మన నిత్య జీవితంలో మనకూ ఎలెక్ట్రానిక్ పరికరాలకి విడదీయ రాని సంబంధం ఏర్పడిపోయింది. మనం మూడు పూటలా భోజనం చేసినట్టు, ఈ ఎలెక్ట్రానిక్ పరికరాల్లోని బ్యాటరీ ఎప్పటికప్పుడు  అయిపోకుండా ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. అలా ఛార్జింగ్ పెట్టాల్సినవి సెల్ ఫొన్, టాబ్లెట్, లాప్ టాప్, కెమెరా ఇలా చాలానే ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లయితే వినియోగించే సమయం పెరిగే కొద్ది డాని బాటరీ తగ్గిపోతుంది. అందుకని ప్లగ్ పాయింట్ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఈ సమస్యకు ఎంతో మంది ఎన్నో పరిష్కారాలను చూపించారు. గతం లో అటువంటి వాటి గురించి మనం ఇక్కడే ప్రస్తావించుకున్నాం. అయితే అవన్నీ సులభంగా లభించే ఛార్జింగ్ ప్రత్యామ్న్యాయాలు చెప్పాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అసలు చార్జింగే అవసరం లేదంటే. అసలు ఛార్జింగ్ అవసరం లేకుండా మన ఫోన్ నిరంతరాయంగా పని చేస్తూనే వుంటే ఎంత బావుంటుంది కదూ. రండి అదేంటో చూద్దాం.

Battery Status

ఎలెక్ట్రానిక్ వస్తువుల్లో ఉండే ఎలెక్ట్రానిక్ సర్క్యూట్లకు ఎంతో విధ్యుత్ శక్తి అవసరం. దానినే బ్యాటరీల ద్వారా అందిస్తున్నాం. అయితే డోగీటెక్(Dougie tech) అనే కంపెనీ ఒక విప్లవాత్మమైన సర్క్యూట్లను తయారు చేయనుంది.  అవే శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దానినే RADRE (Regenration of Animated Domains Rhythemic Energy) అంటారు. ఈ పద్ధతిలోని  బ్యాటరీ మన బ్యాటరీ కంటే చిన్నది. ఇది పూర్తిగా 2-3 సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేస్తుంది. అయితే ఈ RADRE ను ఉపయోగించాలంటే ప్రతీ నెలా కొంత డబ్బును ఈ కంపెనీకి చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు దీని నిర్వాహకులైన నాధనియల్ డోగ్లాస్.

BB_3

BB_2

ప్రస్తుతానికి ఈ RADRE ఇంకా తొలి దశలోనే ఉందనీ, దీనిని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడానికి ఇంకా సమయం పడుతుంది. ఇది విడుదలైతే మనకు ఛార్జింగ్ నుంచి విముక్తి లభించినట్టే!!

Courtesy