బిగ్ బాస్ సీజన్ 5 (Big Boss season5) ఆదివారం నాడు గ్రాండ్ గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున (Host Nagarjuna) మొత్తం 19 కంటెస్టెంట్స్ ని హౌస్ లో పెట్టి తాళం వేశారు.

గురకలతో కంటెస్టెంట్స్ ఎవరికీ నిద్రలేకుండా…

అయితే ఒకతను బిగ్ బాస్ ఇంట్లో(Big Boss House) మొదటి రోజే లోబో అందరిని ఇబ్బంది పెట్టాడు. అర్ధరాత్రి సమయం లో తన గురకలతో కంటెస్టెంట్స్ ఎవరికీ నిద్రలేకుండా చేసాడు. దీనితో లోబో గురకను ఆపడానికి రవి విశ్వ ప్రయత్నం చేసాడు. కానీ లోబో గురకను ఆపలేకపోయాడు.

సరదాగా కాసేపు ….

మరో పక్క సిరి, జెస్సి కి బోర్ కొడుతోందంటూ హౌస్ మేట్స్ వస్తువులు దొంగలించి దాచిపెట్టారు. అందరితో కలసిపోయి ఏమి తెలియనట్టు కాసేపు సరదాగా హౌస్ మేట్స్ యొక్క ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేసారు. అయితే రవి మాత్రం జెస్సి నే దొంగ అని పసిగట్టడం తో సిరి కూడా మేమే దొంగిలించాము అని ఒప్పుకున్నది.

ఇక ఉదయానే ప్రమాణం, ప్రమాణం అంటూ, సాంగ్ కి మంచి డాన్స్ చేసి కూల్ గా డే ని మొదలుపెట్టారు . ఇంకా హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య సరదా గా కొన్ని సంభాషణలు జరిగాయి.

సీజన్ 5 లో కనిపించే మొదటి సంభాషణ శ్వేతా, హమిద, జెస్సీలు మధ్య జరిగింది. ఇక ప్రియాంక, కాజల్ తో తాను ట్రాన్స్ జెండర్ గా మారడం గురించి చెప్తూ ఎమోషనల్ అవ్వగా కాజల్ ఓదార్చింది.

తరువాత లహరి కాజల్ మధ్య జరిగిన సంభాషణ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది . ఈ సంభాషణల మధ్యలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని లౌంజ్ లో వరుసక్రమంలో నుంచోమన్నాడు.

నామినేషన్

సోమవారం వస్తే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ (Nomination) ప్రక్రియ ఉంటుందని మన అందరికి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ లో భాగం గా కంటెస్టెంట్స్ ఫొటోస్ తో వున్నా చెత్త కవర్ల ను ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేసి చెత్త కుండీలో వేయాలి అని బిగ్ బాస్ చెప్పారు.

ముందుగా శ్రీరామ్ ని నామినేట్ చేయవలసిందిగా బిగ్ బాస్ కోరాడు.

1. శ్రీరామ్- మానస్, జెస్సీ‌ లను నామినేట్ చేశాడు. వీళ్లిద్దర్నీ నామినేట్ చేస్తూ వాళ్లతో పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.

2, సరయు- కాజల్, రవిలను నామినేట్ చేసింది. కాజల్ కి బిగ్ బాస్ స్ట్రాటజీస్ (Big Boss strategies) బాగా తెలుసు కాబట్టి నామినేట్ చేశాను అని. ఇక రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావిస్తున్నాను. కాబట్టి నామినేట్ చేస్తున్న అని చెప్పింది.

3. శ్వేతా- హమీద, నటరాజ్ లను నామినేట్ చేసింది.

4. విశ్వ- జశ్వంత్ మానస్‌లను నామినేట్ చేశాడు. యాటిట్యూడ్ చూపించొద్దు అంటూ జెస్సీకి వార్నింగ్ ఇచ్చాడు. ఉదయం జరిగిన డిస్కషన్‌లో అతని బిహేవియర్ తనకి నచ్చలేదని అందుకే నామినేట్ చేశానని చెప్పాడు.

అయితే జెస్సీ.. విశ్వపై ఫైర్ అవుతూ జరిగిన దాన్ని విశ్వ తప్పుగా అర్థం చేసుకున్నాడని ఎమోషనల్ అయ్యాడు. ఇక మానస్ ని ఉద్దేశించి హౌస్ లో అందరి తో కలవడం లేదని అందుకే నామినేట్ చేసాను అని చెప్పాడు.

5. ఆనీ- మాస్టర్ సిరి, జెస్సీలను నామినేట్ చేశారు. సిరి, యాని మాస్టర్ ఒకే బెడ్ షేర్ చేసుకుంటున్న ఇంకా ఒకరిఒక్కరు కనెక్ట్ కాలేదని అందుకే నామినేట్ చేశాను అని అన్నారు. ఇక జెస్సి కోపం తాగించుకోవాలని చెప్తూ నామినేట్ చేసింది

6. జెస్సీ- విశ్వ, హమీదాలను నామినేట్ చేశాడు. కారణం లేకుండా గొడవకు కారణం అయిన హమీదాని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.

