నేటి సాంకేతిక ప్రపంచంలో ఆరోగ్య రంగానిది ఒక ప్రత్యేకత. ఈ రంగంలో ఎన్నో ఇది వరకు లేని చేయలేని పరీక్షలు, రోగ నిర్ధారణ సైతం ఇప్పుడు సులభంగా జరిగిపోతున్నాయి. అంతేనా ఇప్పుడు అందుబాటులో ఉన్న వేరబుల్స్ పరికరాల వల్ల వ్యాధిని గూర్చి పూర్తి సమాచారాన్ని సేకరించగలుగుతున్నారు. దీంతో ఎప్పుడో వ్యాధి వచ్చాక కన్నా ముందే ఆయా శరీరభాగాలను జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతున్నారు వైద్యులు.

ఊపిరి. నేటి కాలుష్య ప్రపంచంలో మన ఊపిరి మనకు ఎన్నో చెప్పేస్తుంది. దీనిని బట్టే అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, నిద్ర లేమి వంటి రోగాలను కనిపెట్టవచ్చు. ఇందుకోసం కెనడా కు చెందిన పరిశోధకులు మన ఊపిరి ని నిరంతరం కొలిచి అలా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తున్నారు. ఇందుకోసం అతి తేలికగా, ఒంటికి కూడా ఎలాంటి పరికరం అంటించుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక టీ షర్టు ద్వారా ఊపిరిని గమనించవచ్చని నిరూపించారు. అదెలాగో చూద్దాం.

Universite Laval కు చెందిన ప్రొ. Younes Messaddeq, తన బృందంతో కలిసి ఒక టీ షర్టు ను తయారు చేసారు. ఇందులో ఎలాంటి ఎలక్ట్రోడ్లు, సెన్సర్లు అవసరం లేకుండా కేవలం షర్టు లోని ఛాతి భాగం లో ఉండే ఒక యాంటెన్న ద్వారా మన ఊపిరిని గమనిస్తుంది. అంతే కాదు అలా సేకరించిన సమాచారాన్ని ఒక కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ కు చేరవేస్తుంది. ఒక సన్నని optical fibre ను వెండి తో తాపడం చేసి ఈ టీ షర్టు తో పాటు కుట్టేస్తారు. ఆ పైన ఈ టీ షర్టు (ఛాతి లోపలి భాగం) ను ఒక ప్రత్యేకమైన polymer తో తాపడం చేస్తారు. ఇది ఈ యాంటెన్న పాడవకుండా కాపాడుతుంది. అంతే కాదు చొక్కా ను ఉతికినప్పుడు కూడా ఈ పాలిమర్ ద్వారానే యాంటెన్న సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యాంటెన్న వ్యక్తి ఊపిరి తీసేటప్పుడు, వ్యక్తి (thorax) ఛాతి చుట్టుకొలతలోని స్వల్ప హెచ్చుతగ్గులను గమనించడo, ఎంత గాలి ఊపిరితిత్తులలో ఉంది వంటి సమాచారాన్ని ఈ యాంటెన్న కనిపెట్టేస్తుంది. అలా ఒకటి కాదు రెండు కాదు, (చొక్కా వేసుకున్నoత సేపు) కొన్ని గంటల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే వ్యక్తి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని గురించి ఇట్టే తెలుసుకోవచ్చు. అంతే కాదు రోగి అస్తమా వంటి జబ్బులకు మందులు వేసుకున్నప్పుడు ఎలా స్పందిస్తున్నాడో కూడా సులభంగా తెలుసుకోవచ్చు.

ఇలా సేకరించిన సమాచారం సంప్రదాయ వైద్య పద్ధతుల్లో ఊపిరితిత్తుల పని తీరును తెలుసుకునే పరికరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని Younes అంటున్నారు. ఇక ఈ షర్టు ను 20 మార్లు ఉతికినా ఈ యాంటెన్న సామర్ధ్యం తగ్గలేదని అన్నారు. ఈ పరిశోధన Journal Sensors లో ప్రచురించబడింది.

ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం మన శరీరంలో ఎన్నో భాగాల గురించి తెలుసుకోవడానికి ఇలాంటి స్మార్ట్ టెక్స్టైల్స్ వంటి అవసరం చాలా ఉంది.

Courtesy