కంప్యూటింగ్ కమ్యూనికేషన్(Computing Communication) విభాగంలో ఇంగ్లీష్ సార్వత్రిక భాష(English world Langugae) అయినప్పటికి అనేక భాషలను జతచేసుకునే అవకాశాన్ని విండోస్(Windows) కల్పిస్తోంది. చాలా మంది వ్యక్తిగత కంప్యూటర్ యూజర్ల(Individual Computer Users)కు ఈ విషయం తెలియదు.

నేటి ప్రత్యేక శీర్షికలో విండోస్ ఆధారిత కంప్యూటర్‌లో కొత్త భాషాలను జతచేసుకునేందుకు అందుబాటులో ఉన్న సలువైన మార్గాలను షేర్ చేసుకోవటం జరుగుతోంది.

  • ముందుగా కంట్రోల్ ప్యానల్‌లోకి వెళ్లండి.
  • కంట్రోల్ ప్యానల్‌(Control Panel)లోకి ప్రవేశించిన తరువాత క్లాక్(Clock), లాంగ్వేజ్(Language), అండ్ రీజియన్(Region)  ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
  • క్లాక్, లాంగ్వేజ్, మరియు రీజియన్ ఆప్షన్‌లోకి వెళ్లిన తరువాత రీజియన్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్‌(Option)ను సెలక్ట్ చేసుకోండి.
  • రీజియన్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్‌లోకి వెళ్లాక ఫార్మాట్ బార్(Format Bar) పై క్లిక్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న భాషల జాబితా మీకు కనిపిస్తుంది. వాటిలో మీకు కావల్సిన భాషను ఎంపిక చేసుకొండి
  • భాషను ఎంపిక చేసుకున్న తరువాత రీజియన్ అండ్ లాంగ్వేజ్ బాక్స్‌లో దిగువున కనిపించే అప్లై  బటన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తరువాత ఓకే బటన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు డెస్క్ టాప్ లాంగ్వేజ్ బార్(Desktop Language Bar) పై చెక్ చేసకున్నట్లయితే జత చేసుకున్న భాషలు కనిపిస్తాయి. యాప్(App) దీని పూర్తి పేరు అప్లికేషన్(Application).

స్మార్ట్‌ ఫోన్ యూజర్‌ల(Smart Phone Users)కు ఈ ‘యాప్స్’ భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(Smart Communication Technology)ని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్(Mobile) ఇంకా డెస్క్‌ టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల(DOP)ను సపోర్ట్(Support) చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు(Developers) వృద్థి చేస్తున్నారు.

అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘స్మార్ట్’ యాప్స్‌(Smart Apps) కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు(Cooking), ఫిట్నెస్(Fitness), కథలు(Story), సామెతలు(Proverbs), పొడుపు కథలు(Short Stories), జోక్స్(Jokes), వంటలు(Recipes), స్తోత్రాలు(Slokas), బైబిల్(Bible), ఖురాన్(Khuran) ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాష(Mother Language)లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌(One Click)తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు.