రెబల్‌ స్టార్(Rebel Star) ప్రభాస్‌ నటించిన బాహుబలి మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌(Pan India Star)గా మారిపోయాడు. ఇది మొదలుకుని  ఏ మూవీ రూపొందిన పాన్‌ పాన్ ఇండియా సినిమాగానే  చేస్తున్నాడు. ఆయ‌న గ‌త చిత్రం సాహో(Saaho) కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్‌(Bolly wood)లో రూ.100 కోట్ల(100 Crores)కు పైగానే వసూళ్ల‌ను ఆ మూవీ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజయ్యి  రెండున్నరేళ్లు అవుతుంది.

ఇలా వరుస పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ ఫారంలో దూసుకుపోతున్నాడు రెబెల్ స్టార్. తన ఫాన్స్ ఎంతగానే ఎదురుచూస్తున్న రాధేశ్యామ్(Radhe Sham) రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా రాధేశ‍్యామ్‌ డైరెక్టర్‌(Director) రాధా కృష్ణ కుమార్‌ చేసిన ట్వీట్‌(Tweet)తో ఫాన్స్ ఆందోళనలో వున్నారు.

ఇదిలా ఉంటే ఆదిపురుష్‌ చిత్రీకరణ(Shooting) పూర్తి చేసుకున్న ప్రభాస్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ డైరెక్ట్‌ చేస్తున్న సలార్‌ షూటింగ్‌(Salar Shooting) కూడా చివరి దశ(Final Stage)కు వచ్చింది.

ఇవ‌న్నీ ఓ ఎత్తు అయితే ప్రభాస్ కెరీర్‌(Career)లో 25వ చిత్రం(25TH Movie)గా ‘స్పిరిట్‌’ ప్రారంభం కానుంది. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ చిత్రాల‌తో బాక్సాఫీసు(Box Office)ల వ‌ద్ద వ‌సూళ్ల‌(Collections)ను అందుకున్న డైరెక్టర్(Director) సందీప్ రెడ్డి వంగా ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా రూపొందుతోన్న విషయం  తెలిసిందే.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత(Producer) భూష‌ణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ(Interview)లో మాట్లాడుతూ స్పిరిట్ మూవీ(Spirit Movie)లో ప్రభాస్ పోలీస్ ఆఫీస‌ర్‌(Police Officer)గా క‌నిపించ‌బోతున్నారనే సంగతిని చెప్పేసారు.

ప్రస్తుతం ఆ వార్త సోష‌ల్ మీడియా(Social Media)లో తెగ వైర‌ల్ అవుతుంది. ప్రభాస్ ఇప్పటి వ‌ర‌కు పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌లేదు. ఆయ‌న పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తే ఎలా ఉంటుంద‌నేది స్పిరిట్ చిత్రంతో ఆయ‌న ఫాన్స్(Fans), సినీ లవర్స్(Cine Lovers) చూడబోతున్నారు.

 

 

.