తెలుగు వారి భోజనం అంటే షడ్రుచులు వున్న లేకపోయినా పర్వాలేదు కానీ, వేడి వేడి అన్నంలోకి కాస్త ముద్దపప్పు(Muddapappu), అందులో కాస్తంత కమ్మటి నెయ్యి(Ghee)ని కలుపుకుని ఆపై కొత్త ఆవకాయ బద్దను చప్పరించడమంటే స్వర్గానికి బెత్తడు దూరంలో వున్నటే అంటారు.

ఆ రుచి(Taste)ని ఆస్వాదించిన వాళ్ళు అయితే ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేటి కాలంలో మనలో చాల మంది నెయ్యిని ఒక విషపదార్థం(Toxic Substance)గా చూస్తున్నారు.

నెయ్యి వాడకంతో కొలెస్ట్రాల్(Cholesterol) పెరుగుతుందని, గుండె పోటు(Heart attack) విరుచుకుపడుతుంది, భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు నెయ్యి అమృతమా? విషమా? అనే ఆసక్తికరమైన విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం!

పశు సంపద నుంచి సేకరించిన పాలు(Milk).పెరుగు(Curd) ద్వారా వెన్న(Butter) తీసి ఆ వెన్నను మద్దించి శ్రేష్టమైన నెయ్యి(Ghee)ని ఆవిష్కరించి, ఆ నెయ్యిని ఆహారం(Food)తో పాటు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మహా భాగ్యంగా మలుచుకునేవారు. ఆవు నెయ్యి చాలా శ్రేష్టమని మనలో చాలా మందికి ఓ గట్టి నమ్మకం, గేదే నెయ్యి(Buffalo Ghee) కంటే అవ్వు నేయ్యి(Cow Ghee) తోనే ప్రయోజనం (Benefits) అని మనం భావిస్తుంటాం.

మరి ఈ నమ్మకంలో నిజం ఎంత ఆవు నెయ్యి మంచిదా? గేదే నెయ్యి మంచిదా?  సృష్టిలో కల్తీ కానీ పదార్థం ఏదైనా వుందా అంటే అమ్మ పాలు(Mother’s Milk) అనే సమాధానం వింటుంటాం. ఒక్కప్పుడు ఈ మాట నిజమేమో కానీ కల్తీ అన్నది రాజ్యం ఏలుతున్న  నేటి పరిస్థితుల్లో ఆ మాటను కూడా గట్టిగా చెప్పలేమేమో నేడు మనం తినే ప్రతి ఆహారపదార్థం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని, చెక్కగా మెరిసిపోవాలని రకరకాల హానికర రసాయనాలు కలపడం అన్నది బాగా పెరిగిపోయింది.

దీనితో మనం తాగే పాలల్లో స్వచ్ఛత లేదు. మనం తినే బియ్యం లో పోషకాలు లేవు, మనం వంటల్లో వాడే నూనెలు మంచివి కావు.

దాదాపు అన్ని ఆహార పదార్దాలల్లో కల్తీ అన్నది సర్వసాధారణ విషయంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేష్టమైన నెయ్యి లభించడం కూడా కష్టసాధ్యం అయిపోయింది బయట లభించే నెయ్యి కల్తీ అయ్యిపోయింది. ఇలాంటి కల్తీ నెయ్యిని వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా అది అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది.   కొవ్వు, ఈ మాట వినగానే పెద్ద భూతంలా  కానీపిస్తుంది.

నిజానికి దేనికైనా మంచి, చేడు రెండు ఉంటాయి, కొవ్వులొ కూడా మంచి కొవ్వు, చేడు కొవ్వు రెండు వున్నాయి. కల్తీలు పెరిగిపోయి శారీరక శ్రమ అన్నది బాగా తగ్గిపోయిన నేటి కాలంలో వొంట్లో నుంచి కోవూ కంటే చెడ్డ కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వు ఓ భూతంలా కనిపించడం సహజం. ముఖ్యంగా నూనెలు(Oils), పాల ఉత్పత్తు(Milk Products)లు అనేవి కొవ్వు(Fat) ని పెంచుతాయి అనే అవగాహనా బాగానే పెరిగింది.

ఇది ప్రశంసించాల్సిన విషయమే. అయితే ఎన్నో ఆరోగ్య సుగుణాలు వున్నా నెయ్యిని కూడా ఈ నూనెలు లాగానే నిషేధించడం ఇటీవల కాలంలో బాగానే పెరిగింది.

నిజాంనికి శుద్ధమైన నెయ్యి తీసుకోగలిగితే జీర్ణ శక్తి పెరగడం(Increase of digestive system), విటమిన్ డీ(Vitamin D) లభించడం దగ్గర నుంచి రోగ నిరోధక శక్తి(Immunity system) పెరగడం దాక అనేక ప్రయోజనాలు ఉంటాయి. అనేక పోషక విలువల(Nutritional Values)తో కూడిన నెయ్యి నిజంగా మన పాలిట అమృతమే కాకపోతే నెయ్యిని మితంగా వాడుకోవడమే మేలు నెయ్యి వాడడం మితిమీరితే లేనిపోని అనర్దాలు వచ్చి పడే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది.

తినే తిండి, చేసే వ్యాయామం ఈ రెండే మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అయితే ఈ రెండూకూడా నేడు గాడి తప్పాయి. తినే తిండితో కల్తీతో పాటే జంక్ ఫుడ్(Junk Food) కూడా వచ్చి చేరింది.

పైగా తినే వేళలు, తినే తీరు అన్ని క్రమం తప్పిపోయింది. ఇక శారీరక శ్రమ అన్నది అపురూపంగా మారింది. టెక్నాలజీ(Technology) కి అలవాటు పడి,వ్యాయామాలను పక్కన పడేశారు.

ఫలితంగా వొంట్లోకి క్యాలరీల వెల్లువ సునామిలా వచ్చి చేరుతుంటే ఆ కాలరీ(Calories)లు జీర్ణం(Digestion)కాక, చివరకు కొవ్వు(Fat)గా కొలెస్ట్రాల్(Cholesterol) గా పేరుకుపోయి అనారోగా  హేతువుగా మారుతున్న వైనం అందరికి తెలిసిందే.

ఫలితంగా స్థూలకాయం(Obesity), ఆపైన థైరాయిడ్ సమస్యలు(Thyroid Problems), వీటి వల్ల  షుగర్(Sugar), హై బీపీ(High BP)లు వచ్చిపడుతుంది. ఇవ్వని కలగలసి గుండె జబ్బులు(Heart Issues), పక్షవాతాలు(Paralysis), కాన్సర్(Cancer) లాంటి జబ్బులు వస్తాయి. మన ఆహారాన్ని, వ్యాయామాన్ని(Exercise), గాడిలో పెట్టుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది.

ఆరోగ్యాన్ని సాధించే ఈ క్రమంలో నెయ్యి వాడకం అన్నది మంచి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. జీవం శైలిని(Life Style) చెక్కగా పెట్టుకుని నెయ్యిని మితంగా తీసుకుంటే అది ఆరోగ్యాన్ని(Health) కాపాడడంలో అది అమృతమంలా పని చేస్తుంది.

అలా కాకుండా అతిగా నెయ్యి(Ghee) తీసుకుంటే మాత్రం అది విషం(Toxin)గా మారి ఆరోగ్యాన్ని హరిస్తుంది.