లేటెస్ట్ గా ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో మంచి ఇంప్రెషన్(Impress) క్రియేట్(Create) చేసిన నటుడు శ్రీకాంత్ మేక(Srikanth Meka) కొడుకు రోషన్(Roshan) హీరో(Hero)గా ఎంట్రీ(Entry) ఇచ్చాడు.

ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఈ సినిమాతో నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు రోషన్.

ఈ సినిమాతో హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry)లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు(Director Raghavendra Rao) పర్వవేక్షణలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రోషన్‏కు జోడిగా శ్రీలీలా(Sri Leela)  నటించింది. రోషన్ తదుపరి చిత్రాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

తాజాగా రోషన్ కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్(Interesting Update) ఇచ్చారు మేకర్స్(Makers) ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్(Production House) తో ఓ సినిమాకి రోషన్ సైన్(Sign) చేశాడు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయతి మూవీస్(Vaijayanthi Movies), స్వప్న సినిమాస్ బ్యానర్లో(Swapna Cinemas Banners) యంగ్ హీరో(Young Hero) రోషన్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ తన ప్రొడక్షన్ నెం 9(Production NO.9) చిత్రాన్ని ప్రకటించింది.

జాతీయ అవార్డు(National Award) గెలుచుకున్న దర్శకుడు(Director) ప్రదీప్ అద్వైతం(Pradeep Advaithvam) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రోషన్ పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు(Wishes) తెలుపుతూ, మేకర్స్ ఈ ఆసక్తికరమైన పోస్టర్(Poster) ద్వారా ప్రాజెక్ట్ ను అధికారికం(Official)గా ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో రోషన్ బ్యాక్ పోజ్(Back Pose)‏లో కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ ప్రాజెక్ట్(Poster Project) పై అంచనాలను పెంచింది. ప్రదీప్ అద్వైతం విన్నింగ్ స్క్రిప్ట్ను(Winning Script) సిద్ధం చేసాడు.

త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ వైవిధ్యమైన లుక్(Different Look) లో కనిపించనున్నాడు. ఇతర వివరాలు త్వరలో ప్రకటించాల్సి వుంది.