హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండడం కొత్త కాదు. అందుకోసం కోట్లకు కోట్లు పారితోషికం అందుకోవడమూ కొత్త కాదు. అయితే ఇలా బ్రాండింగ్ ఒప్పుకునే ముందు కొంచెం ఆలోచించాలి.

కన్సూమర్ ప్రొడెక్ట్స్ వరకు ఫరవాలేదు. అవి ఆరోగ్యానికి మంచివా కాదా అన్నది చూసుకుంటే చాలు. కానీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే ముందు, అవి ఎలా ఉంటాయో ? అన్నది చూసుకోవాలి. లేదూ అంటే ఆ మురికి సెలబ్రిటీలకు అంటుకుంటుంది.

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలను బ్రాండ్ అండార్స్ చేసేటపుడు లేదా రికమెండ్ చేసేటప్పుడు హీరోలు చాలా జాగ్రత్తగా వుండాలి. అవి ఎప్పుడు బిచాణా ఎత్తేస్తాయో ఎవరికీ తెలియవు. ఆ మధ్యన సాహితీ అనే నిర్మాణ సంస్థ కుంభకోణం ఒకటి బయటపడింది. అంతకు ముందు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రామకృష్ణ వెనిజులా అనే ఒక సంస్థ ఇలాగే మధ్యలో మాయమైంది. ఇప్పుడు లేటెస్ట్ గా సువర్ణభూమి.

రామకృష్ణ వెనిజుల సంస్థకు మహేష్ బాబు పేరుతో బోలెడు అంత ప్రచారం జరిగింది. సువర్ణభూమికి గతంలో చాలా మంది పేర్లు వాడారు. లేటెస్ట్ గా రామ్ చరణ్ పేరు కూడా వాడేసారు. ఈ మధ్యనే నటుడు బాలయ్య కూడా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసారు. ప్రచారం ప్రారంభించారు.

ఏమైనా ఇకపై ఇలాంటి విషయంలో హీరోలు చాలా  జాగ్రత్తగా ఉండాలి.