గోధుమ పిండి(Wheat Flour)తో చపాతీలు కాకుండా రకరకాల స్నాక్స్(Snacks) చేసుకుంటున్నాము. గోధుమ హల్వా(Wheat Halwa) ఒక మంచి డెసర్ట్. ఈ డెసెర్ట్(Dessert) ని ముఖ్యంగా నార్త్ ఇండియా(North India)లో చేసుకునే ఒక స్వీట్. అంతే కాదండోయ్ గురుద్వార్ టెంపుల్స్ కి వెళ్ళాం అనుకోండి అక్కడ అందుబాటులో దొరికే ప్రధాన ప్రసాదం ఈ హల్వానే అండి. నేనైతే కేవలం ఈ ప్రసాదం కోసం గురుద్వార్ వెళ్లేదాన్ని. ఇప్పుడైతే కుదరటం లేదు. అంతే కాదు తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో గోధుమ హల్వా ప్రసిద్ధి చెందింది. ఆధ్నెటిక్ మరియు సాంప్రదాయ తిరునెల్వేలి హల్వా(Tirunelveli Halwa) తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంత ప్రాచుర్యం వున్నా ఈ గోధుమ హల్వా ని మీరెప్పుడైనా టేస్ట్ చేసారా.

గోధుమ పిండి, చెక్కర లేదా బెల్లం, నెయ్యితో కేవలం మూడు ఇంగ్రిడియాన్స్(3 Indgrediants) తో ఎంతో రుచి(Tasty)గా ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకూండా ఎలా చేయాలో నేర్చేసుకుందాం!

హల్వా కి కావాల్సిన పదార్థాలు

1 కప్పు గోధుమ పిండి

½ కప్పు నెయ్యి

1 కప్ చక్కెర లేదా తగినంత

2 కప్పుల నీరు

1 టేబుల్ స్పూన్ జీడిపప్పు (కాజు) – ఆప్షనల్

తయారు చేసుకునే విధానం:

ఒక మందపాటి కడాయిలో ముందుగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి(Ghee) వేడయ్యాక చిన్న మంట పై  గోధుమ పిండిని వేసి వేయించాలి. గోధుమ పిండిని  బంగారు రంగు(Golden Color) మారే వరకు కలుపుతూ ఉండాలి, అలాగే మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే  నెయ్యి కూడా విడుదల చేయడం మొదలవ్వాలి. ఆలా నెయ్యి నుంచి పిండి సెపెరేట్ అయితే హల్వా కన్సిస్టెన్సీ(Consistency) కి వచ్చినట్టే . మరొక బాణలిలో చక్కెర, కొంచం నీళ్లు వేసి షుగర్(Sugar) కరిగిలే మరిగించాలి. పంచదార ద్రావణం బబుల్‌గా మారాలి. ఆలా బుల్స్ రావడానికి పెద్ద మంట మీద మిశ్రమాన్ని ఉడికించాలి. కొన్ని సెకన్లలో బుడగలు రావడం ప్రారంభించినప్పుడు, వెంటనే వేడి ఆటా మిశ్రమంలో కలపండి. వందలు కట్టకుండా మిశ్రమాలను బాగా కలుపుతూ ఉండాలి. హల్వా నీటిని పీల్చుకుని త్వరగా చిక్కబడుతుంది.గోధుమ హల్వా పాక్షికంగా లేదా సూజి హల్వా లాగా మందంగా ఉన్నప్పుడు, మంటలను ఆపివేయండి. టేస్టీ గోధుమ హల్వా రెడీ వీటిని కాజు(Cashew Nuts), బాదాం(Badam), పిస్తా(Pistha) వంటి నట్స్ తో గార్నిష్(Garnish) చేసుకుని కూడా సర్వ్ చేయచ్చు. అయితే ఇది ఆప్షనల్ హల్వాను వేడిగా లేదా వెచ్చగా సర్వ్(Serve) చేయండి.

న్యూట్రిషనల్ ఫాక్ట్స్

కొవ్వు 36g55%, సంతృప్త కొవ్వు 21g131%, బహుళఅసంతృప్త కొవ్వు 1గ్రా, మోనోశాచురేటెడ్ కొవ్వు 9గ్రా, కొలెస్ట్రాల్ 88mg29%, సోడియం 10mg0%, పొటాషియం 169mg5%, కార్బోహైడ్రేట్లు 96g32%, ఫైబర్ 4g17%, చక్కెర 66g73%, ప్రోటీన్ 5g10%.