7. రవి- నటరాజ్, మానస్‌లను నామినేట్ చేశాడు. నటరాజ్‌ని నామినేట్ చేస్తూ.. మీతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది కానీ.. మీరు ఇక్కడ నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మీ పక్కకు రావాలంటే భయం వేస్తుందని అన్నాడు రవి. అలాగే మానస్ ఎవరితోనూ కలవడం లేదేమో అనిపిస్తుందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు రవి.

8. ఉమాదేవి- కాజల్, జశ్వంత్‌ని నామినేట్ చేసింది. కాజల్‌ని నామినేట్ చేస్తూ ఆమె ఆటను ఎలా ఆడాలో బయటే అన్ని తెలుసుకుని వచ్చిందని . అందుకే నామినేట్ చేస్తున్న అని చెప్పింది.

9. హమీదా- లహరి, జెస్సీలను నామినేట్ చేసింది. లహరి చాలా రూడ్ గా మాట్లాడుతుందని నామినేట్ చేసింది, అలాగే జెస్సి తనను పాయింట్ అవుట్ చేసి మాట్లాడినందుకు నామినేట్ చేశాను అని చెప్పింది.

10. షణ్ముక్- జస్వంత్, సన్నీ, లోబోలను నామినేట్ చేశాడు. ఇక షన్ను తనని టాస్క్ ఆడమని చెప్పినందుకు సన్నీ ని నామినేట్ చేసాడు.

11. సన్నీ- షణ్ముక్, సరయులను నామినేట్ చేశాడు. సన్నీ ఈ హౌస్ లోకి మనం గేమ్ ఆడడానికే వచ్చామని, టాస్క్ అడ్డమని చెప్పడం తప్పు అన్నందుకు, షన్ను ని నామినేట్ చేసాడు. అలాగే సరయు ఏకవచనం తో సంభోదించింది అంటూ నామినేట్ చేసాడు.

12. ప్రియాంక- షణ్ముఖ్, హమీదలను నామినేట్ చేసింది. కారణాలు పెద్ద లేకపోయినా నామినేట్ చేయాలి కాబట్టి నామినేట్ చేశాను అని ప్రియాంక చెప్పింది. అలాగే ఒకరి కోసం మనం ఏడవడం వాలా మనం అవతలి వాళ్లకు వీక్ అయిపోతాం కాబట్టి స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పింది

13. నటరాజ్- రవి, జెస్సీలను నామినేట్ చేశారు. రవిని నామినేట్ చూస్తూ.. నేను నాలాగే ఉంటానని నీకోసం నేను నటించలేనని చెప్పాడు నటరాజ్ మాస్టర్. ఇక జెస్సీ‌ని నామినేట్ చేస్తూ.. నువ్వు మరీ అమాయకత్వంగా ఉంటే ఈ హౌస్ లో వున్నడం కష్టం అని అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నానని అన్నాడు. దీంతో జెస్సీ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

14. ప్రియ- సిరి, కాజల్‌‌లను నామినేట్ చేసింది. సిరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించి నామినేట్ చేస్తున్న అని చెప్పింది.

15. లోబో- ప్రియ, యాంకర్ రవిలను నామినేట్ చేశాడు.ఇతని నామినేషన్ చాలా ఫన్నీగా సాగింది. హౌస్ మేట్స్ అందర్నీ నవ్వించాడు.
ప్రియ, రవి ఇద్దరు కూడా యాటిడ్యూడ్ చూపించారని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.

16. మానస-. విశ్వ, సరయులను నామినేట్ చేశాడు. మానస్ విశ్వ ని ఉద్దేశించి హౌస్ మేట్స్ అందరితో కలవడానికి కాస్త టైం పడుతుంది అని బయటే ఎలా ఉంటేనో నీకు తెలుసనీ చెపుతూ విశ్వ ని నామినేట్ చేసాడు

17. సిరి- హమీదా, ప్రియలను నామినేట్ చేసింది.

18. కాజల్- సరయు, ఉమలను నామినేట్ చేసింది. కాజల్ నామినేట్ చేస్తూ, నా ఫేవరేట్ షో బిగ్ బాస్. అందుకే ఇంత సంతోషంగా ఉన్నా, నా డ్రీమ్‌కి అడ్డుకట్టు వేసి నామినేట్ చేసిన సరయు, ఉమలను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది.

19. లహరి.. హమిదా, కాజల్‌లను నామినేట్ చేసింది. లహరి హమీద ల మధ్య కాస్త ఆర్గుమెంట్ జరిగింది.

ఇక్కడి తో మొదటి వారం ప్రక్రియ ముగిసింది. యాంకర్ రవి, సరయు, మానస్, జెస్సీ, కాజల్, హమీదలు నామినేట్ అయ్యారు. మొత్తం ఆరుగురు మొదటి వారం నామినేషన్ లో వున్నారని బిగ్ బాస్ చెప్పారు.

మరి ఈ ఆరుగురి లో ఎవరి ఎలిమినేట్ అవ్వనున్నారో వెయిట్ చేయాల్సిందే…..