మీరు నాన్ వెజ్(Non Veg) లవర్సా(Lovers)? చికెన్ డిషెస్(Chicken Dishes) అంటే ఎవరు ఇష్టపడరు? అయితే చికెన్ ఇష్టపడేవారి కోసమే ఈ స్పెషల్ నాన్ వెజ్(Special Non Veg) రిసిపి(Recipe).

తందూరి చికెన్(Tanduri Chicken). తందూరి చికెన్ అంటే కొన్ని మసాలా దినుసులను మ్యారినేట్ చేసి ఓవెన్(Oven) లేదా గ్రిల్స్(Grills) మీద బర్నర్ (Burner) చేస్తారు. చికెన్ క్రిస్పీ (Chicken Crispy)గా మారే వరకూ అన్ని వైపుల్ కాల్చి సర్వ్ (Serve) చేస్తుంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే తందూరి చికెన్ ను తయారుచేసుకోవచ్చు.

ఓవెన్ లేదా తందూర్ లేదని చాలా మంది తందూరి చికెన్ ను ఇంట్లో ట్రై(Try) చేయరు. అలాంటప్పుడు ఒక పెద్ద పాన్ లో కొద్దిగా నూనె వేసి తందూరి చికెన్ ను తయారు చేసుకోవచ్చు. మరి మీకు కూడా తందూరి చికెన్ తినాలనుకుంటే, ఆలస్యం ఎందుకు ఈ హోం మేడ్(Home Made) తందూరి చికెన్ రిసిపిని నేర్చేసుకుందాం.

కావల్సిన పదార్థాలు:

చికెన్: 500grms

మ్యారినేషన్ కోసం కావల్సిన పదార్థాలు:

పెరుగు: 1cup

ఉల్లిపాయ: 1

నిమ్మరసం: 2tbsp

వెల్లుల్లి రెబ్బలు: 2

అల్లం: 1 చిన్న ముక్క

రెడ్ ఫుడ్ కలర్ : కొన్ని చుక్కలు

పచ్చిమిర్చి: 2

గరం మసాలా: 2tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 2-3tbsp 

తయారుచేయు విధానం:

  • ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి తడిఆరే వరకూ పక్కను పెట్టుకోవాలి.
  • తందూరి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టాలంటే, గాట్లు పెట్టుకోవాలి.తర్వాత నిమ్మరసం ఉప్పు చికెన్ ముక్కలకు పట్టించాలి. గాట్లులోకి కూడా నిమ్మరసం పట్టేలా మ్యారినేట్(Marinate) చేసుకోవాలి.
  • తర్వాత ఈ చికెన్ ముక్కలను 20నిముషాలు రిఫ్రిజరేటర్ లో పెట్టాలి.
  • అంతలోపు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరం మసాలాను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  • రెండు గంటల తర్వాత ఫ్రిజ్ లో ఉన్న చికెన్ ముక్కలను బయటకు తీసి మసాలా పేస్ట్ ను పట్టించాలి. చికెన్ ముక్కలకు మసాలను పట్టించడానికి ముందు మసాలాలో కొద్దిగా ఫుడ్ కలర్ ను జోడించాలి.
  • చికెన్ ముక్కలకు మసాలా పట్టించిన తర్వాత తిరిగి చికెన్ ముక్కలను రిఫ్రిజరేటర్(Refrigrator) లో 30-40నిముషాలు ఉంచాలి.
  • నాలుగు గంటల తర్వాత మ్యారినేట్ చికెన్ బయటకు తీసి, పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందోలో చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 10-15నిముషాల వరకూ ఒక్కో వైపు బాగా కాలనివ్వాలి.15 నిముషాల తర్వాత చికెన్ ను మరోవైపు తిప్పి మీడియం మంట మీద ఇలా అన్నివైపులా నిధానంగా వేగనివ్వాలి.
  • చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీసి, గ్రీన్ చట్నీ(Green Chutney)తో సర్వ్ చేయాలి. అంతే ఈజీ తందూరి చికెన్ రెడీ.

న్యూట్రీషల్ ఫ్యాక్ట్స్

సోడియం 480.9mg21%, మొత్తం కార్బ్. 3.8g1%, డైటరీ ఫైబర్ 0.7g2%, చక్కెరలు 2.4 గ్రా,  ప్రోటీన్ 43.1 గ్రా, విటమిన్ D – 0.7mcg – 0%, కాల్షియం – 87.2mg – 9%, ఐరన్ – 2.4mg – 30%, పొటాషియం – 581.3mg – 12%