమందికి పడదు. దాని వాసన, దాని రుచి ఎందుకో కొందరికి నచ్చదు. అలాంటి వారు దాన్ని వాడకపోవడమే మంచిది. మరో ముఖ్యమైన విషయమేంటంటే… ప్రెగ్నెంట్(Preganant) అయిన మహిళలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ మూలికను వాడకూడదు. అందువల్ల ఇది వాడే ముందు ఓసారి డాక్టర్‌ని సంప్రదించి వాడటం మేలంటున్నా్రు ఆరోగ్య నిపుణులు(Health Experts). ఏది ఏమైనా లెమన్ గ్రాస్‌ని సూప్‌లు(Soups), ఫ్రైలు(Fries), వంటల్లో వాడుతుంటారు. ఇది కొద్దిగా నిమ్మకాయ, కొత్తగి అల్లం వాసన(Ginger Smell) వస్తుంటుంది. తాజా లెమన్ గ్రాస్ అయితే పుదీనా వాసన కూడా వస్తుంది. నిమ్మకాయలో ఎలాంటి తైలాలు ఉంటాయో… అలాంటి తైలాలే ఇందులోనూ ఉంటాయి. అందువల్లే దీన్ని లెమన్ గ్రాస్ అంటున్నారు. ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్(E-Commerce) సైట్లలో ఇది పొడి(Powder) రూపంలోలభిస్తోంది.