ఈ చలికాలం(Winter)లో వేడి వేడి సూప్స్(Soups) తో కాస్త చలి తాకిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎన్నో రకాల సూప్స్ మనం రుచి చూస్తూనే వున్నాం. అయితే  మటన్ సూప్(Mutton Soup) తీసుకోవడం వల్ల ఆరోగ్యం(Health)తో పాటు చాల రుచికరంగా ఉంటుంది.

మటన్ బోన్ సూప్‌లో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) దాగి ఉన్నాయి. ఇది డ్యామేజ్ అయిన లివర్ సెల్స్‌(Liver Cells) ను పునరుత్పత్తి చేస్తుంది మరియు పురుషులలో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది మరియు ఇది గాయాలను మాన్పుతుంది. అంతేకాకుండా ఇది హార్మోనులను పెంచుతుంది. ఇందులో అనేక న్యూట్రీషియన్స్(Nutrition’s) ఉన్నాయి.

ఇవి వ్యాధినిరోధకత(Immunity Power)ను పెంచుతాయి. ఫుడ్ అలర్జీల(Food Allergy)ను తగ్గించడానికి, జాయింట్స్ బలపడటానికి మరియు సెల్యూలైట్‌ను తగ్గించేందుకు సహాయపడుతాయి. జుట్టు, చర్మం మెరిసేలా చేస్తుంది. గోళ్లు ఆరోగ్యంగా ఎదుగేందుకు సహకరిస్తుంది.

సీజన్ మారినప్పుడు వర్షాకాలం(Rainy Season)లో, శీతాకాలం(Winter Season)లో ఈ సూప్ ను గోరువెచ్చగా తాగడం వల్ల దగ్గు(Cough), జలుబు(Cold), గొంతులో ఇన్ఫెక్షన్(Throat Infection) వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు వున్నా మటన్ బోన్ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!

కావాల్సిన పదార్థాలు

మటన్ బోన్స్ – అరకిలో

ఉల్లిపాయలు – రెండు

పచ్చిమిర్చి – మూడు

టమాటోలు – రెండు

పసుపు – అర స్పూను

కారం – ఒక స్పూను

ధనియాల పొడి – అర స్పూను

జీలకర్ర పొడి – అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – మూడు స్పూనులు

పుదీనా తరుగు – మూడు స్పూనులు

జొన్న పిండి – రెండు స్పూనులు

మిరియాల పొడి – అరస్పూను

ఉల్లికాడల తరుగు – రెండు స్పూనులు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – ఒక టీస్పూను

బిర్యానీ ఆకు – రెండు

లవంగాలు – అయిదు

దాల్చిన చెక్క – ఒకటి

షాజీరా – ఒక స్పూను

మిరియాలు – పది

తయారు చేయు విధానం:

  • స్టవ్ పై కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా, మిరియాలు వేసి వేయించాలి.
  • నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేయించాలి. ఇవి వేగాక మటన్ బోన్స్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా దినుసుల ఫ్లేవర్(Flavor) ఎముకలకు పడుతుంది.
  • అయిదు నిమిషాల తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి నిమిషం పాటు వేయించాలి.
  • టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. అవి మెత్తగా అయ్యాక కారం, ఉప్పు, ధనియాల పొడి, పుదీనా తరుగు, కొత్తి మీర తరుగు కూడా వేసి కలపాలి.
  • అన్నింటినీ బాగా కలిపి నీళ్లు పోయాలి. కుక్కర్ మీద మూత పెట్టి అయిదు విజిల్స్ దాకా ఉంచాలి.
  • మరోపక్క గిన్నెలో జొన్న పిండి వేసి నీళ్లు పోస్తూ ఉండల్లేకుండా కలుపుకోవాలి.
  • ఇప్పుడు కుక్కర్ మూత తీసి మళ్లీ స్టవ్ మీద పెట్టాలి. అందులో కలుపుకున్న జొన్నపిండి(Corn Flour)ని వేసి బాగా కలపాలి.
  • మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. చివర్లో ఉల్లికాడల తరుగుతో గార్నిష్(Garnish) చేసి స్టవ్ కట్టేయాలి.
  • దీని టేస్టు చాలా బావుంటుంది. నాన్ వెజ్ ప్రియుల(Nonveg Lovers)కు చాలా నచ్చుతుంది.