Baby (బేబీ) కార్ సీట్. ఇది మన కంటే విదేశాల్లో వుండే వారికి ఈ వస్తువు బాగా పరిచయం. ఎందుకంటే అక్కడి నియమాల ప్రకారం చంటి పిల్లలను కార్లో ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఇది చాలా అవసరం. డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే నాటికే ఇది కారులో సిద్ధంగా వుండాలి. మరి, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి అదే బేబీ కార్ సీట్ చంటి పిల్లల ప్రాణాలను తీస్తుంది. పొరపాటున కాని, బిడ్డ నిద్రపోతుందని కాని కారులో వదిలేసి వెళ్తే ఎంతో ప్రమాదం. ఆ వేడికి బిడ్డ ఊపిరాడక చనిపోయిన సందర్భాలు చాలా వున్నాయి.

CS_2

విదేశాల్లోని సింగల్ పేరెంట్ అయినా లేక తల్లి తండ్రి ఇద్దరి ఉద్యోగ భాద్యతల ఫలితంగా వారి మీద ఎంతో ఒత్తిడి వుంటుంది. ఇక చంటి పిల్లల భాద్యత కూడా మీద పడేసరికి వారికి సరైన నిద్ర కరువు అవుతుంది. ”నిద్ర లేమితో కారు నడపడం, మద్యం తాగి కారు నడపడం వంటిది”. ఇదే ఎంతో మంది చంటి పిల్లల మరణాలకు కారణమైంది. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి బాధాకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని వీటిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కొన్ని సెన్సార్  (sensor) పరికరాలను మార్కెట్లోనికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు అవి ఏంటో మనం చూద్దాం.

CS_1

1. Evenflo Advanced Embrace DLX Infant Car Seat with Sensor safe: ఈ బేబీ కార్ సీట్ లోని ఒక సెన్సర్ ఈ సీటుకు వుండే క్లిప్పుకు అమర్చబడి వుంది. ఇక ఈ బేబీ సీట్ యొక్క వైరును కారులోని డేటా పోర్ట్ కు కనెక్ట్ చేయగానే ఇది wi-fi సహాయంతో పని చేస్తుంది. ఇది కారు ఇంజను ఆగి పోగానే శబ్దం చేయడం మొదలు పెడుతుంది. ఈ శబ్దం బిడ్డను కారు సీట్లోంచి తీయమని మనకు గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ బేబీ కార్ సీట్ వాల్మార్ట్ వెబ్సైటు లో లభ్యం అవుతుంది. దీని ధర $150.

2. Intel smart car chest clip: ఈ క్లిప్పును ఏ కారు సీటుకైనా అమర్చుకోవచ్చు. ఈ క్లిప్పులో వుండే సెన్సర్ బ్లూటూత్ ద్వారా మొబైల్ లోని ఒక యాప్ కు అనుసంధానం చేయబడి వుంటుంది. ఈ సెన్సర్ కారు ఆగి వున్నప్పుడు ఈ బేబీ సీట్ యొక్క క్లిప్పు తీసి లేకపోతే మొబైల్ లో అల్లారం మోగిస్తుంది. ఈ సెన్సర్ బేబీ కార్ సీట్ క్లిప్పు తీసేంత వరకు ప్రతీ 10 నుంచి 15 సెకండ్లకూ ఫోనులో అల్లారం మొగిస్తూనే వుంటుంది.

3. Infant SOS: ఇది ఇంకా ఆసక్తికరమైన పరికరం. దీనిని కూడా ఏ కారు సీటుకైనా అమర్చుకోవచ్చు. ఇది కారు ఆగిన తరువాత బిడ్డ ఇంకా కారు సీటులోనే వుంటే 30 సెకండ్ల తరువాత 3 రకాల సంకేతాలను పంపిస్తుంది. అవి 1. బేబీ సీటు చుట్టూ ఎర్రని LED లైట్లు 2. ఫోనులో మోగే అలారం. 3.  మన ఫోను లోని ఏవైనా 10 కాంటాక్ట్స్ కు టెక్స్ట్ మెసేజ్ లు పంపిస్తుంది.ఇంకా దీనిలోని కూలింగ్ సిస్టం ఆగి ఉన్న కారు లోని వేడికి బిడ్డకు హాని చెయ్యకుండా బిడ్డ చుట్టూ చల్లని గాలిని స్రవింప చేసి బిడ్డను క్షేమంగా ఉంచుతుంది. దీన్ని రైస్ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు తయారు చేసారు. దీని ధర $ 150.

మనం జాగ్రత్తగా ఉన్నాలేకపోయినా ఈ సెన్సర్ మాత్రం బిడ్డలను సురక్షితంగా ఉంచుతాయి.

Courtesy