ఇంట్లో పిల్లలు ,పెద్దలు రోజూ ఒకటే తినాలి  అంటే బోరింగ్ అంటున్నారా ??  వెరైటీ వెరైటీ అంటున్నారా ?? ఈ టేస్టీ టేస్టీ బేసన్ రెసిపీ ట్రై చేయండి ..

ఇది చాలా సులువుగా ,క్షణాల్లో చేయొచ్చు .. అలాగే ఎంతో అద్భుతం గా ఉంటుంది ..

దీనికి చాలా  తక్కువ పదార్థాలు సరిపోతాయి. చిన్న పిల్లలు సైతం దీనిని తినడానికి బాగా ఇష్టపడతారు.

ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్దాలు ఏంటో చూసేద్దామా

కావాల్సిన పదార్దాలు

 • 1/2 కప్ సెనగ పిండి (Besan)
 • 1 కప్ మైదా
 • 2 టీ స్పూన్ మిరపపొడి
 • 1/2 టీ స్పూన్ పసుపు
 • 1 టీ స్పూన్ ఉప్పు
 • 1 టీ స్పూన్ పొడిగా చేసిన మెంతులు
 • 1/2 టీ స్పూన్ జీలకర్ర
 • 1/2 టీ స్పూన్ వాము
 • 1 Pinch అసఫోయ్టెడా
 • 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి
 • అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె

తయారు చేసే విధానం

ఒక గిన్నెలో నెయ్యి ,ఇంగువ, కసూరి పౌడర్, కారం, గరం మసాల,  పసుపు వేసి అన్నిటినీ బాగా కలపాలి.

ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ (Salt) ,నూనె కూడా వేసుకుని పిండి లో ఉండలు లేకుండా కలుపుకోవాలి.

ఇప్పుడు దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. నీళ్లు పోస్తూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి.

దీనిని గుండ్రం గా ఉండలు కింద చేసుకుని చపాతీ మాదిరి ఒత్తుకోవాలి. దీనిని బాగా ఒత్తుకున్నాక.. దానిలో శనగ పిండి ని కూడా కలపాలి.

అయితే ఈ ఫిల్లింగ్ బయటికి రాకుండా కొద్దిగా నొక్కి మళ్ళీ బాగా పరాటాలాగా ఒత్తుకోవాలి.

స్టవ్ మీద పాన్ పెట్టి.. బాగా వేడెక్కిన తర్వాత పరాటని దాని మీద వేసి ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ (Golden Brown color )వచ్చే వరకు కాల్చాలి.

Besan paratha process

దీన్ని చట్నీతో కానీ సాస్ తో కాని దీనిని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ గా ఉంటుంది.

Besan Paratha Ready

ఇక ఆలస్యం ఎందుకు , మీ పిల్లలకు ఈ టేస్టీ టేస్టీ రెసిపీ ట్రై చేయండి ..